త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Errolla Srinivas | రేవంత్ పాల‌న‌లో అడుగ‌డుగునా కుల వివ‌క్ష : ఎర్రోళ్ల శ్రీనివాస్

Errolla Srinivas | సీఎం రేవంత్ రెడ్డి పాల‌న‌లో అడుగ‌డుగునా కుల వివ‌క్ష క‌నిపిస్తోంద‌ని ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్ మాజీ చైర్మ‌న్ డాక్ట‌ర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిప‌డ్డారు. కాంగ్రెస్ మూడేండ్ల పాల‌న‌లో ఏనాడూ అంబేద్క‌ర్‌ను కాంగ్రెస్ గుర్తించ‌లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

S

Telangana | Published On Nov 26, 2026, 3.30 pm IST

Errolla Srinivas | రేవంత్ పాల‌న‌లో అడుగ‌డుగునా కుల వివ‌క్ష : ఎర్రోళ్ల శ్రీనివాస్
Advertisement

Errolla Srinivas | త్రినేత్ర న్యూస్ : సీఎం రేవంత్ రెడ్డి పాల‌న‌లో అడుగ‌డుగునా కుల వివ‌క్ష క‌నిపిస్తోంద‌ని ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్ మాజీ చైర్మ‌న్ డాక్ట‌ర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిప‌డ్డారు. కాంగ్రెస్ మూడేండ్ల పాల‌న‌లో ఏనాడూ అంబేద్క‌ర్‌ను కాంగ్రెస్ గుర్తించ‌లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేతలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్క‌ర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సంద‌ర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్ర‌భుత్వం ఇచ్చిన‌ పత్రికా ప్రకటనల్లో ఎక్కడా కూడా అంబేద్కర్ ఫోటోలు లేకపోవడం దుర్మార్గం. చేసిన పొర‌పాటుకు సీఎం రేవంత్, డిప్యూటీ భ‌ట్టి విక్ర‌మార్క క్ష‌మాప‌ణ‌ చెప్పాలి. అంబేద్క‌ర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. అందుకే కేసీఆర్ అంబేద్క‌ర్ పేరును సచివాలయానికి పెట్టారు. అంబేద్క‌ర్ పేరు ఉంద‌నే రేవంత్ రెడ్డి స‌చివాల‌యానికి వెళ్ల‌డం లేదు. 125 అడుగుల అంబేద్క‌ర్ విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారనే రేవంత్ రెడ్డి ఆ విగ్రహన్ని పట్టించుకోవడం లేదు. అంబేద్క‌ర్ అభ‌య హ‌స్తాన్ని, చేవెళ్ల డిక్ల‌రేష‌న్‌ను అమ‌లు చేయ‌డం లేదు. అణ‌గారిన వ‌ర్గాలను విస్మ‌రిస్తే మ‌రో ఉద్య‌మం త‌ప్ప‌ద‌ని ఎర్రోళ్ల శ్రీనివాస్ హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement