FMCG Stocks | ఎఫ్ఎంసీజీ షేర్లలో భారీ ర్యాలీ.. 17 ఏళ్ల రికార్డు.. ఇప్పుడు కొనవచ్చా..?
FMCG Stocks | భారత స్టాక్ మార్కెట్లలో ఎఫ్ఎంసీజీ రంగ షేర్లు నవంబర్ నెలలో ఇప్పటివరకు 14.5 శాతం రాబడిని అందించాయి. జూలై 2009 తర్వాత ఇదే అత్యుత్తమ నెలవారీ పనితీరు. వినియోగదారుల డిమాండ్ పెరగడం, కంపెనీల ఆదాయ వృద్ధి, విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు ఈ ర్యాలీకి ప్రధాన కారణాలుగా నిలిచాయి. మరోవైపు, ప్రస్తుత ర్యాలీ తర్వాత కూడా ఈ రంగ షేర్ల విలువలు ఐదేళ్ల సగటు కంటే తక్కువగా ఉండడం ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
FMCG Stocks | భారత స్టాక్ మార్కెట్లలో ఎఫ్ఎంసీజీ రంగ షేర్లు నవంబర్ నెలలో ఇప్పటివరకు 14.5 శాతం రాబడిని అందించాయి. జూలై 2009 తర్వాత ఇదే అత్యుత్తమ నెలవారీ పనితీరు. వినియోగదారుల డిమాండ్ పెరగడం, కంపెనీల ఆదాయ వృద్ధి, విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు ఈ ర్యాలీకి ప్రధాన కారణాలుగా నిలిచాయి. మరోవైపు, ప్రస్తుత ర్యాలీ తర్వాత కూడా ఈ రంగ షేర్ల విలువలు ఐదేళ్ల సగటు కంటే తక్కువగా ఉండడం ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
దూసుకుపోతున్న ఎఫ్ఎంసీజీ షేర్లు..
భారత ఎఫ్ఎంసీజీ రంగ షేర్లు నవంబర్‌లో దూసుకుపోతున్నాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ సూచీ ఈ నెలలో ఇప్పటివరకు 14.5 శాతం పెరిగి, 17 ఏళ్లలోనే అత్యధిక నెలవారీ లాభాన్ని నమోదు చేసే దిశగా పయనిస్తోంది. ఈ సూచీలోని అన్ని కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా, వాటి పెరుగుదల 8 నుంచి 16 శాతం మధ్య నమోదైంది. మారికో 16.5 శాతం లాభంతో అగ్రస్థానంలో నిలవగా, ఐటీసీ, గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ షేర్లు 16 శాతం చొప్పున పెరిగాయి. కోల్గేట్, ఎమామీ షేర్లు సుమారు 15 శాతం లాభపడ్డాయి. అయితే గురువారం నిఫ్టీ ఎఫ్ఎంసీజీ సూచీ 0.6 శాతం నష్టంతో ట్రేడయ్యింది.
పుంజుకున్న వినియోగదారుల డిమాండ్..
వినియోగదారుల డిమాండ్ పుంజుకోవడం ఈ రంగం వృద్ధికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో దేశంలోని టాప్ 60 కన్జ్యూమర్ కంపెనీల ఆదాయ వృద్ధి మధ్యస్థంగా సుమారు 16 శాతానికి చేరింది. ఇది దాదాపు మూడేళ్లలో అత్యధిక స్థాయి. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో ఈ కంపెనీల ఉత్పత్తుల అమ్మకాల పరిమాణం (వాల్యూమ్ గ్రోత్) కూడా సగటున 9 శాతంగా నమోదైంది. మరోవైపు, నవంబర్ మొదటి అర్ధభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఎఫ్ఎంసీజీ షేర్లలో 300 మిలియన్ డాలర్లకు పైగా నికర పెట్టుబడులు పెట్టారు. అయినప్పటికీ విదేశీ పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియోల్లో ఈ రంగానికి ఇంకా తక్కువ ప్రాధాన్యత ఉండడంతో భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.
పెట్టుబడులు పెట్టవచ్చా..?
కాగా భారీ ర్యాలీ తర్వాత కూడా నిఫ్టీ ఎఫ్ఎంసీజీ సూచీ ప్రస్తుత ఆదాయాల ఆధారంగా 35.4 రెట్ల పీఈ నిష్పత్తితో ట్రేడవుతోంది. ఇది గత ఐదేళ్ల సగటు 43.2 రెట్ల కంటే తక్కువ. వ్యక్తిగత షేర్లలో బజాజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ 2027-28 ఆర్థిక సంవత్సరం అంచనా ఆదాయాల ఆధారంగా 18.7 రెట్ల పీఈతో ట్రేడవుతుండగా, ఎమామీ 21.7 రెట్లు, జ్యోతి ల్యాబ్స్ 24.4 రెట్ల వద్ద ఉన్నాయి. అంచనా రాబడి అవకాశాల్లో పతంజలి 24 శాతంతో ముందుండగా, వరుణ్ బెవరేజెస్ 17 శాతం, బ్రిటానియా 12 శాతం రాబడి అవకాశాలను కలిగి ఉన్నాయని విశ్లేషణలు సూచిస్తున్నాయి. అయితే ముడి చమురు ధరలు, ముడిసరుకుల ద్రవ్యోల్బణం, వర్షపాతం లోటు వంటి అంశాలు ఈ రంగానికి సవాళ్లుగా మారనున్నాయి. గృహోపకరణాలు, వ్యక్తిగత సంరక్షణ, ఆహార పానీయాల విభాగాల్లో ఈబీఐటీడీఏ మార్జిన్లు గతేడాదితో పోలిస్తే తగ్గాయి. ధరల పెంపు కూడా ముడిసరుకుల వ్యయ భారాన్ని పూర్తిగా భర్తీ చేయలేకపోయింది. అందువల్ల రానున్న రోజుల్లో అమ్మకాల పరిమాణం, ముడి చమురు ధరలు, ఉత్పత్తి వ్యయాలు కీలకంగా మారనున్నాయి.
సంబంధిత వార్తలు

Godrej Consumer Products | వినియోగదారులకు షాకిచ్చిన గోద్రెజ్.. కన్స్యూమర్ ఉత్పత్తుల ధరలు పెంపు..
అక్టోబర్ 13, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. 879 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..
అక్టోబర్ 9, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో స్వల్ప నష్టాలు.. ఆటో, రియాల్టీ షేర్లకు దెబ్బ..
సెప్టెంబర్ 1, 2026
తాజావార్తలు
- ●Supreme Court | ఫుడ్ ప్యాకెట్లపై "రెడ్" వార్నింగ్ ఉండాల్సిందే.. FSSAIకి సుప్రీం కీలక ఆదేశాలు
- ●Sukesh Chandrashekhar | సుఖేష్ చంద్రశేఖర్ జీవితంపై వెబ్‌సిరీస్ - బాలీవుడ్ హీరోయిన్లతో సంబంధాలపై సంచలన నిజాలతో
- ●Sharad Pawar | మళ్లీ ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్
- ●Dasoju Sravan | భవిష్యత్ తరాలకు మంచి దేశాన్నివ్వాలి.. అందుకు రాజ్యాంగం చదవాలి
- ●Sai Pallavi | రామాయణకు అమిత్‌షా అభినందనలు - కేంద్రమంత్రిని కలిసిన రణబీర్, సాయిపల్లవి
- ●Web Series | పాకిస్థాన్ కంటెంట్‌ను భారత్‌లో ప్రసారం చేయొద్దు.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం కీలక ఆదేశాలు

Supreme Court | ఫుడ్ ప్యాకెట్లపై "రెడ్" వార్నింగ్ ఉండాల్సిందే.. FSSAIకి సుప్రీం కీలక ఆదేశాలు

Sukesh Chandrashekhar | సుఖేష్ చంద్రశేఖర్ జీవితంపై వెబ్‌సిరీస్ - బాలీవుడ్ హీరోయిన్లతో సంబంధాలపై సంచలన నిజాలతో

Sharad Pawar | మళ్లీ ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్

Dasoju Sravan | భవిష్యత్ తరాలకు మంచి దేశాన్నివ్వాలి.. అందుకు రాజ్యాంగం చదవాలి



