Amala Paul | పెళ్లి తర్వాత సినిమాల్లోకి అమలాపాల్ – తల్లి పాత్రలో మలయాళ బ్యూటీ
మలయాళ బ్యూటీ అమలాపాల్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతుంది. మలయాళ సినిమాలో తల్లి పాత్రలో నటించబోతుంది. పెళ్లితో పాటు మాతృత్వ బంధం కారణంగా సినిమాలకు గ్యాప్ ఈ ఇచ్చిన అమలాపాల్ దాదాపు రెండేళ్ల తర్వాత రీఎంట్రీ ఇవ్వబోతుంది.
Entertainment | Published On Nov 26, 2026, 3.24 pm IST
Amala Paul | పెళ్లి తర్వాత దాదాపు రెండేళ్ల విరామం అనంతరం మలయాళ బ్యూటీ అమలాపాల్ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతుంది. ఆమె రీఎంట్రీ మూవీ టొరంటో, ఇఫీతో పాటు పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో స్క్రీనింగ్ అయ్యింది. హాఫ్ అనే టైటిల్‌తో హాలీవుడ్‌లో ఫేమస్ అయిన వ్యాంపైర్ జానర్‌లో ఈ సినిమా తెరకెక్కింది. రంజీత్ సజీవ్, ఐశ్వర్య రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సమ్జద్ దర్శకత్వం వహించారు. రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో అమలాపాల్‌తో పాటు ప్రేమదేశం హీరో అబ్బాస్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అమలాపాల్ తల్లి పాత్రలో కనిపించబోతుంది. మనుషుల రక్తం తాగే వ్యాంపైర్‌గా చాలా వైవిధ్యంగా ఈ సీనియర్ హీరోయిన్ క్యారెక్టర్ సాగనున్నట్లు సమాచారం.
రాజస్థాన్ ఏడారుల్లో...
సగం మనుషులు, సగం వ్యాంపైర్లుగా ఉన్న ఇద్దరు అన్నాచెల్లెళ్ల కథతో దర్శకుడు సమ్జద్ ...హాఫ్ సినిమాను తెరకెక్కించారు. తమకు జరిగిన అన్యాయంపై వారిద్దరు ఎలా ప్రతీకారం తీర్చుకున్నారన్నదే ఈ మూవీ కథ. కేవలం గంటముప్పై ఆరు నిమిషాల రన్‌టైమ్‌తో రూపొందిన ఈ సినిమాలో ఒక్క స్లోమోషన్ సీన్ కూడా ఉండవని మేకర్స్ వెల్లడించారు. కంప్లీట్‌గా రాజస్థాన్‌లోని ఏడారుల్లో ఈ సినిమాను షూట్ చేసినట్లు తెలిపారు. కేవలం గంటముప్పై ఆరు నిమిషాల రన్‌టైమ్‌తో ఈ సినిమా ఉండబోతున్నట్లు చెబుతున్నారు.
తొలి సినిమా...
హాఫ్ మూవీ ఇటీవల టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్క్రీనింగ్ అయ్యింది. మిడ్‌నైట్ మ్యాడ్‌నెస్ అనే విభాగంలో పోటీపడిన తొలి మలయాళ సినిమాగా చరిత్రను సృష్టించింది. గోవాలో జరుగుతున్న 57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో (ఇఫీ)లో నవంబర్ 24న హాఫ్ సినిమాను స్క్రీనింగ్ చేశారు. ఈ ప్రీమియర్‌లో అమలాపాల్, అబ్బాస్‌తో పాటు ప్రధాన పాత్రధారులు పాల్గొన్నారు. త్వరలో మలయాళం, తెలుగు, హిందీతో పాటు మరో నాలుగు భాషల్లో ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.
పెళ్లైన ఏడు నెలలకే....
తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌ని పెళ్లిచేసుకుంది అమలపాల్. మనస్పర్థల కారణంగామూడేళ్లకే ఈ జంట విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత బిజినెస్‌మెన్ జగత్ దేశాయ్‌తో ప్రేమలో పడిన అమలాపాల్ 2023లో అతడితో ఏడడుగులు వేసింది. పెళ్లైన ఏడు నెలలకే ఈ జంటకు కొడుకు పుట్టాడు. మాతృత్వ బంధం కారణంగా రెండేళ్ల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన అమలాపాల్ హాఫ్‌తో మళ్లీ సిల్వర్‌స్క్రీన్‌పై కనిపించబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Nidhhi Agerwal | మలయాళంలో లక్కీ ఛాన్స్ కొట్టేసిన నిధి అగర్వాల్ – మైథాలజీ సినిమాలో హీరోయిన్గా!
నవంబర్ 22, 2026

Hero Nani | దుల్కర్ సల్మాన్ హీరో – నాని ప్రొడ్యూసర్ – కొత్త కాంబో ఫిక్స్
నవంబర్ 19, 2026

Malayalam OTT | ఇరుముడి టీచర్ మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ – ఒక్క రాత్రిలో జరిగే కథ
నవంబర్ 1, 2026
తాజావార్తలు
- ●Google Gemini | గూగుల్ జెమినిలో అద్భుతమైన ఫీచర్.. డిస్కౌంట్లు, డీల్స్ ఎప్పటికప్పుడు చెబుతుంది..
- ●Errolla Srinivas | రేవంత్ పాలనలో అడుగడుగునా కుల వివక్ష : ఎర్రోళ్ల శ్రీనివాస్
- ●Apple Store | హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. త్వరలో యాపిల్ ఫస్ట్ రిటైల్ స్టోర్.. ఎక్కడంటే..?
- ●Uterus | బాలుడి కడుపులో గర్భాశయం.. పరిగిలో వెలుగు చూసిన ఘటన
- ●BM Sandip Kumar | దేశ రాజ్యాంగం కాంగ్రెస్ రాజ్యాంగం ఒక్కటే
- ●WhatsApp | వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. 14 రోజుల ముందే మెసేజ్ షెడ్యూల్..

Google Gemini | గూగుల్ జెమినిలో అద్భుతమైన ఫీచర్.. డిస్కౌంట్లు, డీల్స్ ఎప్పటికప్పుడు చెబుతుంది..

Errolla Srinivas | రేవంత్ పాలనలో అడుగడుగునా కుల వివక్ష : ఎర్రోళ్ల శ్రీనివాస్

Apple Store | హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. త్వరలో యాపిల్ ఫస్ట్ రిటైల్ స్టోర్.. ఎక్కడంటే..?

Uterus | బాలుడి కడుపులో గర్భాశయం.. పరిగిలో వెలుగు చూసిన ఘటన



