WhatsApp CarPlay | ఇక కార్లలోనూ వాట్సాప్ యాప్.. కమ్యూనికేషన్ మరింత సులభతరం..
WhatsApp CarPlay | వాట్సాప్ తన సేవలను స్మార్ట్‌ఫోన్‌లు, డెస్క్‌టాప్‌లకే పరిమితం చేయకుండా మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. గత సంవత్సరం నవంబర్‌లో యాపిల్ వాచ్ కోసం నేటివ్ యాప్‌ను ప్రకటించిన ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్, ఈ సంవత్సరం ప్రారంభంలో కొన్ని గార్మిన్ స్మార్ట్‌వాచ్‌లకు కూడా ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
Technology | Published On Apr 1, 2026, 3.10 pm IST
WhatsApp CarPlay | వాట్సాప్ తన సేవలను స్మార్ట్‌ఫోన్‌లు, డెస్క్‌టాప్‌లకే పరిమితం చేయకుండా మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. గత సంవత్సరం నవంబర్‌లో యాపిల్ వాచ్ కోసం నేటివ్ యాప్‌ను ప్రకటించిన ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్, ఈ సంవత్సరం ప్రారంభంలో కొన్ని గార్మిన్ స్మార్ట్‌వాచ్‌లకు కూడా ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. యాపిల్ కార్ ప్లే కోసం నేటివ్ వాట్సాప్ యాప్ ను ఐఓఎస్ బీటా ప్రోగ్రామ్ యూజర్లు, డెవలపర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఫీచర్ ట్రాకర్ WABetaInfo ప్రకారం ఐఓఎస్ కోసం తాజా బీటా వెర్షన్‌లో వాట్సాప్ కార్ ప్లే పేరిట ప్రత్యేక యాప్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఇది టెస్ట్ ఫ్లైట్ యాప్ ద్వారా బీటా యూజర్లు, డెవలపర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇది భవిష్యత్తులో అధికారిక ఐఓఎస్ అప్‌డేట్‌లో భాగంగా అందుబాటులోకి రానుంది. అయితే ఈ యాప్ పై యాపిల్ లేదా వాట్సాప్ ఎలాంటి అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు.
డ్రైవింగ్ సమయంలో మాత్రం పరిమితులు..
ఈ కార్ ప్లే యాప్ ద్వారా యూజర్లు 20 నుంచి 25 రోజులలో చాట్ చేసిన కాంటాక్ట్‌ల హిస్టరీని చూడవచ్చు. అయితే చాట్ విండోలను నేరుగా ఓపెన్ చేసే అవకాశం ఉండదు. డ్రైవింగ్ సమయంలో దృష్టి మరలకుండా ఉండేందుకు ఈ పరిమితిని విధించారు. కార్ ప్లేలోని వాట్సాప్ యాప్ చాట్‌లపై మరింత సమాచారం అందిస్తుంది. ఏ చాట్‌లు మ్యూట్ అయ్యాయో, పిన్ అయ్యాయో తెలియజేస్తుంది. అలాగే చివరిసారిగా మెసేజ్ పంపిన లేదా అందుకున్న సమయాన్ని కూడా చూపిస్తుంది. యూజర్లు కాంటాక్ట్ వివరాలను కూడా చూడగలుగుతారు. ఒక చాట్‌ను ఎంచుకుంటే ఆ వ్యక్తి పేరు, ప్రొఫైల్ ఫోటో వంటి వివరాలు కొత్త విండోలో కనిపిస్తాయి. అదే స్క్రీన్ నుంచి వాయిస్ కాల్ ప్రారంభించడం లేదా వాయిస్ డిక్టేషన్ ద్వారా మెసేజ్ ను పంపించడం కూడా వీలవుతుంది. అలాగే వాట్సాప్ కాల్ హిస్టరీని ప్రత్యేక కాల్స్ విభాగంలో చెక్ చేసుకోవచ్చు.
మెసేజ్‌లను పంపాలంటే..
ప్రస్తుతం యాపిల్ కార్‌ప్లే లో వాట్సాప్ నోటిఫికేషన్‌లకు మాత్రమే సపోర్ట్ ఉంది. డ్రైవింగ్ సమయంలో మెసేజ్‌లను సిస్టమ్ చదివి వినిపిస్తుంది. సమాధానం ఇవ్వాలంటే ఐఓఎస్‌లోని డిజిటిల్ అసిస్టెంట్ Siri ద్వారా వాయిస్ డిక్టేషన్ ఉపయోగించాలి. వాట్సాప్ కాల్స్ కూడా కార్ ప్లే లో కనిపిస్తాయి, కానీ అవి ఐఫోన్ లోని కాల్ యాప్ లో లాగ్‌లో దర్శనమిస్తాయి. కొత్త నేటివ్ వాట్సాప్ కార్‌ప్లే యాప్ అధికారికంగా విడుదలైతే డ్రైవింగ్ సమయంలో కమ్యూనికేషన్ మరింత సులభతరం అవుతుంది. అయితే భద్రత దృష్ట్యా కొన్ని పరిమితులను విధించనున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






