WhatsApp Business | వాట్సాప్ బిజినెస్ యాప్‌లో ఇక ఏఐ.. వ్యాపారుల పని మరింత సులువు..
WhatsApp Business | ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన బిజినెస్ యాప్ యూజర్లకు బిజినెస్ ఏఐ పేరిట ఓ నూతన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు వాట్సాప్ మాతృసంస్థ మెటా ఒక ప్రకటన విడుదల చేసింది. బిజినెస్ ఏఐ ఫీచర్ సహాయంతో వ్యాపారులు తమ కార్యకలాపాలను వాట్సాప్ బిజినెస్ యాప్‌లో మరింత సులభంగా నిర్వహించేందుకు వీలుంటుంది.
Technology | Published On May 8, 2026, 2.15 pm IST
WhatsApp Business | ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన బిజినెస్ యాప్ యూజర్లకు బిజినెస్ ఏఐ పేరిట ఓ నూతన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు వాట్సాప్ మాతృసంస్థ మెటా ఒక ప్రకటన విడుదల చేసింది. బిజినెస్ ఏఐ ఫీచర్ సహాయంతో వ్యాపారులు తమ కార్యకలాపాలను వాట్సాప్ బిజినెస్ యాప్‌లో మరింత సులభంగా నిర్వహించేందుకు వీలుంటుంది. దీని వల్ల యూజర్లకు చాట్‌లలోనే ఏఐ ఆధారిత కస్టమర్ సపోర్ట్, ఆటోమేషన్ వంటి సేవలను అందించవచ్చు. ఈ ఫీచర్‌తో వ్యాపారులు తమ కస్టమర్లతో ఇంటారక్షన్లను నిర్వహించడం ఆటోమేట్ చేయవచ్చు. ప్రశ్నలకు సమాధాలు ఇవ్వడం, ప్రాథమిక వ్యాపార కార్యకలాపాలను నేరుగా వాట్సాప్‌లోనే నిర్వహించడం సులభతరం అవుతుంది.
భారీ స్థాయిలో కమ్యూనికేషన్ కోసం..
బిజినెస్ యాప్ ద్వారా భారీ స్థాయిలో కస్టమర్లతో కమ్యూనికేషన్ చేసేందుకు గాను ఈ బిజినెస్ ఏఐ అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్లు వాట్సాప్ తెలిపింది. వ్యాపారానికి అందుబాటులో ఉన్న సమాచారంతో ఇది యూజర్లు ఇచ్చే మెసేజ్‌లకు రిప్లైలు ఇస్తుంది. దీంతోపాటు సాధారణ వ్యాపార కార్యకలాపాలకు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫీచర్ వల్ల వ్యాపారులు రోజులో 24/7 కస్టమర్లు అడిగే ప్రశ్నలకు వెంటనే స్పందించవచ్చు. ఉత్పత్తులు, ధరలు, సేవలు, రాయితీలు, షిప్పింగ్ వంటి తరచూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వవచ్చు. లీడ్స్ సేకరించి అపాయింట్‌మెంట్ బుకింగ్‌లో సహాయపడుతుంది. ఉత్పత్తి సిఫార్సులు, సేల్స్ సంభాషణలకు మద్దతు ఇస్తుంది. బిజినెస్ క్యాటలాగ్, అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్ల ఆధారంగా సందర్భానుసార సమాధానాలు ఇస్తుంది.

సొంత సమాచారంతో కాన్ఫిగర్ చేయొచ్చు..
వ్యాపార సంస్థలు తమ సొంత సమాచారాన్ని ఉపయోగించి ఏఐ ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. దీంతో సమాధానాలు ఆయా ఉత్పత్తులు, సేవలకు అనుగుణంగా ఉంటాయి. ఆటోమేషన్ ఉన్నప్పటికీ పూర్తి నియంత్రణ వ్యాపార యజమానుల చేతుల్లోనే ఉంటుందని వాట్సాప్ స్పష్టం చేసింది. అవసరమైనప్పుడు యజమానులు చాట్ సంభాషణల్లో జోక్యం చేసుకుని ఏఐ నుంచి నియంత్రణను స్వీకరించవచ్చు. అలాగే బిజినెస్ ఏఐ స్పందించే విధానాన్ని మార్చుకోవడం లేదా పూర్తిగా డిసేబుల్ చేయడం కూడా సాధ్యమవుతుంది. భవిష్యత్ అప్‌డేట్‌లో చాట్‌లలోనే యూపీఐ ఆధారిత చెల్లింపులను ప్రవేశపెట్టనున్నట్లు వాట్సాప్ తెలిపింది. దీంతో వేరే ప్లాట్‌ఫామ్‌కు మారకుండా నేరుగా చాట్ ఇంటర్‌ఫేస్‌లోనే లావాదేవీలు పూర్తి చేయవచ్చు.
ఎలా యాక్టివేట్ చేయాలి..
వాట్సాప్ బిజినెస్ యాప్ ఉపయోగిస్తున్న అర్హత కలిగిన వ్యాపార సంస్థలు గైడెడ్ ప్రాసెస్ ద్వారా ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం టూల్స్ ట్యాబ్ ఓపెన్ చేయాలి. యువర్ బిజినెస్ ఏఐ ని ఎంపిక చేయాలి. సెటప్ సూచనలను అనుసరించాలి. ఫీచర్ యాక్టివేట్ అయిన తర్వాత బిజినెస్ ప్రొఫైల్ డేటా, ప్రొడక్ట్ క్యాటలాగ్, అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్ల ఆధారంగా బిజినెస్ ఏఐ కస్టమర్ సంభాషణలను నిర్వహించడం ప్రారంభిస్తుంది. ఇది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, ఉత్పత్తి వివరాలు అందించడం, సేల్స్‌కు సంబంధించిన ఇంటరాక్షన్లలో సహాయపడుతుంది. వ్యాపార సంస్థలు ఎప్పుడైనా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు లేదా ఈ ఫీచర్‌ను ఆఫ్ చేయవచ్చు.
భారత్‌లో అర్హత కలిగిన వాట్సాప్ బిజినెస్ వినియోగదారులకు బిజినెస్ ఏఐ ఫీచర్‌ను దశలవారీగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇది అన్ని భారతీయ స్థానిక భాషలకు మద్దతు ఇస్తుందని వాట్సాప్ తెలిపింది. రాబోయే వారాల్లో మరిన్ని వ్యాపార సంస్థలకు ఈ సేవ అందుబాటులోకి రానుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






