WhatsApp | వాట్సాప్‌లో ట్యాబ్లెట్ యూజర్లకు భారీ అప్‌డేట్.. ఇక ఐప్యాడ్, ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లలో కొత్త సౌకర్యాలు..
WhatsApp | వాట్సాప్ ట్యాబ్లెట్ వినియోగదారుల కోసం రెండు కీలక మార్పులను తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అర్హత ఉన్న ఐప్యాడ్ వినియోగదారులు త్వరలో వాట్సాప్‌ను తమ ప్రైమరీ డివైస్‌గా నేరుగా సెటప్ చేసుకునే అవకాశం పొందనున్నారు.
Technology | Published On Jul 4, 2026, 2.16 pm IST
WhatsApp | వాట్సాప్ ట్యాబ్లెట్ వినియోగదారుల కోసం రెండు కీలక మార్పులను తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అర్హత ఉన్న ఐప్యాడ్ వినియోగదారులు త్వరలో వాట్సాప్‌ను తమ ప్రైమరీ డివైస్‌గా నేరుగా సెటప్ చేసుకునే అవకాశం పొందనున్నారు. అలాగే కొన్ని ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ యూజర్లకు అకౌంట్ రిజిస్ట్రేషన్ సమయంలో కొత్త డిజైన్‌తో కూడిన సెటప్ ఇంటర్‌ఫేస్ కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ఫీచర్లు పెద్ద స్క్రీన్ డివైస్‌లలో వాట్సాప్ సెటప్‌ను మరింత సులభతరం చేయడంతోపాటు కంపానియన్ మోడ్‌లో ఉన్న పరిమితులను తొలగించనున్నాయి. ప్రస్తుతం ఈ ఫీచర్లు పరిమిత సంఖ్యలో వినియోగదారులకు దశలవారీగా అందుబాటులోకి వస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
క్యూఆర్ కోడ్ లింకింగ్ అవసరం లేదు..
డబ్ల్యూఏబీటాఇన్ఫో నివేదిక ప్రకారం ఐప్యాడ్ ఓఎస్ వెర్షన్ 26.25.74లో వాట్సాప్ కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా అర్హత ఉన్న వినియోగదారులు ఇప్పటికే ఉన్న స్మార్ట్‌ఫోన్‌కు క్యూ ఆర్ కోడ్ ద్వారా లింక్ చేయకుండా, తమ ఫోన్ నంబర్, ఆరు అంకెల వెరిఫికేషన్ కోడ్‌తో నేరుగా ఐప్యాడ్‌లో వాట్సాప్‌ను యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. వెరిఫికేషన్ కోడ్‌కు బదులుగా ఇప్పటికే సేవ్ చేసిన పాస్‌కీలను కూడా ఉపయోగించవచ్చని నివేదిక పేర్కొంది. ఈ ఫీచర్ తాజా టెస్ట్‌ఫ్లైట్ బిల్డ్‌లో కూడా అందుబాటులో ఉండగా, దశలవారీగా మరింత మంది వినియోగదారులకు విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు ఐప్యాడ్ యాప్‌లో కేవలం కంపానియన్ మోడ్ మాత్రమే అందుబాటులో ఉండేది. దీంతో లైవ్ లొకేషన్ షేరింగ్, బ్రాడ్‌కాస్ట్ లిస్టులు, ఫ్లోస్ ద్వారా బిజినెస్‌లతో కమ్యూనికేషన్ వంటి ఫీచర్లను ఉపయోగించే అవకాశం ఉండేది కాదు. అలాగే ప్రైమరీ ఫోన్‌లో వరుసగా 14 రోజుల పాటు వాట్సాప్ యాక్టివ్‌గా లేకపోతే లింక్ చేసిన ఐప్యాడ్ నుంచి ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ అయ్యేది.
ఐప్యాడ్‌ను ప్రైమరీ డివైస్‌గా మారిస్తే..
అయితే ఐప్యాడ్‌ను ప్రైమరీ డివైస్‌గా నమోదు చేసుకోవడం ద్వారా ఈ పరిమితులన్నీ తొలగిపోతాయి. కంపానియన్ మోడ్‌లో అందుబాటులో లేని ఫీచర్లను కూడా వినియోగించుకోవచ్చు. అలాగే మరో డివైస్‌పై ఆధారపడి ఉండే 14 రోజుల ఇనాక్టివిటీ లాగ్ అవుట్ సమస్య కూడా ఉండదు. మరో నివేదిక ప్రకారం, వాట్సాప్ ఇటీవల విడుదల చేసిన బీటా వెర్షన్లలో ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ల కోసం కొత్త సెటప్ స్క్రీన్‌ను పరీక్షిస్తోంది. కొంతమంది బీటా టెస్టర్లకు రెండు ఎంపికలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న అకౌంట్‌ను కంపానియన్‌గా లింక్ చేయడం లేదా ట్యాబ్లెట్‌ను ప్రైమరీ డివైస్‌గా మార్చడం పేరిట రెండు ఆప్షన్‌లను ఇస్తున్నారు. ప్రస్తుతం కూడా ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లలో ప్రైమరీ రిజిస్ట్రేషన్‌కు మద్దతు ఉన్నప్పటికీ, కొత్త ఇంటర్‌ఫేస్ ద్వారా రెండు విధానాలను ఒకే స్క్రీన్‌లో అందించనున్నారు.
ఎలా చేయాలి..
ప్రైమరీ డివైస్ ఎంపికను ఎంచుకుంటే సాధారణ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. వినియోగదారులు తమ ఫోన్ నంబర్, ఆరు అంకెల వెరిఫికేషన్ కోడ్‌తో అకౌంట్‌ను ధ్రువీకరించాలి. అనంతరం ట్యాబ్లెట్ ప్రైమరీ డివైస్‌గా మారుతుంది. ఆ తర్వాత గూగుల్ డ్రైవ్ నుంచి చాట్ హిస్టరీని రీస్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాట్సాప్ ఒక అకౌంట్‌కు ఒకే ప్రైమరీ డివైస్‌ను మాత్రమే అనుమతిస్తుంది. అందువల్ల ట్యాబ్లెట్ ప్రైమరీ డివైస్‌గా మారిన తర్వాత, గతంలో ప్రైమరీగా ఉన్న ఫోన్ ఆటోమేటిక్‌గా సైన్ అవుట్ అవుతుంది. అయితే ఆ ఫోన్‌ను తర్వాత కంపానియన్ డివైస్‌గా మళ్లీ లింక్ చేసుకోవచ్చు. ప్రైమరీ డివైస్‌గా సెటప్ చేసిన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లలో స్మార్ట్‌ఫోన్‌లలో ఉండే అన్ని ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. లైవ్ లొకేషన్ షేరింగ్, బ్రాడ్‌కాస్ట్ లిస్టులు వంటి కంపానియన్ మోడ్ పరిమితులు తొలగిపోతాయి. అలాగే మరో డివైస్ 14 రోజుల పాటు యాక్టివ్‌గా లేకపోవడం వల్ల ఆటోమేటిక్ లాగ్ అవుట్ అయ్యే సమస్య కూడా ఉండదు.
వద్దనుకుంటే పాత విధానమే..
అయితే తమ అకౌంట్‌ను ట్యాబ్లెట్‌కు బదిలీ చేయాలనుకోని వినియోగదారులు పాత విధానంలోనే కంపానియన్ డివైస్‌గా లింక్ చేసుకునే అవకాశం కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ కొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ సెటప్ ఇంటర్‌ఫేస్ కొంతమంది బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. దీనిని దశలవారీగా మరింత మందికి విడుదల చేస్తున్నారు. స్థిరమైన వెర్షన్‌లో ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై వాట్సాప్ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Gold Monetisation Scheme | ఇకపై బంగారాన్ని డిపాజిట్ చేసి వడ్డీ పొందొచ్చు.. కొత్త స్కీమ్ ప్రవేశపెట్టనున్న కేంద్రం..?
- ●Telegram | పైరసీ కంటెంట్.. టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు
- ●Gadari Kishore | రేవంత్ నడిపేది సర్కారా.. సర్కసా?.. మాకైతే అర్థమైతలే
- ●Jairam Ramesh | ట్రిపుల్ ఇంజిన్ పాలనలో.. ఓట్ చోరీ, సీట్ చోరీ, డొనేషన్ చోరీ : జైరాం రమేష్
- ●IBPS SO Recruitment | ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. డిగ్రీ, పీజీ చేసినవారు అర్హులు
- ●Flipkart GOAT Sale 2026 | ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ షురూ.. ఫోన్లపై భారీ తగ్గింపు ధరలు..

Gold Monetisation Scheme | ఇకపై బంగారాన్ని డిపాజిట్ చేసి వడ్డీ పొందొచ్చు.. కొత్త స్కీమ్ ప్రవేశపెట్టనున్న కేంద్రం..?

Telegram | పైరసీ కంటెంట్.. టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు

Gadari Kishore | రేవంత్ నడిపేది సర్కారా.. సర్కసా?.. మాకైతే అర్థమైతలే

Jairam Ramesh | ట్రిపుల్ ఇంజిన్ పాలనలో.. ఓట్ చోరీ, సీట్ చోరీ, డొనేషన్ చోరీ : జైరాం రమేష్






