WhatsApp | వాట్సాప్ అప్‌డేట్.. ఐప్యాడ్ రిజిస్ట్రేషన్ నుంచి మ్యూజిక్ స్టేటస్ వరకు కొత్త ఫీచర్లు..
WhatsApp | ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ పలు కొత్త ఫీచర్లను ప్రకటించింది. ఇందులో ఐప్యాడ్‌లో నేరుగా అకౌంట్ నమోదు చేసుకునే అవకాశం, యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలో మెరుగైన ఇంటిగ్రేషన్, వెబ్, డెస్క్‌టాప్‌లో పీడీఎఫ్ ఎడిటింగ్ టూల్స్, అలాగే వాట్సాప్ స్టేటస్‌లో మ్యూజిక్ షేర్ చేసే సదుపాయం ఉన్నాయి.
Technology | Published On Jul 25, 2026, 10.08 am IST
WhatsApp | ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ పలు కొత్త ఫీచర్లను ప్రకటించింది. ఇందులో ఐప్యాడ్‌లో నేరుగా అకౌంట్ నమోదు చేసుకునే అవకాశం, యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలో మెరుగైన ఇంటిగ్రేషన్, వెబ్, డెస్క్‌టాప్‌లో పీడీఎఫ్ ఎడిటింగ్ టూల్స్, అలాగే వాట్సాప్ స్టేటస్‌లో మ్యూజిక్ షేర్ చేసే సదుపాయం ఉన్నాయి. ఈ కొత్త అప్‌డేట్లతో వివిధ డివైస్‌లు, ఇతర యాప్‌లతో వాట్సాప్ అనుసంధానం మరింత మెరుగుపడనుంది. దీంతో వినియోగదారులు వివిధ ప్లాట్‌ఫామ్‌లలో తమ చాట్‌లు, కాల్స్, ఇతర ఫీచర్లను మరింత సులభంగా ఉపయోగించుకోవచ్చు. వాట్సాప్ ఫర్ ఐప్యాడ్ ప్రారంభమైనప్పటి నుంచి, ఫోన్‌కు లింక్ చేయకుండా నేరుగా ఐప్యాడ్‌లోనే అకౌంట్ సృష్టించుకునే అవకాశం ఇవ్వాలని వినియోగదారులు కోరుతున్నారు. ఇప్పుడు ఆ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. తాజా అప్‌డేట్‌తో వినియోగదారులు ఐప్యాడ్‌లోని వాట్సాప్ యాప్ నుంచే కొత్త అకౌంట్ నమోదు చేసుకుని, సెటప్ పూర్తి చేసి వెంటనే వాట్సాప్‌ను ఉపయోగించవచ్చు.
కారులో హ్యాండ్స్ ఫ్రీగా వాట్సాప్ యూసేజ్..
యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలో కూడా వాట్సాప్ అప్‌డేట్ ను మరింత మెరుగుపరిచింది. తాజా ఇంటిగ్రేషన్ ద్వారా కారు డిస్‌ప్లే నుంచే హ్యాండ్స్‌ఫ్రీగా మెసేజ్‌లు వినడం, వాటికి సమాధానం ఇవ్వడం, కాల్స్ చేయడం, కాల్ హిస్టరీ చూడడం, ఫేవరెట్ కాంటాక్ట్‌లను యాక్సెస్ చేయడం వంటి సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. వెబ్, డెస్క్‌టాప్ వెర్షన్‌లలో పీడీఎఫ్ ఫైళ్లను వేరుగా డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా చాట్‌లోనే నేరుగా ఓపెన్ చేసుకునే అవకాశం కల్పించింది. అంతేకాకుండా పీడీఎఫ్‌లలో హైలైట్ చేయడం, అనోటేషన్లు జోడించడం వంటి తేలికపాటి ఎడిటింగ్ పనులను కూడా చాట్‌లోనే చేయవచ్చు. ఈ ఫీచర్‌కు అడోబ్ అక్రోబాట్ సాంకేతికత మద్దతు ఇస్తోంది.
స్టేటస్‌లో మ్యూజిక్..
మరో కొత్త ఫీచర్‌గా యాపిల్ మ్యూజిక్, స్పాటిఫై నుంచి పాటలను నేరుగా వాట్సాప్ స్టేటస్‌లో షేర్ చేయవచ్చు. స్టేటస్‌లో షేర్ చేసిన తర్వాత, వినియోగదారు ప్రస్తుతం ఏ పాట వింటున్నారో వారి స్నేహితులు స్టేటస్ ద్వారా చూడగలుగుతారు. వాట్సాప్ తెలిపిన ప్రకారం, ఈ అన్ని కొత్త ఫీచర్లు సపోర్ట్ ఉన్న డివైస్‌లు, ప్లాట్‌ఫామ్‌లలో దశలవారీగా అందుబాటులోకి వస్తున్నాయి.
సంబంధిత వార్తలు

Apple | ఐక్లౌడ్ సేవలను విస్తరించిన యాపిల్.. నెలకు రూ.75కే ప్లాన్, 50జీబీ స్టోరేజ్..
సెప్టెంబర్ 15, 2026

WhatsApp | ఇక బిల్లులన్నీ వాట్సాప్‌లోనే చెల్లించవచ్చు.. కొత్త అప్‌డేట్ వచ్చేసింది..
సెప్టెంబర్ 3, 2026

WhatsApp | వాట్సాప్ యూజర్లకు కొత్త సెక్యూరిటీ ఫీచర్లు.. ఇక అకౌంట్ మరింత సేఫ్..
ఆగస్టు 27, 2026
తాజావార్తలు
- ●Kishan Reddy | తెలంగాణకు 2 లక్షల ఇళ్లు.. పీఎంఏవై–జీ కింద కేంద్రం ఆమోదం: కిషన్‌రెడ్డి
- ●TG Assembly | ఎల్‌నినోతో వర్షాభావ పరిస్థితులు.. కేంద్రం ఆదుకోవాలని శాసనసభలో ముసాయిదా తీర్మానం
- ●TGPSC | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. HMWSSBలో 130 మేనేజర్ పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్..!
- ●John Wesley | అన్యాక్రాంత ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవాలి.. సీపీఐ(ఎం) జాన్‌వెస్లీ డిమాండ్..
- ●Madhu Yaskhi | జీవో 118 బాధితులకు శాశ్వత పరిష్కారం.. మంత్రులతో మధుయాష్కి భేటీ
- ●TG Assembly | ముగిసిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. 8 రోజులు.. 51 గంటల 52 నిమిషాలు నడిచిన సభ

Kishan Reddy | తెలంగాణకు 2 లక్షల ఇళ్లు.. పీఎంఏవై–జీ కింద కేంద్రం ఆమోదం: కిషన్‌రెడ్డి

TG Assembly | ఎల్‌నినోతో వర్షాభావ పరిస్థితులు.. కేంద్రం ఆదుకోవాలని శాసనసభలో ముసాయిదా తీర్మానం

TGPSC | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. HMWSSBలో 130 మేనేజర్ పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్..!

John Wesley | అన్యాక్రాంత ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవాలి.. సీపీఐ(ఎం) జాన్‌వెస్లీ డిమాండ్..



