USB Type-C Port | ఫోన్‌కు ఉండే టైప్-సి పోర్టును ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో తెలుసా..?
USB Type-C Port | ప్రస్తుతం కంపెనీలు తయారు చేసి విడుదల చేస్తున్న అన్ని స్మార్ట్ ఫోన్లకు యూఎస్‌బీ టైప్ సి కేబుల్స్‌ను అందిస్తున్న విషయం విదితమే. గతంలో చార్జింగ్ లేదా డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఆయా కంపెనీలు భిన్న రకాల పోర్టులను ఇచ్చేవి. కానీ ఇప్పుడు అన్ని కంపెనీలు తమ ఫోన్లలో యూఎస్‌బీ టైప్ సి పోర్టులనే ఇస్తున్నాయి.
Technology | Published On Dec 27, 2025, 10.13 am IST
USB Type-C Port | ప్రస్తుతం కంపెనీలు తయారు చేసి విడుదల చేస్తున్న అన్ని స్మార్ట్ ఫోన్లకు యూఎస్‌బీ టైప్ సి కేబుల్స్‌ను అందిస్తున్న విషయం విదితమే. గతంలో చార్జింగ్ లేదా డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఆయా కంపెనీలు భిన్న రకాల పోర్టులను ఇచ్చేవి. కానీ ఇప్పుడు అన్ని కంపెనీలు తమ ఫోన్లలో యూఎస్‌బీ టైప్ సి పోర్టులనే ఇస్తున్నాయి. దీంతో ఫోన్లను వేగంగా చార్జింగ్ చేసుకోవడంతోపాటు డేటాను సైతం వేగంగా ట్రాన్స్ ఫర్ చేసుకునే వెసులు బాటు కలిగింది. యూఎస్‌బీ టైప్ సి పోర్ట్ లు చాలా వేగంగా పనిచేస్తాయి. కనుక ఆయా పనులను మనం వేగంగా చేసుకోగలుగుతున్నాం. అయితే మన ఫోన్లలో ఇచ్చే యూఎస్‌బీ టైప్ సి పోర్టులు లేదా వాటికి అందించే కేబుల్స్ ను మనం కేవలం చార్జింగ్ లేదా డేటా ట్రాన్స్ ఫర్ కోసమే ఉపయోగిస్తాం. అయితే వాస్తవానికి ఆ పోర్టులతో ఇంకా పలు రకాల పనులను కూడా చేసుకోవచ్చు. ఆ పోర్టులు మనకు ఇతర విధాలుగా కూడా ఉపయోగపడతాయి.
ఓటీజీ పోర్టులుగా..
స్మార్ట్ ఫోన్లకు ఉండే యూఎస్‌బీ టైప్ సి పోర్టులను మనం యూఎస్‌బీ ఓటీజీ పోర్టులుగా కూడా వాడవచ్చు. అంటే పెన్ డ్రైవ్‌లు లేదా ఎక్స్‌టర్నల్ హార్డ్ డ్రైవ్‌లను ఆ పోర్టుకు కేబుల్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. దీని వల్ల డేటా కాపీ కోసం కంప్యూటర్‌పై ఆధార పడాల్సిన పనిలేదు. పెన్ డ్రైవ్ అయితే టైప్ సి టు టైప్ ఎ కన్వర్టర్ కేబుల్‌తో ఫోన్‌కు కనెక్ట్ చేయవచ్చు. ఇక ఎక్స్‌టర్నర్ హార్డ్ డిస్క్ అయితే దానికి డిఫాల్ట్‌గా టైప్-సి కేబుల్ ఇస్తారు. కనుక దాన్ని ఎలాంటి కన్వర్టర్ లేకుండా నేరుగా ఫోన్‌కు కనెక్ట్ చేయవచ్చు. ఈ క్రమంలో ఫోన్‌లో ఉండే ముఖ్యమైన లేదా పెద్ద సైజ్‌లో ఉండే ఫైల్స్‌ను ఆ డ్రైవ్‌లలోకి సులభంగా ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. దీంతో డేటాను కాపీ చేయడం చాలా సులభతరం అవుతుంది. డేటాను ఎప్పటికప్పుడు భద్ర పరుచుకోవచ్చు. ఇక ఈ పనికిగాను కంప్యూటర్ ను వాడాల్సిన అవసరం ఉండదు. ఫోన్‌కు చెందిన యూఎస్‌బీ టైప్ సి పోర్టు ద్వారానే పని మొత్తం పూర్తవుతుంది. ఎలాగూ ఆ పోర్టు ద్వారా డేటాను వేగంగా కాపీ చేయవచ్చు. కనుక ఇలా మన పని చాలా ఈజీ అవుతుంది.

ఇతర ఫోన్లను చార్జింగ్..
ఇక ప్రస్తుతం చాలా వరకు ఫోన్లకు రివర్స్ వైర్డ్ చార్జింగ్ అనే ఫీచర్‌ను అందిస్తున్నారు. దీని వల్ల ఒక ఫోన్‌తో ఇంకో ఫోన్‌ను చార్జింగ్ చేయవచ్చు. ఇందుకు చేయాల్సిందల్లా సింపుల్‌గా రెండు ఫోన్లను యూఎస్‌బీ టైప్ సి కేబుల్‌తో అనుసంధానం చేయడమే. దీంతో ఒక ఫోన్ ద్వారా మరొక ఫోన్‌ను చార్జింగ్ చేయవచ్చు. లేదా ఫోన్ నుంచి టైప్ సి పోర్టు ద్వారా వైర్ లెస్ ఇయర్ బడ్స్, ఫిట్ నెస్ బ్యాండ్ వంటి వాటిని కూడా చార్జింగ్ చేసుకోవచ్చు. ఇలా కూడా ఫోన్ కు చెందిన టైప్ సి పోర్టు పనిచేస్తుంది. అలాగే టైప్-సి టు హెచ్‌డీఎంఐ అడాప్టర్‌ను ఉపయోగిస్తే ఫోన్‌లోని వీడియో లేదా ఆడియో, ఫొటోలు వంటి మీడియా ఫైల్స్‌ను టీవీలు లేదా మానిటర్‌లో సులభంగా ప్లే చేయవచ్చు. ఈ విధంగా కూడా ఫోన్లకు ఉండే టైప్ సి పోర్టు పనిచేస్తుంది.
మినీ ల్యాప్ టాప్..
కొన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లను టైప్ సి పోర్టు ద్వారా మినీ ల్యాప్ టాప్ గా మార్చుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఫోన్‌ను ఒక యూఎస్‌బీ టైప్ సి పోర్టు హబ్‌కు కనెక్ట్ చేసి దానికి మానిటర్ లేదా టీవీని అనుసంధానం చేయాలి. ఆ తరువాత అదే హబ్‌కు కీబోర్డు, మౌస్‌ను కనెక్ట్ చేయాలి. దీంతో ఫోన్ తెరను టీవీ లేదా మానిటర్‌పై యాక్సెస్ చేయవచ్చు. అలాగే దానికి కనెక్ట్ అయి ఉండే కీబోర్డు, మౌస్ ద్వారా ఫోన్‌ను ఆపరేట్ చేయవచ్చు. ఇలా ఫోన్ చిన్నపాటి ల్యాప్ టాప్‌గా కూడా మారిపోతుంది. ఇదంతా టైప్ సి పోర్టు వల్లే సాధ్యమవుతుంది. అలాగే ప్రొజెక్టర్లకు కూడా ఫోన్‌లను టైప్ సి పోర్టు ద్వారా కనెక్ట్ చేయవచ్చు. హైక్వాలిటీ స్ట్రీమింగ్ ఆడియోను ప్లే చేసే ఆడియో డివైస్‌లకు కూడా ఫోన్లను యూఎస్‌బీ టైప్ సి పోర్టు ద్వారా కనెక్ట్ చేసి ఫోన్‌లో ఉండే ఆడియో ఫైల్స్‌ను ఆ డివైస్‌లలో ప్లే చేయవచ్చు. ఇలా ఫోన్లకు ఉండే యూఎస్‌బీ టైప్ సి పోర్టులను మనం పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చు.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Samsung | రీఫర్బిష్డ్ ఫోన్లను స్వయంగా విక్రయిస్తున్న శాంసంగ్.. వినూత్న ప్రోగ్రామ్ ప్రారంభం..
మే 11, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



