POCO M8 Power 5G | 8000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ డిస్‌ప్లేతో లాంచ్ అయిన పోకో కొత్త ఫోన్.. ధర ఎంతంటే..
POCO M8 Power 5G | మొబైల్స్ తయారీ సంస్థ షియోమీకి చెందిన సబ్ బ్రాండ్ పోకో తన నూతన స్మార్ట్ ఫోన్ ఎం8 పవర్ 5జిని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో 6.99 ఇంచుల భారీ ఓలెడ్ డిస్‌ప్లే ఉండగా, ఇది కంపెనీకి చెందిన తొలి భారీ ఓలెడ్ డిస్‌ప్లే ఫోన్ అని సంస్థ వెల్లడించింది. ఇది క్వాడ్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది.
Technology | Published On Aug 5, 2026, 12.08 pm IST
POCO M8 Power 5G | మొబైల్స్ తయారీ సంస్థ షియోమీకి చెందిన సబ్ బ్రాండ్ పోకో తన నూతన స్మార్ట్ ఫోన్ ఎం8 పవర్ 5జిని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో 6.99 ఇంచుల భారీ ఓలెడ్ డిస్‌ప్లే ఉండగా, ఇది కంపెనీకి చెందిన తొలి భారీ ఓలెడ్ డిస్‌ప్లే ఫోన్ అని సంస్థ వెల్లడించింది. ఇది క్వాడ్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. అందువల్ల డిస్‌ప్లేపై అద్భుతమైన దృశ్యాలను ప్రదర్శిస్తుంది. ఔట్ డోర్‌లో గరిష్టంగా 1800 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌ను అందిస్తుంది. అందువల్ల ఔట్‌డోర్‌లోనూ డిస్‌ప్లే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫోన్‌ను బ్లాక్, బ్లేజ్ ఆరెంజ్, గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేశారు. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 ప్రాసెసర్‌ను ఇచ్చారు. రోజువారీ పనులతోపాటు మల్టీ టాస్కింగ్‌కు అనువుగా ఉండేలా దీన్ని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఫోన్‌ను ఎక్కువ సేపు ఉపయోగించినా లేదా వీడియోలు చూసినా, గేమ్స్ ఆడినా హీట్‌కు గురి కాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా గ్రాఫైట్ చాంబర్‌ను అందించింది.
8000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ..
ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ దాని బ్యాటరీ అని చెప్పవచ్చు. ఇందులో 8000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని ఇచ్చారు. ఇది సిలికాన్ కార్బన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఒక సారి ఫుల్ చార్జింగ్ చేస్తే సాధారణ వినియోగానికి ఒకటిన్నర రోజు వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుందని కంపెనీ తెలిపింది. కేవలం కాల్స్, సాధారణ టాస్క్‌లకు గరిష్టంగా 3 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. అలాగే నిరంతరంగా వీడియోలను చూస్తే 42 గంటల వరకు ప్లే బ్యాక్‌ను ఇస్తుంది. సోషల్ మీడియా స్క్రోలింగ్‌ను 68 గంటలు, గేమింగ్ 18 గంటలు, టర్న్ బై టర్న్ నావిగేషన్ 16 గంటల వరకు వాడుకోవచ్చని తెలిపింది. ఈ ఫోన్‌కు 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. అందువల్ల ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. చార్జర్ బాక్స్‌లో లభిస్తుంది. 22.5 వాట్ల వైర్డ్ రివర్స్ చార్జింగ్‌కు సపోర్ట్ ఉంది. దీని వల్ల ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఇతర డివైస్‌లను ఈ ఫోన్ సహాయంతో చార్జింగ్ చేసుకోవచ్చు. ఇది పవర్ బ్యాంక్‌గా కూడా పనిచేస్తుంది.
పవర్‌ఫుల్ ఏఐ కెమెరాలు..
ఈ పోన్‌లో ఆండ్రాయిడ్ 16 ఆధారిత షియోమీ హైపర్ ఓఎస్‌ను ఇచ్చారు. దీనికి 4 ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను ఇస్తామని కంపెనీ తెలిపింది. వెనుక వైపు 50 మగాపిక్సల్ ప్రైమరీ ఏఐ కెమెరాను ఇచ్చారు. దీనికి ఇంటెలిజెంట్ సీన్ డిటెక్షన్ సదుపాయం ఉంది. ఇది వివిధ షూటింగ్ మోడ్‌లలో కెమెరా సెట్టింగ్‌లను ఆటోమేటిక్‌గా మార్చి అద్భుతమైన ఫొటోలు, వీడియోలను తీసుకునేలా సౌకర్యం కల్పిస్తుంది. సెల్ఫీల కోసం ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ప్రత్యేకమైన ఏఐ ఫొటోగ్రఫీ మోడ్‌లు సైతం అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ ఇచ్చారు. ఐపీ64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. 6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు. డెడికేటెడ్ మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ లభిస్తుంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, డాల్బీ అట్మోస్, 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్ సి వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
ధర ఎంతంటే..
పోకో ఎం8 పవర్ 5జి ఫోన్‌కు చెందిన 6జీబీ, 128జీబీ మోడల్ ధర రూ.24,999 ఉండగా, 8జీబీ, 128జీబీ మోడల్ ధరను రూ.27,999గా నిర్ణయించారు. బ్యాంక్ ఆఫర్, లాంచింగ్ ఆఫర్ కింద ఈ ఫోన్‌ను రూ.21,999 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఆగస్టు 7 నుంచి ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్రీడమ్ సేల్ సందర్భంగా విక్రయించనున్నారు. అమ్మకం ప్రారంభం అయ్యాక మొదటి 12 గంటల వరకు రూ.1వేయి ప్రత్యేక డిస్కౌంట్ లభిస్తుంది. రూ.2వేల ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లేదా ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు.
సంబంధిత వార్తలు

Android | పాస్‌వర్డ్‌ల బదిలీ ఇక మరింత ఈజీ.. ఆండ్రాయిడ్‌లో కొత్త ఫీచర్..
సెప్టెంబర్ 12, 2026

Motorola | 10,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 5జి ఫీచర్లతో లాంచ్ అయిన మోటోరోలా కొత్త ట్యాబ్.. ధర ఎంతంటే..
ఆగస్టు 8, 2026

Google Assistant | ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇక పూర్తిగా జెమిని ఏఐ.. గూగుల్ అసిస్టెంట్‌కు గుడ్‌బై..
ఆగస్టు 7, 2026
తాజావార్తలు
- ●UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?
- ●T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర
- ●Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..
- ●Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..
- ●Ukraine Biggest Attack | మాస్కోపై 1,600కుపైగా డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్..!
- ●Delhi SIR | ఎస్ఐఆర్లో ప్రముఖులకూ షాక్.. అద్వానీ, కేజ్రీవాల్ సహా పలువురికి నోటీసులు..!

UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?

T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర

Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..

Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..



