త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vodafone Idea | రూ.200కే 20 ఓటీటీలు.. వొడాఫోన్ ఐడియా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్..

Vodafone Idea | వొడాఫోన్ ఐడియా (వి) తన వి మూవీస్ అండ్ టీవీ కంటెంట్ అగ్రిగేషన్ సేవలో భాగంగా కొత్త విలువ ఆధారిత ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రూ.200 ధరకు అందుబాటులోకి వచ్చిన ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీని ఇస్తుంది. ఇందులో 20 ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు, 200కు పైగా లైవ్ టీవీ ఛాన‌ల్స్, అలాగే భారీ డేటా ప్రయోజనాలను ఒకే సబ్‌స్క్రిప్షన్‌లో అందిస్తోంది.

S

Technology | Published On Jul 27, 2026, 4.45 pm IST

Vodafone Idea | రూ.200కే 20 ఓటీటీలు.. వొడాఫోన్ ఐడియా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్..
Advertisement

Vodafone Idea | వొడాఫోన్ ఐడియా (వి) తన వి మూవీస్ అండ్ టీవీ కంటెంట్ అగ్రిగేషన్ సేవలో భాగంగా కొత్త విలువ ఆధారిత ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రూ.200 ధరకు అందుబాటులోకి వచ్చిన ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీని ఇస్తుంది. ఇందులో 20 ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు, 200కు పైగా లైవ్ టీవీ ఛాన‌ల్స్, అలాగే భారీ డేటా ప్రయోజనాలను ఒకే సబ్‌స్క్రిప్షన్‌లో అందిస్తోంది. ప్రస్తుతం వినియోగదారులు వేర్వేరు ఓటీటీ సేవలకు విడివిడిగా సబ్‌స్క్రిప్షన్లు తీసుకోవాల్సి రావడం, ప్రతి నెలా పునరావృత చెల్లింపులు చేయాల్సి రావడం వల్ల ఏర్పడుతున్న ఇబ్బందులను తగ్గించడమే ఈ ప్లాన్ లక్ష్యంగా కంపెనీ తెలిపింది. ఒకే నెలవారీ రీచార్జ్‌తో పలు డిజిటల్ వినోద సేవలను అందించడం ద్వారా, సాధారణ కేబుల్ లేదా డీటీఎచ్ నెలవారీ కనెక్షన్ కంటే తక్కువ ధరలో సమగ్ర వినోద అనుభవాన్ని అందిస్తోంది.

రూ.200కే 20 ఓటీటీలు..

ఈ రూ.200 వి మూవీస్ అండ్ టీవీ ప్లాన్‌లో జియోహాట్‌స్టార్, సోనీలివ్, జీ5, లయన్స్‌గేట్ ప్లే, షెమారూ మీ, మనోరమా మ్యాక్స్, ఫ్యాన్‌కోడ్, ప్లేఫ్లిక్స్, క్లిక్, చౌపాల్, యుప్‌టీవీ, అడ్డాటైమ్స్ వంటి మొత్తం 20 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల యాక్సెస్ లభిస్తుంది. అలాగే 200కు పైగా లైవ్ టీవీ ఛానెల్స్ ను వీక్షించే అవకాశం కూడా ఈ ప్లాన్‌లో ఉంది. వినియోగదారులకు 30 జీబీ హైస్పీడ్ డేటాతో పాటు అర్హత ఉన్న వారికి అన్‌లిమిటెడ్ 5జీ డేటా కూడా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ద్వారా ఒకేసారి నాలుగు డివైస్‌లలో లాగిన్ అయ్యే అవకాశం ఉండగా, ఎక్కువ భాగం ఓటీటీ సేవల్లో రెండు స్క్రీన్‌లలో ఒకేసారి స్ట్రీమింగ్ చేసుకునే సౌకర్యం కల్పించారు. అయితే సోనీలివ్ ఈ మల్టీ-స్క్రీన్ సదుపాయానికి మినహాయింపుగా ఉంటుంది.

16 భాష‌ల్లో కంటెంట్‌..

ఇందులోని కంటెంట్ 16 భాషల్లో అందుబాటులో ఉండటంతో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వినోదాన్ని ఒకే ప్లాట్‌ఫామ్‌లో ఆస్వాదించవచ్చు. ఈ రూ.200 వి మూవీస్ అండ్ టీవీ ప్లాన్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. వినియోగదారులు వి యాప్ ద్వారా లేదా సాధారణ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రీచార్జ్ ఛాన‌ల్స్ ద్వారా ఈ ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.

Advertisement
Advertisement