త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vodafone Idea | వొడాఫోన్ ఐడియా (వీఐ) స‌రికొత్త ప్ర‌యోగం.. ప్రీపెయిడ్ ప్లాన్ల‌లోనూ ఫ్యామిలీ షేరింగ్‌..

Vodafone Idea | వొడాఫోన్ ఐడియా (వీఐ) ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం సరికొత్త ఫ్యామిలీ ప్లాన్‌ను ప్రకటించింది. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులు తమ మొబైల్ డేటాను పరస్పరం పంచుకునే సదుపాయాన్ని ఈ ప్లాన్ ద్వారా అందిస్తోంది. వీఐ పే సబ్ హై విఐపీ అనే ప్రచార నినాదంతో తీసుకొచ్చిన ఈ ప్లాన్.. ఇప్పటివరకు వ్యక్తిగతంగా మాత్రమే వినియోగించుకునే ప్రీపెయిడ్ డేటా విధానంలో కొత్త మార్పును తీసుకొచ్చింది.

S

Business | Published On Oct 16, 2026, 4.56 pm IST

Vodafone Idea | వొడాఫోన్ ఐడియా (వీఐ) స‌రికొత్త ప్ర‌యోగం.. ప్రీపెయిడ్ ప్లాన్ల‌లోనూ ఫ్యామిలీ షేరింగ్‌..
Advertisement

Vodafone Idea | వొడాఫోన్ ఐడియా (వీఐ) ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం సరికొత్త ఫ్యామిలీ ప్లాన్‌ను ప్రకటించింది. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులు తమ మొబైల్ డేటాను పరస్పరం పంచుకునే సదుపాయాన్ని ఈ ప్లాన్ ద్వారా అందిస్తోంది. వీఐ పే సబ్ హై విఐపీ అనే ప్రచార నినాదంతో తీసుకొచ్చిన ఈ ప్లాన్.. ఇప్పటివరకు వ్యక్తిగతంగా మాత్రమే వినియోగించుకునే ప్రీపెయిడ్ డేటా విధానంలో కొత్త మార్పును తీసుకొచ్చింది. ప్రస్తుతం మొబైల్ యాప్స్‌పై ఆధారపడడం పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో రోజువారీ లేదా నెలవారీ డేటా పరిమితి ముగిస్తే ఆన్‌లైన్ తరగతులకు హాజరు కావడం, మ్యాప్స్ ద్వారా మార్గాలను తెలుసుకోవడం, డిజిటల్ చెల్లింపులు చేయడం, వీడియో కాల్స్ మాట్లాడడం వంటి ముఖ్యమైన పనులకు అంతరాయం కలుగుతోంది.

ప్రీపెయిడ్ ప్లాన్ల‌లో డేటా షేరింగ్‌..

పోస్ట్‌పెయిడ్ విభాగంలో కుటుంబ సభ్యులు డేటాను పంచుకునే ప్లాన్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రీపెయిడ్ వినియోగదారులకు మాత్రం డేటా కొరత ఏర్పడినప్పుడు ఇతర కుటుంబ సభ్యుల నుంచి డేటాను పొందే అవకాశం ఇప్పటివరకు పరిమితంగా ఉంది. ఈ సమస్యను పరిష్కరించే లక్ష్యంతో వీఐ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఒకే గ్రూపులో ఉన్న కుటుంబ సభ్యులు తమ డేటాను పరస్పరం బదిలీ చేసుకోవచ్చు. దీంతో డేటా అయిపోయిన ప్రతిసారీ అదనపు రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరాన్ని తగ్గించుకోవచ్చు. ఈ ప్రీపెయిడ్ ఫ్యామిలీ ప్లాన్‌లో భాగంగా ఒక గ్రూపులో గరిష్ఠంగా నలుగురు సభ్యులు ఉండవచ్చు. ఇందులో ఒకరు ప్రధాన ఖాతాదారుగా, మరో ముగ్గురు సభ్యులుగా చేరవచ్చు. వీఐ ప్రీపెయిడ్ కనెక్షన్ యాక్టివ్‌గా ఉన్న వినియోగదారులు ఈ గ్రూపును ఏర్పాటు చేసుకోవచ్చు.

దేశంలో ఎక్క‌డ ఉన్నా స‌రే..

ఈ ప్లాన్‌లో మరో ప్రత్యేకత ఏమిటంటే.. కుటుంబ సభ్యులంతా ఒకే టెలికాం సర్కిల్‌కు చెందినవారై ఉండాల్సిన అవసరం లేదు. దేశంలోని వేర్వేరు నగరాలు, రాష్ట్రాల్లో నివసిస్తున్నవారిని కూడా ఒకే ఫ్యామిలీ గ్రూపులో అనుసంధానించవచ్చు. గ్రూపులో చేరిన ప్రతి ఒక్కరూ తమ ప్రస్తుత ప్రీపెయిడ్ ప్లాన్‌ను, దాని వ్యాలిడిటీని యథావిధిగా కొనసాగించవచ్చు. అయితే, గ్రూపులోని ఇతర సభ్యులకు డేటా అవసరమైనప్పుడు ఒక్కో లావాదేవీలో గరిష్ఠంగా 500 ఎంబీ డేటాను బదిలీ చేయవచ్చు. దీంతో డేటా బ్యాలెన్స్ తక్కువగా ఉన్న కుటుంబ సభ్యులకు ఇతరులు సహాయం చేసే అవకాశం లభిస్తుంది. ఈ గ్రూపు ఏర్పాటు, డేటా బదిలీ వంటి కార్యకలాపాలను అధికారిక వీఐ యాప్ ద్వారా నిర్వహించవచ్చు. అలాగే ఈ ప్లాన్‌లో పాల్గొనే సభ్యులు యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకున్నప్పుడు గరిష్ఠంగా 10 శాతం వరకు తగ్గింపును కూడా పొందవచ్చని కంపెనీ తెలిపింది.

కొత్త ప్లాన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీఐ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌తో ప్రత్యేక ప్రకటనను రూపొందించింది. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులు డేటాను పరస్పరం పంచుకుంటూ నిరంతర కనెక్టివిటీని ఎలా కొనసాగించవచ్చో ఈ ప్రకటనలో చూపించారు.

Advertisement
Advertisement