vivo Y31t 5G | 7200 ఎంఏహెచ్ బ్యాటరీతో వివో కొత్త ఫోన్.. మిడ్ రేంజ్ విభాగంలో బెస్ట్..
vivo Y31t 5G | వివో ఇండియా తన వై సిరీస్‌లో కొత్త 5జి స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. వివో వై31టి 5జి పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ స్టోర్‌లలో అందుబాటులోకి వచ్చింది. భారీ బ్యాటరీ, మెరుగైన హార్డ్‌వేర్ రక్షణ, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ వంటి అంశాలకు కంపెనీ ఇందులో ప్రాధాన్యం ఇచ్చింది.
Technology | Published On Aug 31, 2026, 2.34 pm IST
vivo Y31t 5G | వివో ఇండియా తన వై సిరీస్‌లో కొత్త 5జి స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. వివో వై31టి 5జి పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ స్టోర్‌లలో అందుబాటులోకి వచ్చింది. భారీ బ్యాటరీ, మెరుగైన హార్డ్‌వేర్ రక్షణ, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ వంటి అంశాలకు కంపెనీ ఇందులో ప్రాధాన్యం ఇచ్చింది. ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దాని బ్యాటరీ. ఇందులో 7200 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని అందించారు. దీనికి 44 వాట్ల ఫ్లాష్‌చార్జ్ సపోర్ట్ ఉంది. ఫోన్ వినియోగ పరిస్థితులకు అనుగుణంగా పవర్ ఇన్‌పుట్‌ను డైనమిక్‌గా నియంత్రించే విధంగా చార్జింగ్ వ్యవస్థను రూపొందించారు. నీరు, దుమ్ము నుంచి రక్షణ విషయంలోనూ ఈ ఫోన్ ప్రత్యేకతను కలిగి ఉంది. ఐపీ68, ఐపీ69 ఇన్‌గ్రెస్ ప్రొటెక్షన్ రేటింగ్‌లను కలిగి ఉంది.
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ..
ఫోన్ నిర్మాణానికి సంబంధించి ఎస్‌జీఎస్ గోల్డ్ లేబుల్ ఫైవ్-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌తోపాటు మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ కూడా ఉంది. అలాగే ఫోన్‌లో ఇంటిగ్రేటెడ్ మాయిశ్చర్ డిటెక్షన్, వన్-ట్యాప్ వాటర్ అండ్ డస్ట్ ఎజెక్షన్ వంటి ఫీచర్లను కూడా అందించారు. వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరాను అందించారు. నైట్, పోర్ట్రెయిట్, ప్రొ, డాక్యుమెంట్ స్కానింగ్, 50 మెగాపిక్సల్ హై-రిజల్యూషన్ క్యాప్చర్‌తోపాటు ప్రత్యేకమైన అండర్‌వాటర్ ఫొటోగ్రఫీ మోడ్‌లు ఇందులో ఉన్నాయి. ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఇందులో ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6ను ఇచ్చారు. ఏఐ క్రియేషన్, ఆరిజిన్ ఐలాండ్, డ్రాగ్ అండ్ గో, ప్రైవేట్ స్పేస్, వివో డాక్‌మాస్టర్ వంటి ఉత్పాదకత, గోప్యతకు సంబంధించిన ఫీచర్లను ఇందులో అందించారు.
పవర్‌ఫుల్ డిస్‌ప్లే..
ఇందులో 6.75 ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది. గరిష్ఠంగా 1250 నిట్స్ హెచ్‌బీఎం బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. 4 జీబీ, 6 జీబీ ర్యామ్, 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ అయింది. డ్యుయల్ నానో సిమ్‌తో పాటు మైక్రో ఎస్‌డీ కార్డును కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. 5జి ఎస్ఏ, ఎన్ఎస్ఏ, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి వంటి సదుపాయాలు ఉన్నాయి.
ధర ఎంతంటే..
వివో వై31టి 5జిమూడు రంగుల్లో లభిస్తోంది. క్రిమ్సన్ రెడ్, సీషోర్ గ్రీన్, గోల్డెన్ మిస్ట్ రంగులను కంపెనీ అందిస్తోంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25,999గా ఉంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999 కాగా, 6 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.34,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను వివో ఇండియా ఈ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్‌తోపాటు దేశవ్యాప్తంగా భాగస్వామ్య రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. ప్రధాన క్రెడిట్ కార్డులపై రూ.1500 వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఎస్‌బీఐ కార్డ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, యెస్ బ్యాంక్, బీఓబీకార్డ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ తదితర కార్డులపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. అలాగే 10 నెలల వరకు జీరో డౌన్ పేమెంట్ ఫైనాన్సింగ్ సదుపాయం ఉంది. జియో ద్వారా ఆరు నెలల పాటు 10 ఓటీటీ యాప్‌ల బండిల్‌ను పొందే అవకాశం ఉంది. వినియోగదారులు అదనంగా వీ షీల్డ్ ప్రొటెక్షన్ ప్లాన్‌లను కూడా ఎంచుకోవచ్చు.
సంబంధిత వార్తలు

iQOO Z11xa 5G | ఐక్యూ జడ్11ఎక్స్ఏ 5జి వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..
సెప్టెంబర్ 7, 2026

Infinix Hot 70 Pro 5G | రూ.24,999కే ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రొ 5జి.. అదిరిపోయే ఫీచర్లు..
సెప్టెంబర్ 4, 2026

realme P4s 5G | 8000 ఎంఏహెచ్ బ్యాటరీ, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో.. రియల్‌మి కొత్త స్మార్ట్ ఫోన్..
ఆగస్టు 26, 2026
తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్



