Vivo India | దేశవ్యాప్తంగా 10 మంది టీచర్లకు వివో ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్
Vivo India | వివో ఇండియా తన నాలుగో విడత వివో ఇగ్నైట్ కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన నేషనల్ టీచర్ ఇన్నోవేషన్ ఫెలోషిప్ (ఎన్‌టీఐఎఫ్) కోసం 10 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసింది. తరగతి గదుల్లో అనుభవాత్మక అభ్యాసం, సమస్య పరిష్కారం, సమ్మిళిత బోధనా విధానాలను అమలు చేస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి, వారికి మద్దతు అందించడం ఈ ఫెలోషిప్ ప్రధాన ఉద్దేశం.
Technology | Published On Sep 29, 2026, 3.09 pm IST
Vivo India | వివో ఇండియా తన నాలుగో విడత వివో ఇగ్నైట్ కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన నేషనల్ టీచర్ ఇన్నోవేషన్ ఫెలోషిప్ (ఎన్‌టీఐఎఫ్) కోసం 10 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసింది. తరగతి గదుల్లో అనుభవాత్మక అభ్యాసం, సమస్య పరిష్కారం, సమ్మిళిత బోధనా విధానాలను అమలు చేస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి, వారికి మద్దతు అందించడం ఈ ఫెలోషిప్ ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమం ద్వారా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం (స్టెమ్) విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా ఈ ఫెలోషిప్ కోసం 200కు పైగా దరఖాస్తులు వచ్చాయి. ప్రాథమిక పరిశీలన అనంతరం 30 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ దశకు ఎంపిక చేశారు. చివరకు ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం, 10 జిల్లాలకు ప్రాతినిధ్యం వహించే 10 మంది ఉపాధ్యాయులతో తుది ఫెలోషిప్ బృందాన్ని ఎంపిక చేశారు.
నాలుగు ప్రధాన అంశాలే ప్రాతిపదిక..
ఉపాధ్యాయుల ఎంపికలో నాలుగు ప్రధాన అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. వినూత్న బోధనా విధానాల అమలు, వివిధ రకాల విద్యార్థుల అభ్యాస అవసరాలకు అనుగుణంగా బోధనా పద్ధతులను మార్చడం, వాస్తవ ప్రపంచ సమస్యలకు పరిష్కారాలు చూపడం, స్టెమ్ అంశాలను ఆచరణాత్మకంగా ఉపయోగించడం, అలాగే దీర్ఘకాలిక దృష్టి, నాయకత్వం, విద్యా కార్యక్రమాలను విస్తరించే సామర్థ్యాన్ని పరిశీలించారు. ఈ ఎంపిక ప్రక్రియలో ఐఐటీ మద్రాస్ ప్రవర్టక్ టెక్నాలజీస్, సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ తదితర సంస్థలకు చెందిన తొమ్మిది మంది విద్యావేత్తలు, పరిశ్రమ నిపుణులతో కూడిన కమిటీ పాల్గొంది. తమిళనాడుకు చెందిన ఆర్. చంద్రశేఖరన్ సైన్స్, గణిత ఉపాధ్యాయుడిగా యువర్ ప్రాబ్లమ్, యువర్ సొల్యూషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కొల్లి హిల్స్ ప్రాంతంలోని గిరిజన విద్యార్థులను స్థానిక సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు రూపొందించేలా ఆయన ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటివరకు 10వేల మందికి పైగా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా, సమాజానికి ఉపయోగపడే 72 ప్రాజెక్టులకు మద్దతు లభించింది.
ఏయే రాష్ట్రాల నుంచి ఎవరు..
అస్సాంకు చెందిన ఎస్. మణి భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు. ఆయన ఆకాశవిద్యాలయ - స్కై స్కూల్ ఆఫ్ ఇండియాను స్థాపించారు. పరిశీలనాత్మక ఖగోళశాస్త్రం, సూర్య పరిశీలనలు, గ్రహశకలాల అన్వేషణ, టెలిస్కోప్ తయారీ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. 11 పాఠశాలల్లో 2వేల మందికి పైగా విద్యార్థులు, సమాజ సభ్యులకు ఈ కార్యక్రమం చేరింది. హర్యానాకు చెందిన నితేశ్ కుమార్ కృత్రిమ మేధ, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంశాల్లో ప్రాబ్లమ్ టు ప్రోటోటైప్ విధానాన్ని అమలు చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన సి. మాణిక్యం రెడ్డి భౌతికశాస్త్ర బోధనలో ఎన్‌రిచ్ ద సాయిల్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. ఢిల్లీకి చెందిన నీరూ మిట్టల్ మస్తీ కీ ప్రయోగశాల పేరుతో మేకర్ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సాధనా కౌశిక్ అటల్ టింకరింగ్ ల్యాబ్ పరిధిలో ఐడియా-టు-ఇంపాక్ట్ విధానాన్ని ఏర్పాటు చేశారు. తమిళనాడుకు చెందిన పెరియసామి పి. స్టెమ్, రోబోటిక్స్, కృత్రిమ మేధ రంగాల్లో పనిచేస్తున్నారు. తెలంగాణకు చెందిన లలిత్ మోహన్ సాహు 25 సంవత్సరాల బోధనా అనుభవం కలిగిన ఉపాధ్యాయుడు. గణిత, శాస్త్రీయ భావనలను సంగీత నిర్మాణాలతో అనుసంధానిస్తూ రిథమిక్ స్టెమ్ అనే అంతరశాఖా బోధనా విధానాన్ని అభివృద్ధి చేశారు.
10 మందికి సత్కారం..
మహారాష్ట్రకు చెందిన నీతా చంద్రశేఖర్ జవాలే కంప్యూటర్ సైన్స్ ప్రాథమిక పాఠ్యాంశాలను అటల్ టింకరింగ్ ల్యాబ్‌లోని ప్రయోగాత్మక కార్యకలాపాలతో అనుసంధానిస్తున్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచే ప్రాజెక్టులు, ఆవిష్కరణలకు అవసరమైన అనుభవాత్మక అభ్యాసాన్ని అందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఏక్తా శర్మ సైన్స్, భౌతికశాస్త్ర బోధనలో అనుభవాత్మక విధానాలను ఉపయోగిస్తున్నారు. పరిశీలన, ప్రయోగాల ద్వారా నిర్ధారణ, వాస్తవ ప్రపంచంలో వాటి అనువర్తనం వంటి అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఎంపికైన 10 మంది ఫెలోలను అక్టోబర్ 28న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించనున్న వివో ఇగ్నైట్ 4.0’జాతీయ ముగింపు కార్యక్రమంలో అధికారికంగా సత్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థి ఆవిష్కర్తలు, ఉపాధ్యాయులు, విద్యా సంస్థల ప్రతినిధులు, స్టెమ్, విద్యా ఆవిష్కరణ రంగానికి చెందిన ఇతర భాగస్వాములు హాజరుకానున్నారు.
సంబంధిత వార్తలు

vivo Y31t 5G | 7200 ఎంఏహెచ్ బ్యాటరీతో వివో కొత్త ఫోన్.. మిడ్ రేంజ్ విభాగంలో బెస్ట్..
ఆగస్టు 31, 2026

Vivo S2 | భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లేతో లాంచ్ అయిన వివో ఎస్2 స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే..
ఆగస్టు 7, 2026

vivo T5e | వివో నుంచి టి5ఇ స్మార్ట్ ఫోన్.. భారీ బ్యాటరీ, ధర తక్కువ..
జులై 27, 2026
తాజావార్తలు
- ●Yogi Babu | టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్ - టాప్ కమెడియన్లుగా హీరోలుగా తెలుగు మూవీ - జానర్‌పై ట్విస్ట్?
- ●Asian Games | 36 ఏళ్ల నిరీక్షణకు తెర.. షూటింగ్లో నీరూ ధండాకు గోల్డ్
- ●Asaduddin Owaisi | నెహ్రూ నుంచి మోదీ వరకూ.. అన్ని ప్రభుత్వాలూ ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూశాయి : ఒవైసీ
- ●Raipur Black Money Scam | నల్లటి కాగితాలను కెమికల్లో ముంచితే 500 నోట్లు వస్తాయంటూ ఇద్దరు యువతుల ఘరానా మోసం
- ●Mahesh Kumar Goud | సిరిసిల్లకు తరలిరండి.. సీఎం సభను సక్సెస్ చేయండి
- ●Stock Markets | ముడి చమురు ధరల సెగ.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

Yogi Babu | టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్ - టాప్ కమెడియన్లుగా హీరోలుగా తెలుగు మూవీ - జానర్‌పై ట్విస్ట్?

Asian Games | 36 ఏళ్ల నిరీక్షణకు తెర.. షూటింగ్లో నీరూ ధండాకు గోల్డ్

Asaduddin Owaisi | నెహ్రూ నుంచి మోదీ వరకూ.. అన్ని ప్రభుత్వాలూ ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూశాయి : ఒవైసీ

Raipur Black Money Scam | నల్లటి కాగితాలను కెమికల్లో ముంచితే 500 నోట్లు వస్తాయంటూ ఇద్దరు యువతుల ఘరానా మోసం



