Ai Plus Nova 2 Power 5G | రూ.15,999కే ఏఐ ప్లస్ కొత్త 5జి ఫోన్.. 7000 ఎంఏహెచ్ బ్యాటరీ..
Ai Plus Nova 2 Power 5G | ఏఐ ప్లస్ సంస్థ తన నోవా 2 సిరీస్‌లో కొత్తగా నోవా 2 పవర్ 5జి స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. 6.75 ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఈ ఫోన్ వస్తోంది. పంచ్‌హోల్ డిజైన్‌లో 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను అందించారు.
Technology | Published On Sep 21, 2026, 3.46 pm IST
Ai Plus Nova 2 Power 5G | ఏఐ ప్లస్ సంస్థ తన నోవా 2 సిరీస్‌లో కొత్తగా నోవా 2 పవర్ 5జి స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. 6.75 ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఈ ఫోన్ వస్తోంది. పంచ్‌హోల్ డిజైన్‌లో 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో గరిష్ఠంగా 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ లభిస్తుంది. ఇందులో ఆండ్రాయిడ్ 16 ఆధారిత నెక్ట్స్‌క్వాంటమ్ ఓఎస్‌ను అందించారు. వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ ప్రధాన కెమెరాతో పాటు 8 మెగాపిక్సల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 13 మెగాపిక్సల్ కెమెరాను అందించారు. ముందు, వెనుక కెమెరాలతో 2కె రిజల్యూషన్‌లో 30ఎఫ్‌పీఎస్ వరకు వీడియో రికార్డింగ్ చేయవచ్చు. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎం రేడియో కూడా ఉన్నాయి.
భారీ బ్యాటరీ..
ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణగా 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అందించారు. దీనికి 33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. దుమ్ము, నీటి తుంపర్ల నుంచి రక్షణ కోసం ఐపీ65 రేటింగ్ ఇచ్చారు. 5జి, డ్యుయల్ 4జీ వోవోఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ 5.4, జీపీఎస్, యూఎస్‌బీ టైప్ సి వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1టెరాబైట్ వరకు పెంచుకోవచ్చు.
ధర వివరాలు..
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జి 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.16,699గా నిర్ణయించారు. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999గా ఉంది. బ్లూ ఫ్యూజన్, బ్లూ గోల్డ్ ఫ్యూజన్, డీప్ పర్పుల్, మిడ్‌నైట్ బ్లాక్, ఓషన్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తోంది. సెప్టెంబర్ 24 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా నోవా 2 పవర్ 5జి రూ.15,999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bihar Jamui Viral Video | బీహార్‌లో నడిరోడ్డుపై బరితెగింపు: చేతులు జోడించి వేడుకున్నా బాలికపై దాడి.. వీడియో వైరల్
- ●Brahmotsavam 2026 | సూర్యకిరణాల సాక్షిగా శ్రీవారి దివ్య విహారం
- ●Cheetah | విజయవంతంగా ప్రాజెక్టు చీతా.. 71 ఏండ్ల తర్వాత భారత గడ్డపై చీతాల సందడి
- ●Adah Sharma | పదకొండేళ్ల తర్వాత కన్నడ సినిమాలో అదాశర్మ - బిగ్‌బాస్ విన్నర్‌తో మైథాలజీ మూవీ
- ●Digital Arrest | డిజిటల్ అరెస్ట్ మోసాలు.. పూణెలో సీనియర్ సిటిజన్లకు రూ.100 కోట్లు నష్టం..
- ●Harish Rao | 8.4 టీఎంసీల నీరున్నా ఎందుకు మనసొస్తలేదు రేవంత్?

Bihar Jamui Viral Video | బీహార్‌లో నడిరోడ్డుపై బరితెగింపు: చేతులు జోడించి వేడుకున్నా బాలికపై దాడి.. వీడియో వైరల్

Brahmotsavam 2026 | సూర్యకిరణాల సాక్షిగా శ్రీవారి దివ్య విహారం

Cheetah | విజయవంతంగా ప్రాజెక్టు చీతా.. 71 ఏండ్ల తర్వాత భారత గడ్డపై చీతాల సందడి

Adah Sharma | పదకొండేళ్ల తర్వాత కన్నడ సినిమాలో అదాశర్మ - బిగ్‌బాస్ విన్నర్‌తో మైథాలజీ మూవీ






