Kalyan Krishnamurthy | ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా
Kalyan Krishnamurthy | ప్రముఖ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) సీఈవో (Flipkart CEO) కల్యాణ్ కృష్ణమూర్తి (Kalyan Krishnamurthy) తన పదవికి రాజీనామా చేశారు.
Kalyan Krishnamurthy | త్రినేత్ర న్యూస్ : ప్రముఖ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) నాయకత్వంలో పెను మార్పు చోటుచేసుకోనుంది. సంస్థ సీఈవో (Flipkart CEO) కల్యాణ్ కృష్ణమూర్తి (Kalyan Krishnamurthy) తన పదవికి రాజీనామా చేశారు. సుమారు 11 ఏళ్ల పాటూ సంస్థలో పనిచేసిన ఆయన ఈసీవో బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఫ్లిప్‌కార్ట్ బుధవారం అధికారికంగా ప్రకటించింది. అయితే, ఆయన రాజీనామాకు గల కారణాలను మాత్రం సంస్థ వెల్లడించలేదు. అంతేకాదు, ఆయన స్థానంలో తదుపరి సీఈవోగా ఎవరు బాధ్యతలు చేపడతారనే విషయంపై కూడా స్పష్టత ఇవ్వలేదు. కొత్త సీఈవోను నియమించే వరకు ఫ్లిప్‌కార్ట్ చీఫ్ టెక్నాలజీ అండ్ ప్రొడక్ట్ ఆఫీసర్ (CTPO) బాలాజీ త్యాగరాజన్ తాత్కాలిక సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
కల్యాణ్ కృష్ణమూర్తి 2017 జనవరిలో ఫ్లిప్‌కార్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. 2018లో గ్రూప్ సీఈవోగా పదోన్నతి పొందారు. సంస్థ విస్తరణలో ఆయన కీలక పాత్ర పోషించారు. అమెజాన్, మీషో వంటి ఈకామర్స్ దిగ్గజాల నుంచి తీవ్ర పోటీ ఉన్నప్పటికీ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ను అగ్రగామిగా నిలబెట్టేందుకు తీవ్రంగా కృషి చేశారు. ఆయన నాయకత్వంలో ఫ్లిప్‌కార్ట్ కేవలం ఈ-కామర్స్ రంగానికే పరిమితం కాకుండా గ్రోసరీ (నిత్యావసరాలు), ఫిన్‌టెక్ వంటి అనేక విభాగాల్లో తన వ్యాపారాన్ని విస్తరించి గణనీయమైన వృద్ధిని సాధించింది. ఫ్లిప్‌కార్ట్‌లో చేరకముందు కల్యాణ్ కృష్ణమూర్తి 'టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్' (Tiger Global Management) సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు.
Also Read..
మేం బిచ్చగాళ్లం కాదు.. యూపీ ఎన్నికల వేళ ఇండీ కూటమిలో భగ్గుమన్న విభేదాలు
కొండపై కార్తీక దీపం వెలిగించలేకపోయాం.. సుప్రీంకోర్టుకు తెలిపిన తమిళనాడు ప్రభుత్వం
తరగతి గదిలో కుప్పకూలిన 9 ఏండ్ల బాలిక.. దవాఖానకు తరలించేలోగా..
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●MLA Madhavaram Krishna Rao | హైదరాబాద్‌ను అమ్మేసే కుట్ర జరుగుతుంది : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
- ●Class 3 Student | తరగతి గదిలో కుప్పకూలిన 9 ఏండ్ల బాలిక.. దవాఖానకు తరలించేలోగా..
- ●Uttar Pradesh polls | మేం బిచ్చగాళ్లం కాదు.. యూపీ ఎన్నికల వేళ ఇండీ కూటమిలో భగ్గుమన్న విభేదాలు
- ●Breakfast Timing | బ్రేక్‌ఫాస్ట్ మానేసి నేరుగా లంచ్ చేస్తే.. మరణ ముప్పు 29 శాతం అధికం.. అధ్యయనంలో వెల్లడి..
- ●KTR | ప్రజా సమస్యలపై గొంతెత్తిన వారిని పోలీసులతో అణచివేయాలని చూడటం సిగ్గుచేటు: కేటీఆర్
- ●CM Revanth Reddy | పంచాయతీలలో పౌల్ట్రీలు.. సింగిల్ విండో విధానంలో అనుమతులు

MLA Madhavaram Krishna Rao | హైదరాబాద్‌ను అమ్మేసే కుట్ర జరుగుతుంది : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

Class 3 Student | తరగతి గదిలో కుప్పకూలిన 9 ఏండ్ల బాలిక.. దవాఖానకు తరలించేలోగా..

Uttar Pradesh polls | మేం బిచ్చగాళ్లం కాదు.. యూపీ ఎన్నికల వేళ ఇండీ కూటమిలో భగ్గుమన్న విభేదాలు

Breakfast Timing | బ్రేక్‌ఫాస్ట్ మానేసి నేరుగా లంచ్ చేస్తే.. మరణ ముప్పు 29 శాతం అధికం.. అధ్యయనంలో వెల్లడి..






