vivo V70 FE | 200ఎంపీ కెమెరా, 7000ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన వివో వి70 ఎఫ్ఈ ఫోన్.. ధర ఎంతంటే..?
vivo V70 FE | మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్ ఫోన్ వి70ఎఫ్ఈని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. వి70 సిరీస్ వచ్చిన లేటెస్ట్ వివో ఫోన్ ఇదే కాగా ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.83 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 1.5కె రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది.
Technology | Published On Apr 3, 2026, 12.16 pm IST
vivo V70 FE | మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్ ఫోన్ వి70ఎఫ్ఈని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. వి70 సిరీస్ వచ్చిన లేటెస్ట్ వివో ఫోన్ ఇదే కాగా ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.83 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 1.5కె రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. అందువల్ల డిస్‌ప్లే క్వాలిటీ అద్బుతంగా ఉంటుంది. తెరపై నాణ్యమైన దృశ్యాలను వీక్షించవచ్చు. సూర్యకాంతిలోనూ డిస్‌ప్లే స్పష్టంగా కనిపించేలా ఈ ఫోన్‌కు 1900 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను ఇచ్చారు. ఈ ఫోన్‌లో 12జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. వెనుక వైపు 200 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న మెయిన్ కెమెరాను ఇచ్చారు. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనే ఫీచర్ లభిస్తుంది. అందువల్ల ఫోన్ షేక్ అవుతున్నా ఫొటోలు, వీడియోలను పర్‌ఫెక్ట్‌గా చిత్రీకరించుకోవచ్చు. ఈ భారీ కెమెరాను ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు.
భారీ బ్యాటరీ..
8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరాను సైతం వెనుక వైపు ఇచ్చారు. ముందు వైపు 50 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్6 ఈ ఫోన్‌లో ఉంటుంది. ఈ ఫోన్‌కు 4 ఏళ్ల వరకు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్స్‌ను, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌కు చెందిన నార్తర్న్ లైట్స్ పర్పుల్ కలర్ వేరియెంట్‌కు వెనుక వైపు బ్యాక్ ప్యానెల్ కింద ఓ వినూత్నమైన ఫొటోల్యూమినెసెంట్ పదార్థాన్ని అమర్చారు. దీని వల్ల అతినీలలోహిత కిరణాలు లేదా సూర్య కిరణాలు బ్యాక్ ప్యానెల్‌పై పడ్డాక ఈ ప్యానెల్ రాత్రి పూట చీకట్లో ప్రకాశిస్తూ కనిపిస్తుంది. సదరు పదార్థాన్ని వెనుక వైపు సమంగా అమర్చడంతో బ్యాక్ ప్యానెల్ వెనుక వైపు మొత్తం సమానంగా ప్రకాశవంతంగా దర్శనమిస్తుంది. ఇక ఈ ఫోన్‌లో 7000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీన్ని కూడా ఈ ఫోన్‌కు ఇంకో ఆకర్షణగా చెప్పవచ్చు. 90 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను ఇచ్చారు కనుక ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. కేవలం 7.59 ఎంఎం మందంతో అత్యంత స్లీక్ డిజైన్‌తో ఫోన్‌ను రూపొందించారు కనుక డివైస్‌కు ప్రీమియం లుక్ వచ్చింది. ఇక ఈ ఫోన్ ఐపీ68, ఐపీ69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది.
హెచ్‌డీఆర్10 ప్లస్ సర్టిఫికేషన్..
ఈ ఫోన్ డిస్‌ప్లేకు హెచ్‌డీఆర్10ప్లస్ సర్టిఫికేషన్ ఉన్నందున ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్‌తో వీడియోలను అద్భుతమైన క్వాలిటీతో వీక్షించవచ్చు. అలాగే డిస్‌ప్లేకు డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను ఇచ్చారు. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7360 ప్రాసెసర్ ఉండగా, 8జీబీ, 12జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో దీన్ని లాంచ్ చేశారు. డ్యుయల్ సిమ్ లను వేసుకోవచ్చు, కానీ మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ లేదు. ఇన్ డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లను ఇచ్చారు.
ధర వివరాలు..
వివో వి70 ఎఫ్ఈ ఫోన్‌ను నార్తర్న్ లైట్స్ పర్పుల్, మాన్‌సూన్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ, 128జీబీ మోడల్ ధర రూ.37,999 ఉండగా, 8జీబీ, 256జీబీ మోడల్ ధరను రూ.40,999గా నిర్ణయించారు. అలాగే 12జీబీ, 256జీబీ మోడల్ ధర రూ.44,999గా ఉంది. ఈ ఫోన్‌కు ఇప్పటికే ప్రీ ఆర్డర్లను ప్రారంభించారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తోపాటు వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఈ ఫోన్‌ను ఏప్రిల్ 9 నుంచి విక్రయించనున్నారు. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌పై అన్ని ప్రధాన బ్యాంకులకు చెందిన కార్డులతో 10 శాతం ఫ్లాట్ క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. జీరో డౌన్ పేమెంట్‌తో ఈ ఫోన్‌ను 15 నెలల ఈఎంఐ విధానంలో కొనవచ్చు. పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే దాని విలువపై 10 శాతం అదనపు బోనస్ ఇస్తారు. 1 సంవత్సరం కాకుండా మరో సంవత్సరం పాటు అదనపు వారంటీని ఇస్తున్నారు.
కేవలం రూ.399 చెల్లిస్తే ఫోన్‌ను తరువాత ఎప్పుడైనా విక్రయించదలిస్తే 60 శాతం వరకు అష్యూర్డ్ బైబ్యాక్ విలువ లభిస్తుంది. ఈ ఫోన్‌ను కొన్న జియో వినియోగదారులు రూ.35,100 విలువైన గూగుల్ జెమిని ఏఐ ప్రొ ప్లాన్‌ను 18 నెలల పాటు ఉచితంగా వాడుకోవచ్చు. ఇందులో 2టీబీ స్టోరేజ్ సైతం ఉచితంగా లభిస్తుంది. ఇక ఆన్‌లైన్‌లో ఈ ఫోన్‌ను కొంటే ప్రత్యేక ఆఫర్లను ఇస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, కోటక్ బ్యాంకు కార్డులు లేదా యూపీఐ ద్వారా ఫోన్‌ను ఆన్‌లైన్‌లో కొంటే 10 శాతం ఇన్‌స్టంట్ బ్యాంకు డిస్కౌంట్ లభిస్తుంది. లేదా 10 శాతం అదనంగా ఎక్స్ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Surface Pro for Business | నూతన తరం సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అద్భుతమైన ఫీచర్లు..
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



