త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vi Smart Phone Insurance | వొడాఫోన్ ఐడియా (వీఐ) క‌స్ట‌మ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. ప్రీపెయిడ్ ప్యాక్‌ల‌తో ఉచిత ఇన్సూరెన్స్ ప్లాన్స్‌..

S

Technology | Published On Dec 15, 2025, 3.28 pm IST

Vi Smart Phone Insurance | వొడాఫోన్ ఐడియా (వీఐ) క‌స్ట‌మ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. ప్రీపెయిడ్ ప్యాక్‌ల‌తో ఉచిత ఇన్సూరెన్స్ ప్లాన్స్‌..
Advertisement

Vi Smart Phone Insurance | వొడాఫోన్ ఐడియా (వీఐ) త‌న ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ప‌లు ప్రీపెయిడ్ ప్యాక్‌ల‌కు గాను ఉచితంగా ఇన్సూరెన్స్ ప్లాన్స్‌ను అందిస్తున్న‌ట్లు తెలియ‌జేసింది. ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ ల‌లో భాగంగా ఫోన్ పోయినా, చోరీకి గురైనా క్లెయిమ్ ల‌భిస్తుంది. ఈ ప్లాన్ల‌ను ప్రీపెయిడ్ ప్యాక్‌ల‌తోపాటు క‌లిపి అందిస్తున్నారు. క‌నుక క‌స్ట‌మ‌ర్లు ఈ ఇన్సూరెన్స్‌ల కోసం ప్ర‌త్యేకంగా అద‌న‌పు రుసుము చెల్లించాల్సిన ప‌నిలేదు. ఉచితంగానే ఈ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ల‌భిస్తున్నాయి.

కాగా దేశంలో చాలా వ‌ర‌కు కుటుంబాల్లో సుమారుగా 85.5 శాతం మంది క‌నీసం ఒక స్మార్ట్ ఫోన్‌ను అయినా క‌లిగి ఉన్నార‌ని వీఐ తెలియ‌జేసింది. ఈ వివ‌రాల‌ను ఈ ఏడాది మేలో ప్ర‌చురించిన మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేష‌న్ (ఎంవోఎస్‌పీఐ) నివేదిక‌లో పొందుప‌రిచార‌ని తెలిపింది. ఈ క్ర‌మంలోనే ఫోన్ల‌కు ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంద‌న్న విష‌యాన్ని గుర్తించామ‌ని అన్నారు. 2025లో ఫోన్ల ఇన్సూరెన్స్ మార్కెట్ విలువ 2.6 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుతుంద‌ని అంచ‌నా వేస్తున్న‌ట్లు వీఐ ప్ర‌తినిధులు చెప్పారు. గ‌తేడాది క‌న్నా ఇది 14 శాతం అధిక‌మ‌ని అన్నారు. ఇక సాధారణంగా అధిక శాతం మంది మిడ్ రేంజ్ ఫోన్ల‌ను కొంటున్నార‌ని, వాటి విలువ సుమారుగా రూ.20వేల నుంచి రూ.25వేలుగా ఉంద‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే ఫోన్ యూజ‌ర్ల‌కు ఇన్సూరెన్స్ అందించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలిపారు.

ఇక వీఐ హ్యాండ్ సెట్ థెప్ట్ అండ్ లాస్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో భాగంగా క‌స్ట‌మ‌ర్లు ప‌లు ప్రీపెయిడ్ ప్యాక్‌ల‌ను రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. దీని వ‌ల్ల క‌స్ట‌మ‌ర్ ఫోన్ల‌కు రూ.25వేల వ‌ర‌కు ఇన్సూరెన్స్ ల‌భిస్తుంది. ఇక క్లెయిమ్ ప్రాసెస్‌ను కూడా చాలా సుల‌భ‌త‌రం చేశారు. పూర్తిగా డిజిట‌ల్ ప‌ద్ధ‌తిలో ఉంటుంద‌ని వీఐ తెలియ‌జేసింది. వీఐ అందిస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను పొందాలంటే క‌స్ట‌మ‌ర్లు రూ.61, రూ.201, రూ.251 ప్లాన్ల‌ను రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. రూ.61 ప్లాన్ ద్వారా 2 జీబీ డేటా ల‌భిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 15 రోజులు కానీ ఇన్సూరెన్స్ వాలిడిటీ 30 రోజులు ఉంటుంది. అలాగే రూ.201 ప్యాక్‌ను రీచార్జి చేస్తే 30 రోజుల వాలిడిటీతో 10జీబీ డేటా ల‌భిస్తుంది. ఈ ప్యాక్ ద్వారా వ‌చ్చే ఇన్సూరెన్స్ ప్లాన్‌కు వాలిడిటీ 180 రోజులు ఉంటుంది. అలాగే రూ.251 ప్యాక్‌తో రీచార్జి చేస్తే 30 రోజుల వాలిడిటీతో 10జీబీ డేటా ల‌భిస్తుంది. కానీ ఈ ప్యాక్ ద్వారా ల‌భించే ఇన్సూరెన్స్ ప్లాన్‌కు వాలిడిటీ 365 రోజులు ఉంటుంది. ఇలా వీఐ ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్లు త‌మ ఫోన్ల‌కు ఉచితంగా ఇన్సూరెన్స్ స‌దుపాయాన్ని పొంద‌వ‌చ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement