Harish Rao | రేవంత్! నీ వల్ల 3 వేల రైతు కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి ఉంది
Harish Rao | సీఎం రేవంత్‌రెడ్డి తీరు వల్ల 3 వేల రైతు కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి ఉందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు.
- రైతు బీమా అమలు చేయకుంటే సీఎం ఇంటికొస్తం
- మీ చేతగానితనాన్ని అధికారులపై వేయడమేంటి
- మీరు స్పందించకుంటే మీ ఇంటిని, సచివాలయాన్ని ముట్టడిస్తం
- సిద్దిపేట రైతుల సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు హెచ్చరిక
Harish Rao | త్రినేత్ర న్యూస్: సీఎం రేవంత్‌రెడ్డి తీరు వల్ల 3 వేల రైతు కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి ఉందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు. ఆగస్టు 14 నుంచి ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించకపోవడం వల్ల రాష్ట్రంలో రైతు బీమా ఆగిపోయిందన్నారు. అప్పటి నుంచి ఒక్క సిద్దిపేటలో 22 మంది రైతులు చనిపోయారన్నారు. నీళ్లు ఉన్నా లిఫ్ట్ చేయకుండా పంట పొలాలకు నీళ్లు ఇవ్వడం లేదన్నారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఫెయిల్ అయ్యారని.. వాళ్ల చేతగానితనంతో విద్యుత్ అధికారులపై వేటు వేస్తున్నారని ధ్వజమెత్తారు. సిద్దిపేటలో రైతు బీమా అందని 22 మంది రైతు కుటుంబాలతో గురువారం తన క్యాంపు ఆఫీసులో సమావేశమైన అనంతరం ఆయన మాట్లాడారు.
రైతు కుటుంబాల ఆవేదన చూస్తే మనస్సు చలించి పోతున్నది. ప్రభుత్వం కళ్లు తెరిపించాలని బీఆర్ఎస్ పక్షాన ఒక ఎమ్మెల్యేగా సిద్దిపేటలో రైతు బీమా అందని బాధిత కుటుంబాలతో సమావేశం అయ్యాం. ఆగస్టు 15 నుంచి ఈరోజు వరకు ఒక్క సిద్దిపేటలోనే 22 మంది రైతులు చనిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3వేల మంది రైతులు చనిపోయారు. రైతు బీమా నిలిపివేయడం వల్ల ఇప్పుడు ఆ మూడు వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రేవంత్ రెడ్డి... కేసీఆర్ అమలు చేసిన పథకాలు కొనసాగిస్తున్నాం అని మాటలు చెప్పారు. కానీ నిజానికి అన్నీ బంద్ చేస్తున్నారు. రైతు బీమా పథకం అమలు చేసి ఉంటే ఇంత మంది రైతు కుటుంబాలు ఎందుకు కన్నీళ్లు పెడుతున్నాయి. వీరందరికి ఎందుకు 5లక్షల డబ్బులు రాలేదు. ఆగస్టు 14 నుంచి ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించకపోవడం వల్ల రాష్ట్రంలో రైతు బీమా ఆగిపోయింది.
ఇక్కడ కన్నీళ్లు మున్నీరు అవుతున్న బాధితులకు మీరేం సమాధానం చెబుతారు. వీరిని ప్రభుత్వం ఎలా ఆదుకుంటుందో చెప్పాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి, తుమ్మల నాగేశ్వర్రావు వీరి బాధను ఎలా తీర్చుతారు. తుమ్మల మీరు రైతు, మీరైనా ప్రీమియం చెల్లించాలని చెప్పాలి కదా? కొత్త పథకం తెస్తాం అని బడ్జెట్ లో చెప్పారు. ఆ పథకం ఇప్పటికీ అతీ గతీ లేదు. కేసీఆర్ గుంట భూమి ఉంటే పథకం వర్తింప చేసారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి పథకం వర్తింప చేసారు.
మీరు చెప్పే పథకం కేవలం ఇంటి యజమానికి మాత్రమే. మీరు చెబుతున్న కొత్త బీమా పథకం వచ్చింది లేదు అమలు అయ్యింది లేదు. ఐక్యరాజ్య సమితి సైతం మెచ్చుకున్న రైతు బీమా పథకాన్ని నిలిపివేసేందుకు మనస్సు ఎలా వచ్చింది రేవంత్ రెడ్డి? ఇతర రాష్ట్రాలు మన పథకాన్ని చూసి అమలు చేస్తున్నాయి. కానీ మీరు మాత్రం బంద్ చేసారు, రద్దు చేసారు. ఏ కారణంతో చనిపోయినా రైతు కుటుంబం రోడ్డున పడొద్దని కేసీఆర్ రైతు బీమా అనే పథకానికి 2018లో రూపకల్పన చేసిండు. రైతుల తరఫున ప్రభుత్వమే ఏటా 1400 కోట్ల ప్రీమియం ఎల్ఐసీకి చెల్లించి, 5 లక్షల భరోసా కల్పించిండు.
2018-19 నుంచి 2023-24 వరకు వివిధ కారణాలతో మరణించిన 1,38,688 మంది రైతు కుటుంబాలకు 7వేల కోట్లు చెల్లించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతు సంక్షేమం గురించి గొప్పలు చెప్పే రేవంత్ రెడ్డి, ప్రీమియం 1400 కోట్లు చెల్లించే తెలివి లేదా? వెంటనే ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా రైతు కుంటుంబాలకు చెల్లించాలని, యదావిదిగా రైతు బీమా పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ గారి పథకాలు ఆపలేదంటున్న రేవంత్ రెడ్డి, రైతు బీమా, కేసీఆర్ కిట్టు, న్యూట్రీషన్ కిట్టు, గొర్రెల పంపిణీ పథకం, ఫీజు రియింబర్స్ మెంట్ ఇలా అనేక పథకాలు బంద్ చేసావు. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తే, మీరు 8 గంటలు కూడా ఇవ్వడం చేతకావడం లేదు.
ఐఏఎస్, అధికారులను సస్పెండ్ చేస్తాం అని ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారు. నువ్వు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారే విద్యుత్ మంత్రి. సస్పెండ్ చేయాల్సింది అధికారులను కాదు, మిమ్మల్ని చేయాలి. 9 నెలల నుంచే ఎల్‌నినో ఎఫెక్ట్ ఉంటుందని చెబుతుంటే ఏం చేసారు? కరెంట్ సరఫరా చేయకపోవడం మీ చేతగానితనం కాదా రేవంత్ రెడ్డి? విద్యుత్ అధికారులను బాధ్యులుగా చేసి ఎందుకు వారిపై చర్యలు తీసుకుంటున్నారు? బొగ్గు నిల్వలు పెట్టుకోక కరెంట్ కోతలకు కారణం అయ్యారు.
అధికారుల తప్పు కాదు ఇది, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఫెయిల్ అయ్యారు. మీ చేతగానితనం విద్యుత్ అధికారులపై వేటు వేస్తారా? రైతు బీమా పథకాన్ని ఆపేసారు ఈ విషయం మీకు తెల్వదా? మీకు రిపోర్టులు రావడం లేదా? రైతు కుటుంబాలు అప్పుల పాలయ్యాయి. అయిన వారిని కాపాడుకునేందుకు ఆసుపత్రులు తిరిగి అప్పుల పాలయ్యారు. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయిన మూడు వేల మంది రైతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. ఎల్ ఐ సీకి ప్రీమియం చెల్లించి యదావిదిగా రైతు బీమా పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం.
ప్రభుత్వం దిగిరాకపోతే రైతు కుటుంబాలతో కలిసి సీఎం ఇల్లు ముట్టడిస్తాం, సచివాలయం ముట్టడిస్తాం అని హెచ్చరిస్తున్నాం. రైతు కుటుంబాలు ఆందోళన చెందవద్దు. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. అసెంబ్లీ వేదికగా రైతు బీమా పై ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మీకు బీమా డబ్బులు వచ్చేలా చేస్తాం అని రైతులకు హరీశ్‌రావు భరోసా కల్పించారు.
అంతకుముందు రైతులతో కలిసి భోజనం చేసిన హరీశ్ రావు ఆయా కుటుంబాల స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతు బీమా పథకం కింద రూ.5 లక్షల సాయం అందకపోవడం వల్ల ఎదుర్కొంటున్న సమస్యల గురించి హరీశ్ రావుకు ఈ సందర్భంగా వారు వివరించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని హరీశ్ రావుకు విజ్ఞప్తి చేసారు.
సంబంధిత వార్తలు

Telangana El Nino All Party Meeting | తెలంగాణపై ‘ఎల్ నినో’ ప్రభావం: రేపు డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం
అక్టోబర్ 15, 2026

Raghunandan Rao | ముందు విద్యుత్ కోతలపై సమాధానం చెప్పండి: బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు
అక్టోబర్ 15, 2026

BIG TV Chairman | రిపోర్టర్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. క్షణాల్లో 12 లక్షలు పంపిన బిగ్ టీవీ ఛైర్మన్
అక్టోబర్ 15, 2026
తాజావార్తలు
- ●Telangana El Nino All Party Meeting | తెలంగాణపై 'ఎల్ నినో' ప్రభావం: రేపు డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం
- ●Jairam Ramesh | భారత విదేశాంగ మంత్రి పర్యటనను అమెరికా ప్రకటిస్తదా?
- ●Dell Technologies | చిరు వ్యాపారులు, ఉద్యోగుల కోసం డెల్ కొత్త ల్యాప్‌టాప్‌లు.. బడ్జెట్ ధరలకే లభ్యం..
- ●Raghunandan Rao | ముందు విద్యుత్ కోతలపై సమాధానం చెప్పండి: బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు
- ●Myntra | ఇన్‌స్టాగ్రామ్‌లో మింత్రా కొత్త ఫీచర్.. క్రియేటర్లకు భారీ ఆదాయం..
- ●Hindu Temple Shooting Plot US | అమెరికాలో హిందూ ఆలయంపై కాల్పుల కుట్ర.. భారత్ సీరియస్

Telangana El Nino All Party Meeting | తెలంగాణపై 'ఎల్ నినో' ప్రభావం: రేపు డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం

Jairam Ramesh | భారత విదేశాంగ మంత్రి పర్యటనను అమెరికా ప్రకటిస్తదా?

Dell Technologies | చిరు వ్యాపారులు, ఉద్యోగుల కోసం డెల్ కొత్త ల్యాప్‌టాప్‌లు.. బడ్జెట్ ధరలకే లభ్యం..

Raghunandan Rao | ముందు విద్యుత్ కోతలపై సమాధానం చెప్పండి: బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు





