త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aadhar App | ఇక mAadhaar యాప్‌కు గుడ్‌బై.. కొత్త ఆధార్ యాప్‌లో అదిరిపోయే ఫీచర్లు..

Aadhar App | యూనిక్ ఐడెంటిఫికేష‌న్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న mAadhaar యాప్‌ను త్వరలో పూర్తిగా నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. దాని స్థానంలో ఇటీవల విడుదల చేసిన కొత్త ఆధార్ యాప్ ను వినియోగించాలని ప్రజలను ప్రోత్సహిస్తోంది.

S

Technology | Published On May 16, 2026, 12.51 pm IST

Aadhar App | ఇక mAadhaar యాప్‌కు గుడ్‌బై.. కొత్త ఆధార్ యాప్‌లో అదిరిపోయే ఫీచర్లు..
Advertisement

Aadhar App | యూనిక్ ఐడెంటిఫికేష‌న్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న mAadhaar యాప్‌ను త్వరలో పూర్తిగా నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. దాని స్థానంలో ఇటీవల విడుదల చేసిన కొత్త ఆధార్ యాప్ ను వినియోగించాలని ప్రజలను ప్రోత్సహిస్తోంది. ఈ కొత్త యాప్ ఐఫోన్ వినియోగదారుల కోసం యాప్ స్టోర్‌లో, ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. యూఐడీఏఐ తెలిపిన వివరాల ప్రకారం కొత్త ఆధార్ యాప్ మరింత స్మార్ట్‌, వేగవంతమైనది, భద్రత పరంగా బలమైన డిజిటల్ అనుభవాన్ని అందించేలా నిర్మాణ‌మైంది. దేశవ్యాప్తంగా ప్రజలకు సులభంగా ఉపయోగపడేలా ఇందులో 13 భారతీయ భాషలకు మద్దతు ఇచ్చారు.

యాప్‌లోనే ఫోన్ నంబ‌ర్‌, అడ్ర‌స్ అప్ డేట్‌..

ఈ యాప్‌లో ప్రధాన ఆకర్షణ క్యూ ఆర్ కోడ్ ఆధారిత ఆధార్ షేరింగ్, ఆఫ్‌లైన్ ఐడెంటిటీ వెరిఫికేషన్ సదుపాయం. సెలెక్టివ్ షేర్ అనే ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ ఆధార్ నంబర్ వెల్లడించకుండా అవసరమైన సమాచారం మాత్రమే ఇతరులతో పంచుకోవచ్చు. ఫోటో, పేరు, వయస్సు, లింగం, మొబైల్ నంబర్, చిరునామా లేదా ఆధార్ స్టేటస్ వంటి వివరాల్లో ఏవి షేర్ చేయాలో యూజర్ స్వ‌యంగా నిర్ణయించుకోవచ్చు. అధికారిక టెర్మినల్స్ వద్ద స్కాన్ చేయడానికి ప్రత్యేక క్యూ ఆర్ కోడ్‌ను కూడా యాప్ రూపొందిస్తుంది. దీని ద్వారా వేగంగా గుర్తింపు ధ్రువీకరణ చేయవచ్చు. అలాగే ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌, చిరునామా వంటి వివరాలను నేరుగా యాప్ నుంచే అప్‌డేట్ చేసుకునే సౌకర్యం కల్పించారు.

ఫోన్ పోతే జాగ్ర‌త్త ప‌డాల్సిందే..

కుటుంబ సభ్యుల వివరాలను కూడా ఈ యాప్‌లో నిర్వహించుకోవచ్చు. ప్రొఫైల్ సెక్షన్ ద్వారా గరిష్టంగా ఐదుగురు కుటుంబ సభ్యులను యాడ్ చేసుకునే అవకాశం ఉంది. భద్రత పరంగా కూడా యాప్‌లో పలు కొత్త ఫీచర్లు జోడించారు. బయోమెట్రిక్ లాక్ కంట్రోల్స్ ద్వారా వేలిముద్రలు, ముఖ గుర్తింపు, ఐరిస్ ఆథెంటికేషన్ డేటాను లాక్ చేయవచ్చు. దీని వల్ల అనధికార వినియోగాన్ని నివారించవచ్చని యూఐడీఏఐ తెలిపింది. అవసరమైతే యాప్ ద్వారానే లాక్ తొలగించే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ లేదా స్మార్ట్‌ఫోన్ యాక్సెస్ కోల్పోతే, తాత్కాలికంగా ఆధార్ సేవలను వినియోగించలేని పరిస్థితి ఏర్పడవచ్చని యూఐడీఏఐ హెచ్చరించింది. పాత mAadhaar యాప్‌లో ఉన్న డేటా ఆటోమేటిక్‌గా కొత్త యాప్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతుందా లేదా అనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. దీంతో ప్రస్తుతం mAadhaar వాడుతున్నవారు కొత్త యాప్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత తమ ప్రొఫైల్‌ను మళ్లీ మాన్యువల్‌గా సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది.

కొత్త ఆధార్ యాప్ డౌన్‌లోడ్, రిజిస్టర్ ఇలా..

గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి కొత్త ఆధార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత కావాల్సిన భాషను ఎంపిక చేసుకోవాలి. ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ లేదా వేరే మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 12 అంకెల ఆధార్ నంబర్ నమోదు చేసి ఓటీపీ ద్వారా ఎస్ఎంఎస్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. తర్వాత ఫేషియల్ ఆథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సరైన లైటింగ్ ఉండాలి. కళ్లద్దాలు ఉంటే తొలగించాలి. ఆపై యాప్ యాక్సెస్ కోసం 6 అంకెల పాస్‌వర్డ్ సెట్ చేయాలి. చివరగా హోమ్ పేజీకి వెళ్లి ఆధార్ కార్డు యాక్సెస్ చేయడం, షేర్ చేయడం, బయోమెట్రిక్ లాక్ పెట్టడం వంటి సేవలను వినియోగించుకోవచ్చు.

Advertisement
Advertisement