Aadhaar Security | ఆధార్ కార్డు దుర్వినియోగమవుతోందా? ఇలా చెక్ చేయండి.. భద్రతకు 5 సూచనలు..
Aadhaar Security | ఆధార్ వివరాలను మనకు తెలియకుండానే ఎవరైనా ఉపయోగిస్తున్నారా అనే అనుమానం ఉంటే ఆథెంటికేషన్ హిస్టరీని పరిశీలించుకోవచ్చు. ఇందుకోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ప్రత్యేక ఆన్‌లైన్ సదుపాయాన్ని అందిస్తోంది.
Aadhaar Security | ఆధార్ వివరాలను మనకు తెలియకుండానే ఎవరైనా ఉపయోగిస్తున్నారా అనే అనుమానం ఉంటే ఆథెంటికేషన్ హిస్టరీని పరిశీలించుకోవచ్చు. ఇందుకోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ప్రత్యేక ఆన్‌లైన్ సదుపాయాన్ని అందిస్తోంది. గత ఆరు నెలల్లో జరిగిన ఆధార్ ఆథెంటికేషన్ లావాదేవీల వివరాలను పరిశీలించి, అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించవచ్చు.
ఆథెంటికేషన్ హిస్టరీ తనిఖీ..
బ్యాంకింగ్ లావాదేవీలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మొబైల్ కనెక్షన్లు సహా అనేక సేవలకు ఆధార్ కీలకంగా మారింది. అయితే ఆధార్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వ్యక్తిగత వివరాలు దుర్వినియోగమయ్యే ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని యూఐడీఏఐ ఆధార్ వినియోగదారులకు ఆథెంటికేషన్ హిస్టరీని తనిఖీ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్ లేదా మైఆధార్ పోర్టల్‌లోకి వెళ్లి ఆధార్ నంబర్ లేదా 16 అంకెల వర్చువల్ ఐడీ (వీఐడీ) నమోదు చేయాలి. అనంతరం క్యాప్చా కోడ్ పూర్తి చేసి, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ చేసుకోవాలి. లాగిన్ అయిన తర్వాత లావాదేవీ తేదీ, సమయం, ఆథెంటికేషన్ రకం, ఏయూఏ వివరాలు, లావాదేవీ స్థితిని పరిశీలించవచ్చు. గత ఆరు నెలల చరిత్ర అందుబాటులో ఉంటుంది. ఒకేసారి గరిష్ఠంగా 50 రికార్డులను వీక్షించవచ్చు.
తెలియని లావాదేవీ కనిపిస్తే జాగ్రత్త..
ఆథెంటికేషన్ హిస్టరీలో తమకు తెలియని లావాదేవీ కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. ముందుగా సంబంధిత లావాదేవీ తేదీ, సమయం, ఇతర వివరాలను పరిశీలించి, ఆ సేవకు సంబంధించిన సంస్థను సంప్రదించి ఆధార్ ఎందుకు ఉపయోగించారో వివరణ కోరాలి. అనుమానం నివృత్తి కాకపోతే యూఐడీఏఐ ఫిర్యాదుల విభాగంలో ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం 1947 టోల్‌ఫ్రీ నంబర్‌కు కూడా కాల్ చేయవచ్చు. ఆధార్ బయోమెట్రిక్ లాకింగ్ మరో ముఖ్యమైన భద్రతా చర్య. దీన్ని యాక్టివేట్ చేస్తే వినియోగదారులు అన్‌లాక్ చేసే వరకు వేలిముద్రలు, ఐరిస్ ఆధారిత ఆథెంటికేషన్ నిలిచిపోతుంది. ఈ సదుపాయం మైఆధార్ పోర్టల్, ఎంఆధార్ యాప్‌లో అందుబాటులో ఉంది. అలాగే ఆధార్ నంబర్‌ను లాక్ చేసి, ఆథెంటికేషన్ కోసం వర్చువల్ ఐడీని ఉపయోగించవచ్చు.
అవసరం లేకపోతే ఇవ్వకూడదు..
ఆధార్ ఫొటోకాపీలను అవసరం లేనప్పుడు ఇతరులకు ఇవ్వకూడదు. పరిమిత గుర్తింపు వివరాలు మాత్రమే అవసరమైన సంస్థలకు మాస్క్డ్ ఆధార్‌ను అందించవచ్చు. ఇందులో ఆధార్ నంబర్‌లోని మొదటి ఎనిమిది అంకెలు కనిపించకుండా ఉండి, చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. అలాగే ఓటీపీ భద్రత విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఫోన్ కాల్ లేదా మెసేజ్ ద్వారా ఎవరైనా అడిగినా ఓటీపీని ఇతరులతో పంచుకోకూడదు. క్రమం తప్పకుండా ఆథెంటికేషన్ హిస్టరీని తనిఖీ చేయడం, యూఐడీఏఐ అందిస్తున్న భద్రతా సదుపాయాలను వినియోగించుకోవడం ద్వారా ఆధార్ దుర్వినియోగ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!
- ●Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..
- ●Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!
- ●Silent Heart Attack Causes | గుండెపోటు సడన్‌గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!
- ●Gold Price | వరుసగా నాలుగో రోజూ తగ్గిన బంగారం ధర.. తులంపై రూ.2,500 డౌన్..!
- ●IAS Rajiv Hanumanthu Road Accident | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తెలంగాణ ఐఏఎస్ రాజీవ్ హనుమంతు.. ఫోన్లో పరామర్శించి భరోసా ఇచ్చిన పొంగులేటి

Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!

Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..

Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!

Silent Heart Attack Causes | గుండెపోటు సడన్‌గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!






