త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aadhaar | త‌ల్లిదండ్రుల‌కు గుడ్ న్యూస్‌.. సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు పిల్ల‌ల‌కు ఆధార్ అప్‌డేట్స్ ఫ్రీ..

Aadhaar | ఇంట్లో 5 లేదా 15 ఏళ్ల వయసున్న పిల్లలు ఉన్నారా? అయితే ఈ వార్త మీకోసమే. మీ పిల్లల ఆధార్ బయోమెట్రిక్స్ ఇంకా అప్‌డేట్ చేయకపోతే సెప్టెంబర్ 30వ తేదీలోపు ఉచితంగా చేయించుకోవచ్చు. ఆధార్ బయోమెట్రిక్స్ అప్‌డేట్‌లో ఆలస్యం జరిగితే పాఠశాల ప్రవేశాల నుంచి ప్రభుత్వ పథకాలు, స్కాలర్‌షిప్‌ల వరకు ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

S

Business | Published On Aug 19, 2026, 3.17 pm IST

Aadhaar | త‌ల్లిదండ్రుల‌కు గుడ్ న్యూస్‌.. సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు పిల్ల‌ల‌కు ఆధార్ అప్‌డేట్స్ ఫ్రీ..
Advertisement

Aadhaar | ఇంట్లో 5 లేదా 15 ఏళ్ల వయసున్న పిల్లలు ఉన్నారా? అయితే ఈ వార్త మీకోసమే. మీ పిల్లల ఆధార్ బయోమెట్రిక్స్ ఇంకా అప్‌డేట్ చేయకపోతే సెప్టెంబర్ 30వ తేదీలోపు ఉచితంగా చేయించుకోవచ్చు. ఆధార్ బయోమెట్రిక్స్ అప్‌డేట్‌లో ఆలస్యం జరిగితే పాఠశాల ప్రవేశాల నుంచి ప్రభుత్వ పథకాలు, స్కాలర్‌షిప్‌ల వరకు ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఆధార్ సంస్థ అందించిన సమాచారం ప్రకారం.. పిల్లలకు 5 లేదా 15 ఏళ్లు నిండిన వెంటనే వారి బయోమెట్రిక్స్‌ను అప్‌డేట్ చేయాలి. ఇలా చేయడం వల్ల స్కాలర్‌షిప్‌లు, పాఠశాల ప్రవేశాలు లేదా పరీక్షలకు దరఖాస్తు చేసే సమయంలో వారి గుర్తింపును సులభంగా ధ్రువీకరించవచ్చు. ఇది తొలిసారి జరుగుతున్న ప్రక్రియ కాదు. పిల్లలకు 5, 15 ఏళ్లు నిండినప్పుడు వారి బయోమెట్రిక్స్‌ను అప్‌డేట్ చేయాలని యూఐడీఏఐ నిరంతరం తల్లిదండ్రులకు సూచిస్తోంది.

ఏయే వ‌య‌స్సుల్లో అప్‌డేట్ చేయాలి..

పిల్లలు పుట్టిన సమయంలోనే ఆధార్ కార్డు రూపొందించవచ్చు. ప్రతి చిన్నారికి ప్రత్యేకమైన బయోమెట్రిక్ గుర్తింపు ఉంటుంది. అయితే వయసు పెరిగే కొద్దీ శారీరక మార్పులు చోటుచేసుకుంటాయి. 5 ఏళ్లలోపు పిల్లలకు వేలిముద్రలు, కంటి కనుపాపల స్కాన్ వంటి బయోమెట్రిక్ వివరాలను నమోదు చేయరు. యూఐడీఏఐ సూచనల ప్రకారం.. పిల్లలకు 5 ఏళ్లు నిండినప్పుడు ఒకసారి, 15 ఏళ్లు నిండినప్పుడు మరోసారి బయోమెట్రిక్స్‌ను అప్‌డేట్ చేయాలి. ఈ సమయంలో పిల్లల ఫొటో, వేలిముద్రలు, కంటి కనుపాపల వివరాలను మళ్లీ నమోదు చేస్తారు. మీ పిల్లల ఆధార్ బయోమెట్రిక్స్‌ను అప్‌డేట్ చేయాలంటే ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాలి. ఆధార్ యాప్ ద్వారా ముందుగానే అపాయింట్‌మెంట్ కూడా తీసుకోవచ్చు. ఇందుకోసం పిల్లల ఆధార్ కార్డుతోపాటు తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఆధార్‌ను కూడా వెంట తీసుకెళ్లాలి.

అనేక అవ‌స‌రాల‌కు..

ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన డిజిటల్ గుర్తింపు ఉంటుంది. పాఠశాల ప్రవేశాలు, ప్రభుత్వ ప్రయోజనాలు, స్కాలర్‌షిప్‌లు లేదా ఇతర అవసరాల కోసం పిల్లలకు బయోమెట్రిక్ ధ్రువీకరణ అవసరమైనప్పుడు ఆధార్ బయోమెట్రిక్స్ అప్‌డేట్ కాకపోతే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దీంతో అనేక పనులు ఆలస్యం అవుతాయి. ఇలాంటి సాంకేతిక, పరిపాలనా సమస్యలను నివారించేందుకు పిల్లల ఆధార్ బయోమెట్రిక్స్‌ను నిర్ణీత సమయంలో అప్‌డేట్ చేయడం ముఖ్యం. అప్‌డేట్‌ను చాలా కాలం పాటు పూర్తి చేయకపోతే పిల్లల ఆధార్ డీయాక్టివేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.

Advertisement
Advertisement