త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aadhar New App | ఇక ఆధార్ సెంట‌ర్స్‌కు వెళ్లాల్సిన ప‌ని లేదు.. ఇంట్లో నుంచే ఈ ప‌నుల‌న్నీ చ‌క్క‌బెట్టుకోవ‌చ్చు..!

Aadhar New App | ఆధార్ కార్డు ఉన్న వారికి ఉడాయ్ శుభవార్త చెప్పింది. ఆధార్ సేవలను ఇంకా ఈజీగా చేసేందుకు కొత్త ఫీచర్లతో కూడిన అప్‌డేటెడ్ ఆధార్ యాప్ ఫుల్ వెర్ష‌న్‌ను బుధ‌వారం రిలీజ్ చేసింది. ఈ యాప్‌తో యూజ‌ర్లు ఇంట్లో నుంచే చాలా వ‌ర‌కు ఆధార్ అప్‌డేట్ ప‌నులు పూర్తి చేసుకునే అవ‌కాశం క‌ల్పించింది.

P

Technology | Published On Jan 28, 2026, 9.12 pm IST

Aadhar New App | ఇక ఆధార్ సెంట‌ర్స్‌కు వెళ్లాల్సిన ప‌ని లేదు.. ఇంట్లో నుంచే ఈ ప‌నుల‌న్నీ చ‌క్క‌బెట్టుకోవ‌చ్చు..!
Advertisement

Aadhar New App | ఆధార్ కార్డు ఉన్న వారికి ఉడాయ్ శుభవార్త చెప్పింది. ఆధార్ సేవలను ఇంకా ఈజీగా చేసేందుకు కొత్త ఫీచర్లతో కూడిన అప్‌డేటెడ్ ఆధార్ యాప్ ఫుల్ వెర్ష‌న్‌ను బుధ‌వారం రిలీజ్ చేసింది. ఈ యాప్‌తో యూజ‌ర్లు ఇంట్లో నుంచే చాలా వ‌ర‌కు ఆధార్ అప్‌డేట్ ప‌నులు పూర్తి చేసుకునే అవ‌కాశం క‌ల్పించింది. ఇక‌పై చిన్న చిన్న మార్పుల కోసం ఆధార్ సెంట‌ర్స్ చుట్టూ తిర‌గాల్సిన ప‌ని ఉండ‌దు. ఇప్పటివరకు వాడుతున్న ఎంఆధార్‌ (mAadhaar) యాప్‌తో పోలిస్తే.. ఈ కొత్త యాప్‌లో మరెన్నో అద‌నంగా ఫెసిలిటీస్ క‌ల్పించింది. వాస్త‌వానికి ఈ యాప్‌ను గ‌తేడాది న‌వంబ‌ర్‌లోనే ప‌రిచ‌యం చేసినా.. అప్పట్లో పరిమిత సేవలే అందుబాటులో ఉన్నాయి.

తాజాగా ఇప్పుడు పూర్తి వెర్షన్ విడుదల కావడంతో మొబైల్ నంబర్ మార్పు, ఇంటి చిరునామా అప్‌డేట్ వంటి త‌దిత‌ర పనులు నేరుగా యాప్ ద్వారానే పూర్తి చేసుకునేందుకు అవ‌కాశం ఇచ్చింది. ఒకే యాప్‌లో కుటుంబ సభ్యుల ఐదు ఆధార్ కార్డుల వరకు జోడించి.. అందులోనే మార్పులు చేసుకునే వెసులుబాటు క‌ల్పించింది. ఇక యాప్‌లో యూజ‌ర్ల భ‌ద్ర‌త‌కు ప్రాధాన్యం ఇచ్చింది. ‘సెలెక్టివ్ షేర్’ ఫీచర్ ద్వారా ఆధార్ నంబర్ మొత్తం క‌నిపించ‌కుండా.. కేవ‌లం ఐడెంటిఫికేష‌న్ కేసం షేర్ చేసుకోవ‌చ్చు. పేరు, ఫొటో, పుట్టిన తేదీ, చిరునామా లాంటి వివరాల్లో అవసరమైన వాటినే షేర్ చేసుకునే ఆప్ష‌న్ ఇచ్చింది. ఫ‌లితంగా వ్య‌క్తిగ‌త స‌మాచారం గోప్యంగా ఉంటుంది. ఫింగ‌ర్ ఫ్రింట్స్‌, ఫేస్‌, ఐరిష్ వంటి బ‌యోమెట్రిక్ సేవ‌ల‌ను లాక్ చేసుకునే స‌దుపాయం సైతం ఉంది. ఫోన్ ఎక్కడైనా పోయినా, ఎవరైనా దొంగిలించినా యాప్ స్వయంచాలకంగా లాగ్ అవుట్ అవుతుందని ఉడాయ్ వెల్లడించింది.

యూఐడీఏఐతో పాటు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కలిసి ఈ యాప్‌ను రూపొందించాయి. ప్రస్తుతం ఇది 13 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ ఆధార్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఐడెంటిఫికేష‌న్ వెరిఫికేష‌న్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రెండు ఆఫ్‌లైన్ విధానాలు ఉన్నాయి. ఒకటి పాస్‌వర్డ్‌తో ఉన్న ఆధార్ ఫైల్ ద్వారా అవసరమైన వివరాలు మాత్రమే పంచుకోవడం ఒక‌టి కాగా.. మరోటి యాప్‌లో ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి వెరిఫికేషన్ పూర్తి చేయడం. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆధార్‌కు సంబంధించిన సేవలను సులభంగా ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని ఉడాయ్ తెలిపింది.

Advertisement

తాజావార్తలు

Advertisement