త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uber | ఉబెర్‌లో కొత్త సేఫ్టీ ఫీచర్లు.. ప్రయాణం మరింత సురక్షితం..

Uber | భారత్‌లో తమ రైడ్-హైలింగ్ ప్లాట్‌ఫామ్ భద్రతను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఉబెర్ న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో పలు కొత్త సేఫ్టీ ఫీచర్లను ప్రకటించింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం ఈ కొత్త ఫీచర్లు అత్యవసర పరిస్థితుల్లో వేగంగా సహాయం అందించడం, డ్రైవింగ్ సమయంలో దృష్టి మరలకుండా చూడటం, అలాగే ప్రయాణాన్ని ధ్రువీకరించే ప్రక్రియపై వినియోగదారులకు మరింత నియంత్రణ కల్పించడం వంటి అంశాలపై దృష్టి సారించాయి.

S

Technology | Published On Jul 1, 2026, 10.16 am IST

Uber | ఉబెర్‌లో కొత్త సేఫ్టీ ఫీచర్లు.. ప్రయాణం మరింత సురక్షితం..
Advertisement

Uber | భారత్‌లో తమ రైడ్-హైలింగ్ ప్లాట్‌ఫామ్ భద్రతను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఉబెర్ న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో పలు కొత్త సేఫ్టీ ఫీచర్లను ప్రకటించింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం ఈ కొత్త ఫీచర్లు అత్యవసర పరిస్థితుల్లో వేగంగా సహాయం అందించడం, డ్రైవింగ్ సమయంలో దృష్టి మరలకుండా చూడటం, అలాగే ప్రయాణాన్ని ధ్రువీకరించే ప్రక్రియపై వినియోగదారులకు మరింత నియంత్రణ కల్పించడం వంటి అంశాలపై దృష్టి సారించాయి. కొత్తగా ప్రవేశపెట్టిన ఫీచర్లలో రికార్డ్ మై రైడ్, అంబులెన్స్ అసిస్టెన్స్, డోంట్ టైప్ అండ్ డ్రైవ్, సెట్ యువర్ ఓన్ పిన్ ఉన్నాయి. ఇవి ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆడియో రికార్డింగ్, రైడ్‌చెక్, విమెన్ రైడర్ ప్రిఫరెన్స్, హెల్మెట్ సెల్ఫీ వెరిఫికేషన్ వంటి భద్రతా సదుపాయాలకు అదనంగా చేరాయి.

రికార్డ్ మై రైడ్‌, అంబులెన్స్ అసిస్టెన్స్‌..

రికార్డ్ మై రైడ్ ఫీచర్ ద్వారా ప్ర‌యాణికులు లేదా డ్రైవ‌ర్లు ప్రయాణ సమయంలో తమకు అసురక్షితంగా అనిపిస్తే, ఉబెర్ యాప్ నుంచే స్మార్ట్‌ఫోన్ ఉపయోగించి క్యాబ్‌లో వీడియో రికార్డింగ్ ప్రారంభించవచ్చు. ఈ వీడియో పూర్తిగా ఎన్‌క్రిప్ట్ రూపంలోనే సేవ్ అవుతుంది. ఉబెర్‌కు ఈ వీడియోను నేరుగా చూసే అవకాశం ఉండదు. భద్రతా ఫిర్యాదు చేసే సమయంలో డ్రైవర్ లేదా ప్రయాణికుడు స్వచ్ఛందంగా సమర్పించినప్పుడే ఆ వీడియోను యాక్సెస్ చేయగలమని ఉబెర్ తెలిపింది. పరిశ్రమలో ఇలాంటి విధానంతో వస్తున్న తొలి ఫీచర్ ఇదేనని కంపెనీ పేర్కొంది. అలాగే డయల్ 4242తో భాగస్వామ్యం ద్వారా అంబులెన్స్ అసిస్టెన్స్ సేవను కూడా ప్రారంభించింది. ఉబెర్ ప్రయాణం సమయంలో ప్రమాదం జరిగితే, డ్రైవర్ లేదా ప్రయాణికుడు ఉబెర్‌లో ఇప్పటికే ఉన్న 24x7 సేఫ్టీ లైన్ ద్వారా వెంటనే వైద్య సహాయాన్ని కోరవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా అంబులెన్స్ సేవలు అందించేందుకు ఈ అప్‌డేట్‌ ఉపయోగపడుతుందని కంపెనీ వెల్లడించింది.

రోడ్డు ప్ర‌మాదాల‌ను త‌గ్గించ‌డ‌మే ల‌క్ష్యంగా..

డ్రైవింగ్ సమయంలో మొబైల్‌లో టైపింగ్ చేయడం వల్ల దృష్టి మరలకుండా ఉండేందుకు డోంట్ టైప్ అండ్ డ్రైవ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. వాహనం కదులుతున్న సమయంలో ఉబెర్ డ్రైవర్ యాప్‌లో మాన్యువల్ టైపింగ్ ను పూర్తిగా నిలిపివేస్తారు. సందేశాలకు సమాధానం ఇవ్వాలంటే ముందుగా వాహనాన్ని సురక్షితంగా ఆపాలని యాప్ సూచిస్తుంది. దీని ద్వారా రోడ్డు ప్రమాదాల అవకాశాలను తగ్గించాలని ఉబెర్ భావిస్తోంది. మరో ముఖ్యమైన ఫీచర్ సెట్ యువర్ ఓన్ పిన్. ఇప్పటివరకు ప్రయాణ ధ్రువీకరణ కోసం ఆటోమేటిక్‌గా రూపొందిన పిన్‌ను ఉపయోగించాల్సి ఉండేది. ఇకపై ప్రయాణికులు తమకు నచ్చిన పిన్‌ను స్వయంగా సెట్ చేసుకుని, అవసరానికి అనుగుణంగా నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. ఉబెర్ ఇప్పటికే రైడ్‌చెక్, ఫోన్, అడ్రస్ అనానిమైజేషన్, సేఫ్టీ ప్రిఫరెన్సెస్, సీట్‌బెల్ట్ రిమైండర్లు, ఆడియో రికార్డింగ్, విమెన్ రైడర్ ప్రిఫరెన్స్, హెల్మెట్ సెల్ఫీ వెరిఫికేషన్, 24x7 సేఫ్టీ లైన్ వంటి పలు భద్రతా సదుపాయాలను అందిస్తోంది. తాజాగా ప్రకటించిన ఫీచర్లతో ఈ సేఫ్టీ ఎకోసిస్టమ్ మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌ని ఉబెర్ తెలిపింది.

Advertisement
Advertisement