True Caller | ట్రూకాలర్ కొత్త టూల్.. ఫోన్ నంబర్, లింక్, మెసేజ్‌లను చెక్ చేయొచ్చు..
True Caller | ట్రూకాలర్ స్కామ్ చెకర్ పేరుతో కొత్త ప్రత్యేక టూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వెబ్‌సైట్‌తోపాటు మొబైల్ యాప్‌లోనూ అందుబాటులో ఉండే ఈ ఫీచర్ ద్వారా మోసాలను గుర్తించడంతోపాటు, కొత్తగా వెలుగులోకి వస్తున్న స్కామ్ విధానాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.
Technology | Published On Sep 28, 2026, 4.45 pm IST
True Caller | ట్రూకాలర్ స్కామ్ చెకర్ పేరుతో కొత్త ప్రత్యేక టూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వెబ్‌సైట్‌తోపాటు మొబైల్ యాప్‌లోనూ అందుబాటులో ఉండే ఈ ఫీచర్ ద్వారా మోసాలను గుర్తించడంతోపాటు, కొత్తగా వెలుగులోకి వస్తున్న స్కామ్ విధానాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు కాలర్ గుర్తింపు, స్పామ్ కాల్స్ నిరోధించడంపై ప్రధానంగా దృష్టి పెట్టిన సంస్థ, ఈ కొత్త ఫీచర్‌తో తన సేవలను మరింత విస్తరించింది. మోసపూరిత కమ్యూనికేషన్లలో సాధారణంగా కనిపించే ఫోన్ నంబర్లు, వెబ్ లింకులు, వాటికి సంబంధించిన సందేశాలు లేదా ఇతర వివరాలను ఒకే చోట పరిశీలించుకునేలా స్కామ్ చెకర్‌ను రూపొందించారు. అనుమానాస్పద వ్యక్తి లేదా లింక్‌తో స్పందించే ముందు దాని గురించి వివరాలు తెలుసుకునేందుకు ఈ టూల్ ఉపయోగపడుతుంది.
లింక్ వెరిఫికేషన్ ఫీచర్..
స్కామ్ చెకర్‌లో భాగంగా లింక్ వెరిఫికేషన్ సదుపాయం ఉంది. వినియోగదారులు ఏదైనా వెబ్ అడ్రస్‌ను నమోదు చేసి, అది భద్రతాపరమైన ప్రమాదాలను కలిగించే అవకాశముందా లేదా ఫిషింగ్ ప్రచారాల్లో సాధారణంగా కనిపించే లక్షణాలు ఉన్నాయా అనే విషయాలను పరిశీలించవచ్చు. అదేవిధంగా ఫోన్ నంబర్ సెర్చ్ సదుపాయం ద్వారా నిర్దిష్ట నంబర్‌కు సంబంధించిన రిస్క్ వివరాలను తెలుసుకోవచ్చు. ఇందుకోసం ట్రూకాలర్‌కు చెందిన ఆటోమేటెడ్ డిటెక్షన్ వ్యవస్థతోపాటు వినియోగదారులు గతంలో ఇచ్చిన నివేదికలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ట్రూకాలర్‌కు చెందిన స్కామ్‌ఫీడ్ డేటాబేస్‌ను కూడా స్కామ్ చెకర్‌లో భాగం చేశారు. ఇందులో ఇతర వినియోగదారులు నివేదించిన మోసాలకు సంబంధించిన వివరాలను సెర్చ్ చేసి, ఇలాంటి మోసాల్లో ఉపయోగించిన విధానాలను తెలుసుకోవచ్చు.
కాంటెక్స్చువల్ క్వెరీ సెర్చ్..
మరో ముఖ్యమైన సదుపాయం కాంటెక్స్చువల్ క్వెరీ సెర్చ్. వినియోగదారులు తమకు ఎదురైన అనుమానాస్పద ఘటనను సాధారణ భాషలో వివరించవచ్చు. ఆ వివరాలను వ్యవస్థ విశ్లేషించి, అందులో ఉన్న ఫోన్ నంబర్లు లేదా లింకులను గుర్తించడంతోపాటు, ట్రూకాలర్ కమ్యూనిటీ గతంలో నమోదు చేసిన సంబంధిత నివేదికలను కూడా చూపిస్తుంది. స్కామ్ చెకర్‌కు రాబోయే రోజుల్లో మరిన్ని డిటెక్షన్ సదుపాయాలను జోడించనున్నట్లు ట్రూకాలర్ తెలిపింది. అనుమానాస్పద సందేశాలు లేదా ఘటనలకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను అప్‌లోడ్ చేసి వాటిపై మరింత లోతైన దృశ్య, టెక్స్ట్ విశ్లేషణ చేసే సదుపాయాన్ని తీసుకురానుంది. అలాగే వినియోగదారు ధ్రువీకరణ వ్యవస్థతోపాటు కొత్త రకాల మోసాలపై విస్తృత స్థాయిలో పర్యవేక్షణ చేసే ఫీచర్లను కూడా అందుబాటులోకి తీసుకురానుంది.
ఏ ప్లాట్‌ఫామ్‌పై..
ట్రూకాలర్ స్కామ్ చెకర్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అధికారిక ట్రూకాలర్ వెబ్‌సైట్ ద్వారా అందుబాటులో ఉంది. మొబైల్‌లో ప్రారంభ దశలో భారత్‌లోని ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఈ సదుపాయం అందుబాటులోకి వస్తోంది. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలకు, అలాగే ఐఓఎస్ వినియోగదారులకు కూడా దీన్ని విస్తరించనున్నారు. ట్రూకాలర్ సీఈఓ రిషిత్ ఝున్‌ఝున్‌వాలా మాట్లాడుతూ ఏదో తప్పుగా ఉందని చాలామంది గుర్తించినప్పటికీ, స్పందించే ముందు దాన్ని త్వరగా తనిఖీ చేసుకునే మార్గం అవసరమవుతుందని చెప్పారు. అనుమానాస్పద లింక్, నంబర్ లేదా సందేశాన్ని ఒకే చోట పరిశీలించుకునేలా ట్రూకాలర్ డిటెక్షన్ వ్యవస్థలను, తమ కమ్యూనిటీ అందించిన సమాచారాన్ని స్కామ్ చెకర్‌లో ఒకచోటికి తీసుకొచ్చినట్లు తెలిపారు.
తాజావార్తలు
- ●Karthik Reddy | బహదూర్‌గూడా రైతుల పరిస్థితి ప్యారడైజ్ సినిమా లెక్కనే ఉంది
- ●TGPSC | టీజీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 24 నుంచి నవంబర్ 13 వరకు నియామక పరీక్షలు
- ●Telangana Graduate MLC Voter Registration | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు షురూ: అర్హతలు ఇవే.. ఫోన్ నుంచే ఫారమ్-18 కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి
- ●MLA Sanjay | ప్రమీల చాలా మంది పసిబిడ్డలను కాపాడారు
- ●Asian Games | ఆసియా గేమ్స్‌లో దాయాదుల సమరం.. అక్టోబర్ 1న హైవోల్టేజ్ మ్యాచ్
- ●Ashika Ranganath | ఏజ్ గ్యాప్‌పై ట్రోల్స్ - అజిత్ సినిమా నుంచి శ్రీలీల ఔట్ - కన్నడ బ్యూటీకి ఛాన్స్

Karthik Reddy | బహదూర్‌గూడా రైతుల పరిస్థితి ప్యారడైజ్ సినిమా లెక్కనే ఉంది

TGPSC | టీజీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 24 నుంచి నవంబర్ 13 వరకు నియామక పరీక్షలు

Telangana Graduate MLC Voter Registration | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు షురూ: అర్హతలు ఇవే.. ఫోన్ నుంచే ఫారమ్-18 కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి

MLA Sanjay | ప్రమీల చాలా మంది పసిబిడ్డలను కాపాడారు






