త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Truecaller | ట్రూకాలర్ ట్యాగ్‌లపై ట్రాయ్ అభ్యంతరం.. అపోహ‌లు క‌లిగించే అవ‌కాశం ఉంద‌ని వ్యాఖ్య

Truecaller | కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ (Truecaller) 140, 1600 సిరీస్ నంబర్లకు చూపిస్తున్న ఫ్రీక్వెంట్లీ బ్లాక్డ్ ట్యాగ్‌లపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ, బ్యాంకింగ్, ఇతర అధికారిక సంస్థల నుంచి వచ్చే కీలక కాల్స్‌పై ఇలాంటి హెచ్చరికలు వినియోగదారుల్లో అపోహలు కలిగించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

P

Business | Published On Jul 19, 2026, 8.22 pm IST

Truecaller | ట్రూకాలర్ ట్యాగ్‌లపై ట్రాయ్ అభ్యంతరం.. అపోహ‌లు క‌లిగించే అవ‌కాశం ఉంద‌ని వ్యాఖ్య
Advertisement

Truecaller | కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ (Truecaller) 140, 1600 సిరీస్ నంబర్లకు చూపిస్తున్న ఫ్రీక్వెంట్లీ బ్లాక్డ్ ట్యాగ్‌లపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ, బ్యాంకింగ్, ఇతర అధికారిక సంస్థల నుంచి వచ్చే కీలక కాల్స్‌పై ఇలాంటి హెచ్చరికలు వినియోగదారుల్లో అపోహలు కలిగించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ట్రాయ్ నిబంధనల ప్రకారం ప్రత్యేక ప్రయోజనాల కోసం కేటాయించిన నంబర్ సిరీస్‌లకు ప్రతికూల అర్థం వచ్చే ట్యాగ్‌లను జోడించడం సరికాదని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. అలాంటి లేబుల్స్ కారణంగా అవసరమైన సమాచారాన్ని అందించే కాల్స్‌ను కూడా ప్రజలు పట్టించుకోకుండా బ్లాక్ చేసే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

అవాంఛిత ప్రచార కాల్స్‌ను నియంత్రించేందుకు ట్రూకాలర్ తరహా ట్యాగింగ్ కంటే ట్రాయ్ అందుబాటులో ఉంచిన అధికారిక డూ నాట్ డిస్టర్బ్ (డీఎన్‌డీ) వ్యవస్థను వినియోగించాలని ప్రజలకు అవగాహన కల్పించాలని ట్రూకాలర్‌కు సూచించినట్లు సమాచారం. డీఎన్‌డీ సేవల వినియోగం పెరిగితే స్పామ్ కాల్స్ సమస్యను మరింత సమర్థవంతంగా తగ్గించవచ్చని ట్రాయ్ భావిస్తోంది. టెలికాం నిబంధనల ప్రకారం 1600 సిరీస్ నంబర్లు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఆర్‌బీఐ, సెబీ, ఐఆర్‌డీఏఐ వంటి నియంత్రణ సంస్థల పరిధిలోని సేవలు, ప్రభుత్వ సమాచార ప్రసారం కోసం కేటాయించారు. లావాదేవీల ధ్రువీకరణ, మోసాలపై హెచ్చరికలు, ఇతర అత్యవసర సమాచారం కూడా ఇదే సిరీస్ ద్వారా వినియోగదారులకు చేరుతుంది. అందువల్ల ఈ నంబర్లపై ప్రతికూల ట్యాగ్‌లు ప్రదర్శించడం తగదని ట్రాయ్ స్పష్టం చేసింది. అదే విధంగా 140 సిరీస్ నంబర్లను రిజిస్టర్డ్ టెలిమార్కెటింగ్ సంస్థలు చేసే ప్రచార కాల్స్ కోసం కేటాయించారు. ఇవి కూడా నియంత్రిత వ్యవస్థలో పనిచేసే నంబర్లేనని అధికారులు గుర్తు చేస్తున్నారు.

ఇక ట్రూకాలర్ మాత్రం భిన్నమైన వాదన వినిపిస్తోంది. ట్రాయ్ అమలు చేసిన తాజా నిబంధనల తర్వాత స్పామ్ కాల్స్ సంఖ్య పెరిగిందని, దీంతో వినియోగదారులే పెద్దఎత్తున 140, 1600 సిరీస్ నంబర్లను బ్లాక్ చేస్తున్నారని పేర్కొంటోంది. యూజర్ల ప్రవర్తన ఆధారంగానే "ఫ్రీక్వెంట్లీ బ్లాక్డ్" వంటి ట్యాగ్‌లు చూపిస్తున్నామని, వాటి వల్ల అసలైన వ్యాపార, సేవా సంబంధిత కాల్స్‌పై కూడా విశ్వాసం తగ్గుతున్నదని వెల్లడించింది. ఈ అంశంపై ట్రాయ్, ట్రూకాలర్ మధ్య కొంతకాలంగా అభిప్రాయ బేధాలు త‌లెత్తుతున్నాయి. అధికారిక సేవల కోసం కేటాయించిన నంబర్ల విశ్వసనీయత దెబ్బతినకుండా చూడాల్సిన అవసరం ఉందని ట్రాయ్ స్పష్టం చేస్తుండగా, వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే ట్యాగింగ్ జరుగుతోందని ట్రూకాలర్ వాదిస్తోంది.

Advertisement
Advertisement