TRAI | 140, 1600 సిరీస్ నంబర్లపై మరోమారు స్పందించిన ట్రాయ్
TRAI | దేశవ్యాప్తంగా ఉన్న మొబైల్ వినియోగదారులకు ప్రస్తుతం స్పామ్, స్కామ్ కాల్స్ బెడద ఎక్కువైన నేపథ్యంలో చాలా మంది అలాంటి కాల్స్‌ను బ్లాక్ చేసేందుకు ట్రూ కాలర్ వంటి యాప్‌లను ఉపయోగిస్తున్నారు. అయితే 140, 1600 సిరీస్ నంబర్ల బ్లాకింగ్ విషయంలో ఇటీవల టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)కి, ట్రూ కాలర్‌కు మధ్య విభేదాలు తలెత్తాయి.
Technology | Published On Jul 20, 2026, 3.03 pm IST
TRAI | దేశవ్యాప్తంగా ఉన్న మొబైల్ వినియోగదారులకు ప్రస్తుతం స్పామ్, స్కామ్ కాల్స్ బెడద ఎక్కువైన నేపథ్యంలో చాలా మంది అలాంటి కాల్స్‌ను బ్లాక్ చేసేందుకు ట్రూ కాలర్ వంటి యాప్‌లను ఉపయోగిస్తున్నారు. అయితే 140, 1600 సిరీస్ నంబర్ల బ్లాకింగ్ విషయంలో ఇటీవల టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)కి, ట్రూ కాలర్‌కు మధ్య విభేదాలు తలెత్తాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఇతర కంపెనీలు ఆ నంబర్ల సిరీస్‌ను దుర్వినియోగం చేస్తున్నాయని, ఆ నంబర్ల నుంచి వస్తున్న కాల్స్‌ను చాలా వరకు వినియోగదారులు బ్లాక్ చేస్తున్నారని, అందువల్ల ఆ నంబర్లను కచ్చితంగా స్పామ్, స్కామ్‌లుగా ప్రదర్శించాల్సిందేనని ట్రూ కాలర్ అభిప్రాయపడింది. అయితే ట్రాయ్ ఈ విషయంపై ఇటీవలే స్పష్టతను ఇవ్వగా, మరోమారు దీని గురించి ప్రస్తావించింది. ఆయా నంబర్లను స్పామ్ నంబర్లుగా ప్రదర్శించడానికి వీలు లేదని, కచ్చితంగా ఆ నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను వినియోగదారులకు లభించేలా చూడాలని తేల్చి చెప్పింది.
స్పామ్‌గా ట్యాగ్ చేస్తే చర్యలు..
కాల్స్‌ను నిర్వహించే యాప్‌లు, కాలర్ ఐడీ ప్లాట్‌ఫామ్‌లు 140, 1600 సిరీస్ నంబర్లను తప్పుగా స్పామ్‌గా ట్యాగ్ చేస్తే వాటిపై చర్యలు తీసుకునే అధికారం ఇవ్వాలని ట్రాయ్ ఇటీవలే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మెయిటీ)ని కోరింది. ఈ ప్రతిపాదనపై ట్రూకాలర్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రూకాలర్ సీఈఓ రిషిత్ ఝున్‌ఝున్‌వాలా మాట్లాడుతూ ట్రాయ్ గతంలో జారీ చేసిన నిబంధనల ప్రకారమే ఈ నంబర్లను టెక్ కంపెనీలు స్పామ్‌గా ట్యాగ్ చేయకూడదని ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే గతేడాది చివర్లో ట్రాయ్ ప్రత్యేకంగా ట్రూకాలర్‌ను సంప్రదించి 140, 1600 సిరీస్ నంబర్లపై వినియోగదారులు ఇచ్చే కమ్యూనిటీ స్పామ్ రిపోర్ట్‌లను చూపించవద్దని కోరిందని ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయం తర్వాత ఇలాంటి కాల్స్‌కు వినియోగదారులు స్పందించకుండా వదిలేయడం గణనీయంగా పెరిగిందని కూడా తెలిపారు. ఈ వివాదం నేపథ్యంలోనే ట్రాయ్ ఇప్పుడు ఈ నిబంధనలు ఎందుకు అమల్లో ఉన్నాయో వివరించింది.

1600 సిరీస్ నంబర్లు ఇందుకోసమే..
ట్రాయ్ తెలిపిన ప్రకారం 1600 సిరీస్ నంబర్లను ప్రత్యేకంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగానికి కేటాయించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), సెబీ, ఐఆర్డీఏఐ, పీఎఫ్‌ఆర్‌డీఏ వంటి నియంత్రణ సంస్థల పరిధిలో ఉండే సంస్థలు ఈ నంబర్లను ఉపయోగిస్తాయి. అలాగే ప్రభుత్వం నుంచి పౌరులకు పంపే కీలక సమాచారానికి కూడా 1600 సిరీస్ నంబర్లను వినియోగిస్తారు. అందువల్ల భారత్‌లో పనిచేసే ఏ ప్లాట్‌ఫామ్ అయినా 1600 సిరీస్ నంబర్లను బ్లాక్ చేయడానికి అనుమతి లేదు. అలాగే ఈ నంబర్లను స్పామ్‌గా ట్యాగ్ చేయడం లేదా కాల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ల ద్వారా ఫిల్టర్ చేయడం కూడా టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్ (టీసీసీసీపీఆర్) ప్రకారం నిషేధించారు. ఈ నంబర్ల ద్వారా వచ్చే బ్యాంకింగ్ లేదా ప్రభుత్వ సమాచారాన్ని యాప్‌లు స్వతంత్రంగా స్పామ్‌గా గుర్తించి వినియోగదారులకు దూరం చేయకూడదు. ఎంతమంది వినియోగదారులు స్పామ్‌గా రిపోర్ట్ చేసినా ఈ నిబంధన వర్తిస్తుంది.
ప్రచార కాల్స్ కోసం 140 సిరీస్..
140తో ప్రారంభమయ్యే నంబర్లను ప్రధానంగా టెలీమార్కెటింగ్, ప్రచార కాల్స్ కోసం కేటాయించారు. ఏ రంగానికి చెందిన సంస్థ అయినా ప్రమోషనల్ కాల్స్ చేయాలంటే టీసీసీసీపీఆర్ నిబంధనల ప్రకారం టెలికాం సర్వీస్ ప్రొవైడర్ వద్ద నమోదు చేసుకుని 140 సిరీస్ నంబర్ పొందాల్సి ఉంటుంది. అయితే 1600 సిరీస్‌తో పోలిస్తే 140 సిరీస్‌కు ఒక ప్రత్యేక వెసులుబాటు ఉంది. వినియోగదారులు డూ నాట్ డిస్టర్బ్ (డీఎన్‌డీ) రిజిస్ట్రీలో తమ అభిరుచిని నమోదు చేసుకుంటే మాత్రమే ఈ నంబర్ల నుంచి వచ్చే ప్రమోషనల్ కాల్స్‌ను బ్లాక్ చేయవచ్చు. డీఎన్‌డీలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రంగాల నుంచి ప్రమోషనల్ కాల్స్ వద్దని ఎంపిక చేసుకున్న వినియోగదారులకు, ఆ రంగాలకు చెందిన 140 సిరీస్ నంబర్ల నుంచి కాల్స్ రావు. ఈ ప్రాధాన్యతను ట్రాయ్ అధికారిక డీఎన్‌డీ యాప్‌తోపాటు ఇతర మార్గాల ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు.

డీఎన్‌డీ ద్వారా అయితే..
డీఎన్‌డీ ద్వారా 140 సిరీస్ కాల్స్‌ను బ్లాక్ చేసే అవకాశం ఉన్నప్పటికీ, ట్రూకాలర్ వంటి యాప్‌లు వాటిని స్వతంత్రంగా స్పామ్‌గా ట్యాగ్ చేయడం లేదా ఫిల్టర్ చేయడం మాత్రం అనుమతించరు. ఇదే నిబంధన 1600 సిరీస్ నంబర్లకు కూడా వర్తిస్తుంది. ఇలా అనుమతిస్తే తప్పు లేదా అసంగతమైన స్పామ్ ట్యాగ్‌లు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒక వినియోగదారు డీఎన్‌డీలో ఎలాంటి బ్లాకింగ్ ఎంపిక చేయకపోయినా, థర్డ్ పార్టీ యాప్ ఆ కాల్‌ను స్పామ్‌గా చూపిస్తే అది తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుందని ట్రాయ్ తెలిపింది. అంటే ఒక కాల్‌ను అవాంఛిత కాల్‌గా పరిగణించాలా లేదా అన్నది ప్రతి వినియోగదారు డీఎన్‌డీలో ఎంచుకున్న ప్రాధాన్యతలపై ఆధారపడాలి కానీ, కాలర్ ఐడీ యాప్‌ల కమ్యూనిటీ రిపోర్ట్‌లు లేదా స్పామ్ అల్గారిథమ్‌లపై ఆధారపడకూడదని ట్రాయ్ స్పష్టం చేసింది.
వద్దనుకుంటే బ్లాక్ చేయవచ్చు..
140 లేదా 1600 సిరీస్ నంబర్ల నుంచి వచ్చే కాల్స్ ట్రూకాలర్ వంటి యాప్‌లలో స్పామ్ హెచ్చరిక లేకుండా కనిపిస్తే, అది యాప్ పరిమితి కాదు. ట్రాయ్ నిబంధనల ప్రకారమే అలా జరుగుతోందని వినియోగదారులు భావించాలి. 140 సిరీస్ ప్రమోషనల్ కాల్స్ వద్దనుకుంటే డూ నాట్ డిస్టర్బ్ (డీఎన్‌డీ) రిజిస్ట్రీలో నమోదు చేసుకోవడమే ప్రస్తుతం అధికారిక మార్గం. కాలర్ ఐడీ యాప్‌లపై ఆధారపడటం ద్వారా వాటిని బ్లాక్ చేయడం సాధ్యం కాదు. అయితే 1600 సిరీస్ నంబర్ల విషయంలో ప్రస్తుతం ఎలాంటి ఆప్ట్-అవుట్ అవకాశం లేదు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, ప్రభుత్వ కమ్యూనికేషన్‌కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని అందించేందుకు ఈ నంబర్లను ఉపయోగిస్తున్నందున వాటిని బ్లాక్ చేయడానికి ట్రాయ్ అనుమతి ఇవ్వడం లేదు.
ట్రాయ్‌కు అనుమతులు ఇస్తారా..
లక్షలాది మంది వినియోగదారులు స్పామ్‌గా రిపోర్ట్ చేస్తున్న కాల్స్‌ను పట్టించుకోకుండా ఉండటం వల్ల కాలర్ ఐడీ యాప్‌ల అసలు ఉద్దేశమే దెబ్బతింటుందని ట్రూకాలర్ వంటి సంస్థలు వాదిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ట్రాయ్ వైఖరి మాత్రం స్పష్టంగా ఉంది. 140, 1600 సిరీస్ నంబర్లు యాప్ స్థాయి స్పామ్ ఫిల్టరింగ్‌కు అతీతంగానే కొనసాగుతాయని తెలిపింది. అయితే కొన్ని సంస్థలు, బ్యాంకులు 1600 సిరీస్‌ను దుర్వినియోగం చేస్తున్నాయని, ఆ నంబర్లతో వినియోగదారులకు టెలి మార్కెటింగ్ కాల్స్ చేస్తున్నాయని, అందుకనే ఆ నంబర్ల నుంచి వచ్చే కాల్స్ ను వినియోగదారులు చాలా వరకు సొంతంగా బ్లాక్ చేస్తున్నారని, కొందరు ఆ కాల్స్‌ను లిఫ్ట్ చేయడం లేదని ట్రూ కాలర్ తెలిపింది. అయితే ట్రూ కాలర్ వంటి యాప్‌లపై ట్రాయ్‌కు కేంద్రం నియంత్రణ కల్పిస్తే అలాంటి యాప్‌లను వాడడం వృథాయేనని టెక్ నిపుణులు చెబుతున్నారు.
సంబంధిత వార్తలు

RBI | ఆర్బీఐ కొరడా.. ఆరు బ్యాంకులకు భారీ జరిమానాలు..
జులై 24, 2026

Truecaller | ట్రూకాలర్ ట్యాగ్‌లపై ట్రాయ్ అభ్యంతరం.. అపోహలు కలిగించే అవకాశం ఉందని వ్యాఖ్య
జులై 19, 2026

NPS | ఎన్పీఎస్ పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. పీఎఫ్‌ఆర్‌డీఏ కొత్త టూల్.. కార్పస్ ఎంత అవుతుందో ఈజీగా లెక్కించవచ్చు..
జులై 16, 2026
తాజావార్తలు
- ●WhatsApp | వాట్సాప్ అప్డేట్.. ఐప్యాడ్ రిజిస్ట్రేషన్ నుంచి మ్యూజిక్ స్టేటస్ వరకు కొత్త ఫీచర్లు..
- ●BC Study Circle | పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్నారా?.. ఉచిత కోచింగ్, ప్రతి నెల స్టైపెండ్ కూడా.. ఎక్కడంటే?
- ●Sangareddy | పదేపదే ఫోన్ చేస్తున్నాడని.. భర్త నంబర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టిన భార్య.. అవమానంతో..
- ●SSCTU | సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో యూజీ కోర్సుల్లో ప్రవేశాలు
- ●Health Insurance | పోలియో గురించి చెప్పలేదని.. ముఖ్యమంత్రి మామను ముప్పుతిప్పలు పెట్టిన బీమా సంస్థ
- ●Revanth Reddy | ట్రాఫిక్ నిర్వహణ, పర్యవేక్షణకు ప్రత్యేక బ్యూరో.. విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిరోధానికి కమిటీలు: సీఎం రేవంత్ రెడ్డి

WhatsApp | వాట్సాప్ అప్డేట్.. ఐప్యాడ్ రిజిస్ట్రేషన్ నుంచి మ్యూజిక్ స్టేటస్ వరకు కొత్త ఫీచర్లు..

BC Study Circle | పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్నారా?.. ఉచిత కోచింగ్, ప్రతి నెల స్టైపెండ్ కూడా.. ఎక్కడంటే?

Sangareddy | పదేపదే ఫోన్ చేస్తున్నాడని.. భర్త నంబర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టిన భార్య.. అవమానంతో..

SSCTU | సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో యూజీ కోర్సుల్లో ప్రవేశాలు



