SEBI | ఐపీఓ జీఎంపీ ప్రచారానికి సెబీ బ్రేకులు.. మధ్యవర్తులకు కీలక ఆదేశాలు..
SEBI | ఐపీఓలకు దరఖాస్తు చేసే ముందు గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) ఆధారంగా లిస్టింగ్ లాభాలను అంచనా వేస్తున్న ఇన్వెస్టర్లకు సెబీ కీలక సూచనలు చేసింది. ధ్రువీకరణ లేని జీఎంపీ వివరాలు ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించే ప్రమాదం ఉంటుందని పేర్కొంటూ, రిజిస్టర్డ్ మధ్యవర్తులు, మార్కెట్ సంస్థలు వాటిని ప్రచురించడం, ప్రసారం చేయడం నిలిపివేయాలని ఆదేశించింది.
SEBI | ఐపీఓలకు దరఖాస్తు చేసే ముందు గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) ఆధారంగా లిస్టింగ్ లాభాలను అంచనా వేస్తున్న ఇన్వెస్టర్లకు సెబీ కీలక సూచనలు చేసింది. ధ్రువీకరణ లేని జీఎంపీ వివరాలు ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించే ప్రమాదం ఉంటుందని పేర్కొంటూ, రిజిస్టర్డ్ మధ్యవర్తులు, మార్కెట్ సంస్థలు వాటిని ప్రచురించడం, ప్రసారం చేయడం నిలిపివేయాలని ఆదేశించింది.
జీఎంపీని వెల్లడించడంపై నిషేధం..
ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) వివరాల ప్రచారంపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌లకు (ఐపీఓ) సంబంధించి అనధికారికంగా ప్రచారంలో ఉండే జీఎంపీ గణాంకాలను ప్రచురించవద్దని, ప్రదర్శించవద్దని, ప్రసారం చేయవద్దని రిజిస్టర్డ్ మధ్యవర్తులు, ఇతర మార్కెట్ భాగస్వాములకు సూచించింది. వెబ్‌సైట్లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, వార్తాపత్రికలు, ఈ-మెయిల్స్, ఎస్ఎంఎస్‌లు, సోషల్ మీడియా వంటి ఏ మాధ్యమంలోనూ వీటిని ప్రచారం చేయకూడదని స్పష్టం చేసింది. గ్రే మార్కెట్‌లో అధికారిక స్టాక్ మార్కెట్ పరిధికి వెలుపల జరిగే లావాదేవీల ఆధారంగా ఈ ప్రీమియంలను అంచనా వేస్తారని, వాటికి సెబీ ధ్రువీకరణ లేదా నియంత్రణ ఉండదని తెలిపింది. అలాగే ఈ లావాదేవీలకు సెటిల్‌మెంట్ హామీ ఉండదని, ఇన్వెస్టర్లకు ఎలాంటి నియంత్రణపరమైన రక్షణ లభించదని హెచ్చరించింది. అధికారిక ధరల నిర్ధారణ విధానం కూడా లేకపోవడంతో జీఎంపీ ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం ప్రమాదకరమని పేర్కొంది.
గ్రే మార్కెట్ ప్రీమియం ఆశతో ఐపీఓకు..
ఈ నిర్ణయంపై ఎంసీక్యూబ్ భాగస్వామి వి. షణ్ముగం స్పందిస్తూ.. చాలామంది ఇన్వెస్టర్లు కంపెనీలో పెట్టుబడి పెట్టాలనే ఉద్దేశంతో కాకుండా గ్రే మార్కెట్ ప్రీమియం ద్వారా తక్షణ లాభాలు పొందాలనే ఆశతో ఐపీఓలకు దరఖాస్తు చేస్తున్నారని తెలిపారు. సెబీ తాజా సూచనలతో కంపెనీ ప్రాస్పెక్టస్, వ్యాపార పనితీరు, విలువలు, సంస్థాగత పెట్టుబడిదారుల డిమాండ్ వంటి ప్రాథమిక అంశాలకు ప్రాధాన్యం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. జీఎంపీ 100 శాతానికి పైగా ఉందన్న అంచనాతో రూ.70 ఐపీఓ షేరు ధర రూ.150 వరకు చేరుతుందని భావించిన సందర్భాన్ని ఆయన ఉదహరించారు. అయితే 2026 మార్చిలో ఆ షేరు ధర సుమారు రూ.80 వద్ద ట్రేడవుతుండడం జీఎంపీ అంచనాల పరిమితులను తెలియజేస్తోందన్నారు. మరో ఉదాహరణగా హ్యుందాయ్ మోటార్ ఇండియా లిస్టింగ్‌ను ప్రస్తావించారు. రూ.1,960 ఇష్యూ ధరతో వచ్చిన ఈ షేరు రూ.1,934 వద్ద లిస్ట్ అయినప్పటికీ, ఆ తర్వాత రూ.2,890 స్థాయికి చేరిందని, ఇది దీర్ఘకాలిక పనితీరును జీఎంపీతో అంచనా వేయలేమని సూచిస్తోందని వివరించారు.
సెబీ ఏం చెబుతోంది..?
గ్రే మార్కెట్ లావాదేవీలు ప్రైవేటు మార్గాల్లో కొనసాగినా, వాటిలో పాల్గొనే ఇన్వెస్టర్లకు సెబీ లేదా స్టాక్ ఎక్స్ఛేంజీల పరిధిలో రక్షణ ఉండదని రెగ్యులేటర్ హెచ్చరించింది. ఎక్స్ఛేంజీల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థతోపాటు ఆన్‌లైన్ డిస్ప్యూట్ రిజల్యూషన్ పోర్టల్ ద్వారా కూడా వారికి న్యాయం పొందే అవకాశం ఉండదని స్పష్టం చేసింది. కాగా, కేటాయింపు తర్వాత, లిస్టింగ్‌కు ముందు నియంత్రిత ట్రేడింగ్ విండో ఏర్పాటు చేసే అంశంపై చర్చకు ఈ పరిణామం దారితీస్తుందని షణ్ముగం అభిప్రాయపడ్డారు. సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే 2025 ఆగస్టులో ఇలాంటి విధానం సాధ్యాసాధ్యాలను ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇకపై ఇన్వెస్టర్లు సెబీ వద్ద రిజిస్టర్ అయిన మధ్యవర్తులు, అధికారిక ప్లాట్‌ఫామ్‌ల ద్వారానే ఐపీఓలకు దరఖాస్తు చేయాలని సెబీ సూచించింది.
సంబంధిత వార్తలు

Anthropic IPO | ఆంథ్రోపిక్ షేర్లలో భారీ పతనం.. ఇప్పుడు కొనొచ్చా?
నవంబర్ 23, 2026

PG Electroplast | ఈ పెన్నీ స్టాక్ లో రూ.1 లక్ష పెట్టి ఉంటే ఇప్పుడు రూ1.18 కోట్లు వచ్చి ఉండేవి.. 7 ఏళ్లలో 118 శాతం లాభం..
నవంబర్ 19, 2026

Rediff | మళ్లీ భారత మార్కెట్లోకి రెడిఫ్.. రూ.600 కోట్ల ఐపీఓకు సిద్ధం..
నవంబర్ 18, 2026
తాజావార్తలు
- ●Madras High Court | మహిళా కలెక్టర్‌కు ఎమ్మెల్యే అసభ్యకర మెసేజ్‌లు.. విజయ్ ప్రభుత్వంపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం
- ●Vijay Antony | అమీర్‌పేట వీధుల్లో హీరో విజయ్ ఆంటోనీ సందడి.. హోటల్లో చాయ్ తాగుతూ స్థానికులతో ముచ్చట్లు
- ●Indiramma Towers | ఉచితంగా రిజిస్ట్రేషన్.. ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్
- ●Road Accident | దైవ దర్శనానికి వెళ్లొస్తూ తిరిగిరాని లోకాలకు.. హైదరాబాద్‌కు చెందిన దంపతులు ఎలా చనిపోయారంటే!
- ●Sonia Gandhi | ఆత్మకథలో సావర్కర్‌పై వ్యాఖ్యలు.. సోనియా గాంధీకి లీగల్ నోటీసులు
- ●Nvidia | ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం.. జెన్సన్ పునరాగమనంపై ఉదయ్ కోటక్ కీలక వ్యాఖ్యలు..

Madras High Court | మహిళా కలెక్టర్‌కు ఎమ్మెల్యే అసభ్యకర మెసేజ్‌లు.. విజయ్ ప్రభుత్వంపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం

Vijay Antony | అమీర్‌పేట వీధుల్లో హీరో విజయ్ ఆంటోనీ సందడి.. హోటల్లో చాయ్ తాగుతూ స్థానికులతో ముచ్చట్లు

Indiramma Towers | ఉచితంగా రిజిస్ట్రేషన్.. ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్

Road Accident | దైవ దర్శనానికి వెళ్లొస్తూ తిరిగిరాని లోకాలకు.. హైదరాబాద్‌కు చెందిన దంపతులు ఎలా చనిపోయారంటే!



