TRAI MySpeed App | ట్రాయ్ మై స్పీడ్ యాప్ అప్‌డేట్.. మీ ఇంటర్నెట్ అసలు స్పీడ్ ను ఇప్పుడు ఇలా చెక్ చేయవచ్చు..
TRAI MySpeed App | భారత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తాజాగా ట్రాయ్ మై స్పీడ్ (TRAI MySpeed) యాప్‌ను కొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేసింది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్ నుంచే మొబైల్ బ్రాడ్‌బ్యాండ్, బ్రాడ్‌బ్యాండ్, వైఫై కనెక్షన్‌ల వాస్తవ పనితీరును సులభంగా పరీక్షించుకోవచ్చు.
Technology | Published On Jul 9, 2026, 5.17 pm IST
TRAI MySpeed App | భారత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తాజాగా ట్రాయ్ మై స్పీడ్ (TRAI MySpeed) యాప్‌ను కొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేసింది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్ నుంచే మొబైల్ బ్రాడ్‌బ్యాండ్, బ్రాడ్‌బ్యాండ్, వైఫై కనెక్షన్‌ల వాస్తవ పనితీరును సులభంగా పరీక్షించుకోవచ్చు. ప్రపంచంలో రెండో అతిపెద్ద టెలికాం మార్కెట్‌గా ఉన్న భారత్‌లో ప్రస్తుతం 100 కోట్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు పని, విద్య, డిజిటల్ చెల్లింపులు, వినోదం, కమ్యూనికేషన్ వంటి అవసరాల కోసం ఇంటర్నెట్‌పై ఆధారపడుతున్నారు. అయితే నెట్‌వర్క్ సిగ్నల్ పూర్తిగా కనిపించినప్పటికీ వీడియో బఫరింగ్, వీడియో కాల్స్ మధ్యలో నిలిచిపోవడం, డౌన్‌లోడ్‌లు నెమ్మదిగా జరగడం, వెబ్‌పేజీలు ఆలస్యంగా లోడ్ కావడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.
సిగ్నల్ బార్స్ ఉన్నంత మాత్రాన నెట్ స్పీడ్ రాదు..
ట్రాయ్ తెలిపిన ప్రకారం, ఫోన్‌లో కనిపించే సిగ్నల్ బార్‌లు మాత్రమే ఇంటర్నెట్ నాణ్యతను పూర్తిగా తెలియజేయవు. వినియోగదారు ఉన్న ప్రాంతం, నెట్‌వర్క్ రద్దీ, డివైస్ పరిస్థితి, ఉపయోగించే సమయం వంటి అనేక అంశాలపై వాస్తవ ఇంటర్నెట్ పనితీరు ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో ట్రాయ్ మై స్పీడ్ యాప్ నిజ జీవితంలో లభించే కనెక్టివిటీ పనితీరును కొలిచి, వినియోగదారులకు వారి నెట్‌వర్క్ నాణ్యతపై స్పష్టమైన అవగాహన కల్పిస్తుంది. ఈ యాప్ ద్వారా కేవలం సిగ్నల్ బలం మాత్రమే కాకుండా వాస్తవ ఇంటర్నెట్ స్పీడ్‌ను పరీక్షించవచ్చు. టెలికాం సంస్థలు ప్రకటించే స్పీడ్‌తో పోలిస్తే వినియోగదారులకు నిజంగా ఎంత వేగం అందుతోందో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. యాప్‌లో డౌన్‌లోడ్ స్పీడ్, అప్‌లోడ్ స్పీడ్, లేటెన్సీ, జిట్టర్, వీడియో స్ట్రీమింగ్ పనితీరు, వెబ్ బ్రౌజింగ్ అనుభవం వంటి కీలక అంశాలను కొలుస్తుంది. వీటి ద్వారా నెట్‌వర్క్ వేగం, స్థిరత్వం, మొత్తం కనెక్టివిటీ నాణ్యతపై సమగ్ర సమాచారం లభిస్తుంది.
పలు రకాల టెస్టింగ్ ఆప్షన్‌లు..
ట్రాయ్ మై స్పీడ్ యాప్‌లో పలు రకాల టెస్టింగ్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. స్పీడ్ టెస్ట్ ద్వారా డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్‌తోపాటు ఇతర నెట్‌వర్క్ వివరాలను తెలుసుకోవచ్చు. వీడియో అండ్ బ్రౌజర్ టెస్ట్ ద్వారా వీడియో స్ట్రీమింగ్ నాణ్యత, వెబ్ బ్రౌజింగ్ పనితీరును వాస్తవ వినియోగ పరిస్థితుల్లో పరీక్షిస్తుంది. అడ్వాన్స్‌డ్ టెస్ట్ ద్వారా ప్రయాణంలో ఉన్నప్పుడు నిరంతర టెస్టింగ్ చేయడం, నిర్ణీత సమయ వ్యవధుల్లో పరీక్షలు నిర్వహించడం ద్వారా నెట్‌వర్క్ స్థిరత్వాన్ని విశ్లేషించవచ్చు. ఈ యాప్ గతంలో చేసిన అన్ని టెస్ట్ ఫలితాలను కూడా భద్రపరుస్తుంది. దీంతో వినియోగదారులు పాత ఫలితాలను పరిశీలించి, కాలక్రమంలో తమ నెట్‌వర్క్ పనితీరులో వచ్చిన మార్పులను పోల్చుకోవచ్చు. అలాగే వివిధ ప్రాంతాల్లో సిగ్నల్ బలం, పనితీరును నమోదు చేసి, కనెక్టివిటీ లోపాలు, కవరేజ్ సమస్యలు, నెట్‌వర్క్ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించడంలో సహాయపడుతుంది.
వ్యక్తిగత వివరాలకు గోప్యత..
వినియోగదారులు ఈ యాప్ ద్వారా నిర్వహించే ప్రతి పరీక్ష కూడా దేశవ్యాప్తంగా వాస్తవ నెట్‌వర్క్ పనితీరుకు సంబంధించిన డేటాలో భాగమవుతుంది. వినియోగదారుల అనుమతితో వ్యక్తిగత వివరాలు వెల్లడికాకుండా అనామక రూపంలో పరీక్ష వివరాలను ట్రాయ్ సేకరిస్తుంది. ఈ సమాచారం నెట్‌వర్క్ నాణ్యత, సేవల పనితీరు, కవరేజ్ సమస్యలు, కనెక్టివిటీ సవాళ్లను విశ్లేషించేందుకు ఉపయోగపడుతుంది. టెలికాం సేవల సంస్థలు తమ నెట్‌వర్క్ సామర్థ్యం, కవరేజ్ మెరుగుపర్చాల్సిన ప్రాంతాలను గుర్తించేందుకు కూడా ఈ డేటా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ యాప్ వినియోగదారుల వ్యక్తిగత ఫైళ్లు, సందేశాలు లేదా కాల్‌లను యాక్సెస్ చేయదని ట్రాయ్ స్పష్టం చేసింది. పరీక్షల ద్వారా సేకరించే సమాచారం పూర్తిగా అనామక రూపంలో ఉండి, కేవలం నియంత్రణ, విశ్లేషణ అవసరాల కోసం మాత్రమే ఉపయోగిస్తారు.
ఎలా వాడాలి..
ఇంటర్నెట్ ప్లాన్‌లో ప్రకటించిన స్పీడ్ ఎల్లప్పుడూ వినియోగదారులకు వాస్తవంగా అందుతుందని చెప్పలేమని ట్రాయ్ పేర్కొంది. ప్రాంతం, నెట్‌వర్క్ లోడ్, వినియోగ పరిస్థితులు వంటి కారణాల వల్ల వాస్తవ స్పీడ్ మారుతుంది. ట్రాయ్ మై స్పీడ్ యాప్ ద్వారా ఈ పనితీరును పరీక్షించడం వల్ల తమ ఇంటర్నెట్ అనుభవం ఎలా ఉందో వినియోగదారులు సులభంగా తెలుసుకోవచ్చు. ట్రాయ్ మై స్పీడ్ యాప్‌ను ఉపయోగించాలంటే ముందుగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసి అవసరమైన అనుమతులు ఇవ్వాలి. అనంతరం స్పీడ్ టెస్ట్, వీడియో అండ్ బ్రౌజర్ టెస్ట్ లేదా అడ్వాన్స్‌డ్ టెస్ట్‌లలో ఒకదాన్ని ఎంచుకోవాలి. మొబైల్ డేటా, బ్రాడ్‌బ్యాండ్ లేదా వైఫై కనెక్షన్ యాక్టివ్‌గా ఉన్నట్లు నిర్ధారించుకుని స్టార్ట్ టెస్ట్ పై ట్యాప్ చేయాలి. పరీక్ష పూర్తయ్యాక నెట్‌వర్క్ పనితీరుకు సంబంధించిన పూర్తి వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ట్రాయ్ మై స్పీడ్ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. దీనిని గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తాజావార్తలు
- ●Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక
- ●Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!
- ●Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ●Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి
- ●Damodar Rajanarasimha | ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: మంత్రి రాజనర్సింహ
- ●TTA Convention USA | అమెరికాలో టీటీఏ మహాసభల సందడి: తెలంగాణ అధికారులకు షార్లెట్‌లో ఆత్మీయ స్వాగతం

Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక

Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!

Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి






