త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

iPhone 17 | ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. అమెజాన్‌లో కొత్త ధరలు ఇవే..

iPhone 17 | యాపిల్ ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్ ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది. ఐఫోన్ 17, ఐఫోన్ 17ఈ, ఐఫోన్ 16 మోడళ్లపై ధరలు తగ్గించింది. బ్యాంక్ కార్డు ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లతో మరింత తక్కువ ధరకు ఫోన్లను సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

S

Business | Published On Nov 27, 2026, 5.47 pm IST

iPhone 17 | ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. అమెజాన్‌లో కొత్త ధరలు ఇవే..
Advertisement

iPhone 17 | యాపిల్ ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్ ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది. ఐఫోన్ 17, ఐఫోన్ 17ఈ, ఐఫోన్ 16 మోడళ్లపై ధరలు తగ్గించింది. బ్యాంక్ కార్డు ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లతో మరింత తక్కువ ధరకు ఫోన్లను సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

ఐఫోన్ 17 ఫోన్‌పై ఎంత త‌గ్గింపు అంటే..?

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ యాపిల్‌కు చెందిన మూడు ఐఫోన్ మోడళ్లపై అమెజాన్ భారీ ధర తగ్గింపులను ప్రకటించింది. ఐఫోన్ 17 (256 జీబీ) అసలు ధర రూ.99,999 కాగా, ప్రస్తుతం రూ.93,990కి అందుబాటులో ఉంది. అంటే రూ.6,009 తగ్గింపు లభిస్తోంది. అదనంగా అర్హత కలిగిన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఈఎంఐ లావాదేవీలు జరిపితే గరిష్ఠంగా రూ.3వేల‌ వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. దీంతో ఈ ఫోన్ ధర రూ.90,990కు తగ్గే అవకాశం ఉంటుంది. ఇందులో ఎ19 చిప్‌సెట్, 6.3 ఇంచుల ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 120 హెడ్జ్‌ ప్రోమోషన్ రిఫ్రెష్ రేట్, 48 మెగాపిక్స‌ల్ డ్యుయల్ ఫ్యూజన్ బ్యాక్ కెమెరా, 18 మెగాపిక్స‌ల్ సెంటర్ స్టేజ్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

ఐఫోన్ 17ఈ, ఐఫోన్ 16 త‌గ్గింపు వివ‌రాలు..

ఐఫోన్ 17ఈ (256 జీబీ) అసలు ధర రూ.79,900 కాగా, అమెజాన్‌లో రూ.74,990కు విక్రయిస్తున్నారు. తద్వారా రూ.4,910 తగ్గింపు లభిస్తోంది. అర్హత కలిగిన పీఎన్‌బీ లక్సురా క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 7 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్, గరిష్ఠంగా రూ.750 వరకు అదనపు ప్రయోజనం పొందవచ్చు. దీంతో ధర రూ.74,240కు తగ్గుతుంది. ఈ ఫోన్‌లో ఎ19 ప్రాసెసర్, 6.1 ఇంచుల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 256 జీబీ స్టోరేజ్, 48 మెగాపిక్స‌ల్ ఫ్యూజన్ కెమెరా, 12 మెగాపిక్స‌ల్ ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. యాపిల్ ఇంటెలిజెన్స్ సదుపాయాన్ని కూడా అందిస్తోంది. ఇక ఐఫోన్ 16 (128 జీబీ) అసలు ధర రూ.89,900 కాగా, ప్రస్తుతం రూ.76,990కు లభిస్తోంది. ఈ మోడల్‌పై ఏకంగా రూ.12,910 ధర తగ్గింపు ఉంది. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో చెల్లించే ప్రైమ్ సభ్యులకు నిబంధనలకు అనుగుణంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇందులో ఎ18 చిప్‌సెట్, 6.1 ఇంచుల ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 48 మెగాపిక్స‌ల్ ఫ్యూజన్ ప్రధాన కెమెరా, 12 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ కెమెరా, డైనమిక్ ఐలాండ్, కెమెరా కంట్రోల్, యాపిల్ ఇంటెలిజెన్స్ సదుపాయాలు ఉన్నాయి.

ఏది బెస్ట్ ఆఫ‌ర్‌..

ధర, ఫీచర్ల పరంగా చూస్తే ఐఫోన్ 17లో అత్యాధునిక ఎ19 చిప్‌సెట్, 120 హెడ్జ్ డిస్‌ప్లే, డ్యుయల్ కెమెరా వ్యవస్థ కావాలనుకునే వారికి మంచి ఎంపికగా ఉంటుంది. తక్కువ ధరలో ఎ19 ప్రాసెసర్, 256 జీబీ స్టోరేజ్ కోరుకునేవారు ఐఫోన్ 17ఈని పరిశీలించవచ్చు. ఇక అత్యధిక ధర తగ్గింపు, డ్యుయల్ కెమెరా సదుపాయం కోరుకునేవారికి ఐఫోన్ 16 ఉపయోగకరమైన ఎంపికగా నిలుస్తుంది. అయితే అమెజాన్‌లో ధరలు, బ్యాంక్ ఆఫర్లు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉంది. క్రెడిట్ కార్డు ఆఫర్లు కూడా అర్హత, నిబంధనలకు లోబడి ఉంటాయి. కొనుగోలు చేసే ముందు సంబంధిత ఉత్పత్తి వివరాలను పరిశీలించడం మంచిది.

Advertisement
Advertisement