త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

iPhone 16 | అదిరిపోయే దీపావ‌ళి గిఫ్ట్.. ఉద్యోగుల‌ను ఐఫోన్లతో స‌ర్‌ప్రైజ్ చేసిన‌ సంస్థ‌

iPhone 16 | న్యూఢిల్లీలోని రోహిణి (Rohini) కేంద్రంగా కార్య‌క‌లాపాలు సాగించే ‘ఫైనాన్సర్‌సాబ్‌’ (FinancerSaab) అనే సంస్థ (Delhi Company) దీపావ‌ళి కానుక‌గా ఉద్యోగుల‌కు ఐఫోన్ 16 (iPhone 16) స్మార్ట్‌ఫోన్‌లను బహుమతిగా అందించింది.

D

National | Published On Nov 4, 2026, 12.22 pm IST

iPhone 16 | అదిరిపోయే దీపావ‌ళి గిఫ్ట్.. ఉద్యోగుల‌ను ఐఫోన్లతో స‌ర్‌ప్రైజ్ చేసిన‌ సంస్థ‌
Advertisement

iPhone 16 | త్రినేత్ర న్యూస్ : దివాళీ (Diwali) వ‌చ్చిందంటే చాలు కంపెనీల‌న్నీ క‌ళ‌క‌ళ‌లాడుతుంటాయి. ముఖ్యంగా బోన‌స్‌లు, సంస్థ ఇచ్చే ప్ర‌త్యేక గిఫ్ట్స్ కోసం ఉద్యోగులు ఎంతో ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తుంటారు. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ సంస్థ త‌న ఉద్యోగుల‌కు ఊహించిన గిఫ్ట్స్ ఇచ్చి స‌ర్‌ప్రైజ్ చేసింది. ఉద్యోగులంద‌రికీ ఎంతో ఖ‌రీదైన ఐఫోన్‌ల‌ను దివాళీ గిఫ్ట్‌గా ఇచ్చి వారి ముఖంలో వెలుగులు నింపింది.

న్యూఢిల్లీలోని రోహిణి (Rohini) కేంద్రంగా కార్య‌క‌లాపాలు సాగించే ‘ఫైనాన్సర్‌సాబ్‌’ (FinancerSaab) అనే సంస్థ (Delhi Company) దీపావ‌ళి కానుక‌గా ఉద్యోగుల‌కు ఐఫోన్ 16 (iPhone 16) స్మార్ట్‌ఫోన్‌లను బహుమతిగా అందించింది. ఉద్యోగులు ఆఫీస్‌కు రాక‌ముందే వారి డెస్క్‌ల‌పై రిబ్బన్‌లతో ప్ర‌త్యేకంగా అలంక‌రించిన ఐఫోన్ 16 హ్యాండ్‌సెట్‌ల‌ను ఉంచింది. ఆఫీస్‌కు రాగానే తమ డెస్క్‌లపై ఉన్న ఐఫోన్లు చూసి ఉద్యోగులు ఉప్పొంగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోని స‌ద‌రు సంస్థ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా షేర్ చేసింది. నో కాంపిటీష‌న్‌.. మ‌రి మీకేం గిఫ్ట్ అందింది..? అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది.

ఈ వీడియో క్ష‌ణాల్లో వైర‌ల్‌గా మారి.. నెటిజ‌న్ల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. నెటిజన్లు కంపెనీ ఉదారతను ప్రశంసిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొంద‌రు ఈ వీడియోని ఏఐగా అనుమానం వ్య‌క్తం చేయ‌గా.. సంస్థ అది ఏఐ వీడియో కాద‌ని స్ప‌ష్ట‌త‌నిచ్చింది. దీంతో చాలా మంది నెటిజ‌న్లు ఆ సంస్థ‌లో చేరాల‌నే త‌మ ఆశ‌ను వ్య‌క్త‌ప‌రిచారు. ఇంకొంద‌రైతే త‌మ‌కు క‌నీసం సోన్ పాపిడి కూడా రాలేదంటూ చ‌మ‌త్క‌రించారు. కొంద‌రు నెటిజ‌న్లు ఇలాంటి వీడియోలు చూసి బాధ‌, అసూయ ప‌డాల్సి వ‌స్తుంద‌న్న కార‌ణంతో పండ‌గ వేళ సోష‌ల్ మీడియా వాడ‌ట‌మే మానేయాల‌నిపిస్తోందంటూ జోక్ చేశారు.

Also Read..

నేను బ్యాలెట్‌లో లేను.. లేదంటే.. ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ట్రంప్ ఆస‌క్తిక‌ర పోస్ట్‌

ట్రంప్‌న‌కు మిడ్ ట‌ర్మ్‌ షాక్‌.. సెనేట్‌, ప్ర‌తినిధుల స‌భ విప‌క్షాల వ‌శం..

ట్యాగ్స్:

Delhi CompanyDiwaliDiwali GiftFinancerSaabFinancerSaab Gifted IPhone 16 Smartphones To Its EmployeesIphone 16Rohini
Advertisement
Advertisement