POCO X8 | 9000 ఎంఏహెచ్ బ్యాటరీతో పోకో కొత్త ఫోన్.. పవర్‌ఫుల్ ఫీచర్లు..
POCO X8 | షియోమీకి చెందిన సబ్‌బ్రాండ్ పోకో భారత్‌లో తన నూతన స్మార్ట్ ఫోన్‌ను పోకో ఎక్స్8 పేరిట లాంచ్ చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. రోజువారీ పనులు, ఎక్కువగా వీడియోలను వీక్షించడం, గేమింగ్ వంటి పనులకు అనువుగా ఉండేలా ఈ ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.
Technology | Published On Sep 5, 2026, 1.09 pm IST
POCO X8 | షియోమీకి చెందిన సబ్‌బ్రాండ్ పోకో భారత్‌లో తన నూతన స్మార్ట్ ఫోన్‌ను పోకో ఎక్స్8 పేరిట లాంచ్ చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. రోజువారీ పనులు, ఎక్కువగా వీడియోలను వీక్షించడం, గేమింగ్ వంటి పనులకు అనువుగా ఉండేలా ఈ ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. అలాగే అధిక రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లే, ఫ్లాగ్‌షిప్ స్థాయి ప్రొటెక్షన్, భారీ సిలికాన్ కార్బన్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలను అందించారు. ఈ ఫోన్‌లో 6.83 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇది 1.5కె రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. అందువల్ల పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది. అలాగే ఔట్ డోర్‌లో గరిష్టంగా 3500 నిట్స్ వరకు బ్రైట్ నెస్‌ను ఇస్తుంది. దీంతో సూర్యకాంతిలోనూ తెర స్పష్టంగా కనిపిస్తుంది.
భారీ బ్యాటరీ..
ఈ ఫోన్‌లో డాల్బీ అట్మోస్ ఆడియో సపోర్ట్ ఇచ్చారు. అందువల్ల ఆడియో క్వాలిటీగా ఉంటుంఇ. అలాగే డ్యుయల్ స్టీరియో స్పీకర్లు, 300 శాతం వరకు వాల్యూమ్ బూస్ట్ మోడ్ ఫీచర్లను ఇచ్చారు. ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్4 ప్రాసెసర్‌ను ఇచ్చారు. 8జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ వేరియెంట్‌లలో లాంచ్ అయింది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత షియోమీ హైపర్ ఓఎస్ 3ని ఇచ్చారు. 4 ఏళ్ల వరకు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్స్, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌కు వెనుక వైపు 50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందు వైపు 16 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. వీటికి 4కె వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది. ఇక ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ. ఇందులో 9000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని ఇచ్చారు. ఇందుకు గాను ప్రత్యేకంగా షియోమీ సర్జ్ జి1 చిప్ పనిచేస్తుంది. 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. చార్జర్ కూడా ఫోన్‌తోపాటే వస్తుంది. ఇక ఇతర డివైస్‌లను చార్జింగ్ చేసేందుకు 22.5 వాట్ల వైర్డ్ రివర్స్ చార్జింగ్ కూడా ఉంది.
ధర ఎంతంటే..
ఈ ఫోన్ డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉంది. అలాగే ఐపీ66, ఐపీ68, ఐపీ69, ఐపీ69కె డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, వైఫై 5, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సి వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. పోకో ఎక్స్8 ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.29,999గా నిర్ణయించారు. అలాగే 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.35,999గా ఉంది. ఫైరీ ఆరెంజ్, బ్లాక్, ఫ్రాస్ట్ వైట్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 11 నుంచి ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించనున్నారు. లాంచ్ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌పై రూ.2వేల కూపన్ డిస్కౌంట్ లభిస్తుంది. రూ.1వేయి బ్యాంక్ డిస్కౌంట్ లేదా ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను కూడా పొందవచ్చు. నెలకు రూ.2,250 ప్రారంభం అయ్యే నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉండనుంది.
సంబంధిత వార్తలు

POCO M8x 5G | భారీ బ్యాటరీ, డిస్ప్లేతో లాంచ్ అయిన పోకో కొత్త ఫోన్.. ఫీచర్లు అదిరాయి..
ఆగస్టు 22, 2026

POCO X8 Pro | అదిరిపోయే ఫీచర్లతో లాంచ్ అయిన పోకో ఎక్స్8 ప్రొ ఫోన్లు.. ధర ఎంతంటే..?
మార్చి 18, 2026

Poco C85x 5G | 6300ఎంఏహెచ్ బ్యాటరీ, 32ఎంపీ కెమెరాతో.. పోకో సి85ఎక్స్ 5జి స్మార్ట్ ఫోన్..
మార్చి 10, 2026
తాజావార్తలు
- ●SIP | రూ.10వేల సిప్‌తో రూ.7 కోట్లు.. ఆదిత్య బిర్లా స్కీమ్ అద్భుతం..
- ●PM Modi | మంచి వక్త కావాలంటే ఏం చేయాలి..? మోదీ ప్రశ్నకు టీచర్ సమాధానం.. నవ్వేసిన ప్రధాని..!
- ●Polytechnic Students Protest | కంటోన్మెంట్లో పాలిటెక్నిక్ విద్యార్థినుల ధర్నా.. ఫోన్‌లో మద్దతు తెలిపిన కేటీఆర్
- ●Chemical dumping Nagarjuna Sagar | నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్‌లో డేంజర్ బెల్స్: కెమికల్స్ పారబోసిందెవరు?
- ●PM Modi | పిల్లల్ని డిజిటల్ వ్యసనం నుంచి బయటపడేయాలి.. ఉపాధ్యాయులకు ప్రధాని మోదీ సూచన
- ●CM Revanth Reddy Teachers Day | వచ్చే ఎన్నికల్లో నాకు ఎన్ని మార్కులు వేయాలో మీరే డిసైడ్ చేయండి

SIP | రూ.10వేల సిప్‌తో రూ.7 కోట్లు.. ఆదిత్య బిర్లా స్కీమ్ అద్భుతం..

PM Modi | మంచి వక్త కావాలంటే ఏం చేయాలి..? మోదీ ప్రశ్నకు టీచర్ సమాధానం.. నవ్వేసిన ప్రధాని..!

Polytechnic Students Protest | కంటోన్మెంట్లో పాలిటెక్నిక్ విద్యార్థినుల ధర్నా.. ఫోన్‌లో మద్దతు తెలిపిన కేటీఆర్

Chemical dumping Nagarjuna Sagar | నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్‌లో డేంజర్ బెల్స్: కెమికల్స్ పారబోసిందెవరు?



