Telegram | టెలిగ్రామ్‌లో భారీ అప్‌డేట్.. యూజర్లకు రిచ్ టెక్స్ట్ ఎడిటర్, కమ్యూనిటీస్ సహా కొత్త ఫీచర్లు..
Telegram | టెలిగ్రామ్ తన వినియోగదారుల కోసం మరో కీలక అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్‌లో ప్రీమియం యూజర్ల కోసం రిచ్ టెక్స్ట్ ఎడిటర్, చాట్‌లను ఒకే చోట నిర్వహించేందుకు కమ్యూనిటీస్, గ్రూప్‌లలో ఎఫెమరల్ బాట్ మెసేజ్‌లు, అలాగే 350 మిలియన్లకు పైగా జీఐఎఫ్‌లతో విస్తరించిన జీఐఎఫ్ సెర్చ్ వంటి కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Technology | Published On Jul 15, 2026, 11.45 am IST
Telegram | టెలిగ్రామ్ తన వినియోగదారుల కోసం మరో కీలక అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్‌లో ప్రీమియం యూజర్ల కోసం రిచ్ టెక్స్ట్ ఎడిటర్, చాట్‌లను ఒకే చోట నిర్వహించేందుకు కమ్యూనిటీస్, గ్రూప్‌లలో ఎఫెమరల్ బాట్ మెసేజ్‌లు, అలాగే 350 మిలియన్లకు పైగా జీఐఎఫ్‌లతో విస్తరించిన జీఐఎఫ్ సెర్చ్ వంటి కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. టెలిగ్రామ్ ప్రీమియం సభ్యుల కోసం రిచ్ టెక్స్ట్ ఎడిటర్‌ను లాంచ్ చేసింది. ఇందులో హెడ్డింగ్స్, టేబుల్స్, బుల్లెట్, నంబర్డ్ లిస్టులు, కోట్స్, కోడ్ బ్లాక్స్ వంటి ఫార్మాటింగ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఫొటోలు, వీడియోలను మెసేజ్‌లో ఎక్కడైనా చేర్చే అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు మీడియాను మెసేజ్ ప్రారంభంలో లేదా చివర్లో మాత్రమే జతచేయాల్సి ఉండగా, ఇప్పుడు అవసరమైన స్థానంలోనే ఉంచవచ్చు.
ఏఐ ఆధారిత టూల్స్..
ఈ ఎడిటర్ విజువల్ ఇంటర్‌ఫేస్‌తో పనిచేస్తుంది. గరిష్టంగా 32,768 అక్షరాల వరకు మెసేజ్‌లను రూపొందించవచ్చు. కోకూన్ ఆధారిత ఏఐ టూల్స్ కూడా ఇందులో అప్‌డేట్ చేశారు. వీటి సహాయంతో టెక్స్ట్‌ను రూపొందించడం, సవరించడం సులభమవుతుంది. అదే సమయంలో యూజర్ డేటా గోప్యతకు ప్రాధాన్యం ఇస్తామని టెలిగ్రామ్ తెలిపింది. టెలిగ్రామ్ కమ్యూనిటీస్ అనే కొత్త ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఒకే అంశానికి సంబంధించిన పలు గ్రూపులు, ఛానెల్స్, బాట్‌లను ఒకే కమ్యూనిటీ కింద నిర్వహించవచ్చు. సభ్యులు కమ్యూనిటీలోని వివిధ చాట్‌లను వీక్షించి అవసరమైన వాటిలో చేరే అవకాశం ఉంటుంది. కమ్యూనిటీలోని చాట్‌లను అందరికీ కనిపించేలా లేదా కేవలం అడ్మిన్లు, ఆ చాట్ సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉండేలా హిడెన్ మోడ్‌లో ఉంచవచ్చు. యూజర్ అభిరుచికి అనుగుణంగా కమ్యూనిటీ ఒకే ఎక్స్‌పాండబుల్ ఎంట్రీగా లేదా వేర్వేరు చాట్‌లుగా చాట్ లిస్ట్‌లో కనిపిస్తుంది. సాధారణంగా సభ్యులు కొత్త చాట్‌లను జోడించవచ్చు. అయితే అవసరమైతే అడ్మిన్లు ఈ అనుమతిని పరిమితం చేయవచ్చు. అలాంటి సందర్భాల్లో అర్హత కలిగిన చాట్‌లు సూచనల రూపంలో మాత్రమే కనిపిస్తాయి.
350 మిలియన్లకు పైగా జీఐఎఫ్‌లు..
గ్రూప్‌ల కోసం టెలిగ్రామ్ ఎఫెమరల్ బాట్ మెసేజ్‌లను కూడా ప్రవేశపెట్టింది. ఇప్పుడు బాట్‌లు పంపే కొన్ని మెసేజ్‌లు వాటితో ఇంటరాక్ట్ అయిన యూజర్‌కు మాత్రమే కనిపిస్తాయి. దీంతో బాట్‌ల స్పందనల కారణంగా గ్రూప్ చాట్‌లు అనవసర సందేశాలతో నిండిపోవడం తగ్గుతుంది. ఈ ప్రైవేట్ బాట్ మెసేజ్‌లలో స్వాగత సందేశాలు, ఏఐ రూపొందించిన సారాంశాలు, కన్ఫర్మేషన్‌లు, ఎరర్ మెసేజ్‌లు, ఇంటరాక్టివ్ మెనూలు వంటి అంశాలు ఉంటాయి. ఇవి ఆటోమేటిక్‌గా లేదా ప్రత్యేక బాట్ కమాండ్‌లకు ప్రతిస్పందనగా సెండ్ అవుతాయి. ఈ కమాండ్‌లను బాట్ మెనూలో ప్రత్యేక ఐకాన్‌తో గుర్తించవచ్చు. టెలిగ్రామ్ తన జీఐఎఫ్ సెర్చ్ సేవను కూడా మరింత విస్తరించింది. ఇప్పుడు 36 భాషల్లో 350 మిలియన్లకు పైగా జీఐఎఫ్‌లను సెర్చ్ చేయవచ్చు. విస్తృతంగా షేర్ అయ్యే పబ్లిక్ జీఐఎఫ్‌లను ఓపెన్ సోర్స్ ఏఐ మోడళ్ల సహాయంతో ఆఫ్‌లైన్ ఇండెక్సింగ్ చేయడం వల్ల వేగవంతమైన ఫలితాలు లభిస్తాయని సంస్థ తెలిపింది. అలాగే సెర్చ్ ప్రక్రియలో థర్డ్ పార్టీ సేవలపై ఆధారపడకుండా యూజర్ గోప్యతను కాపాడుతామని పేర్కొంది.
ఈ కొత్త ఫీచర్లు టెలిగ్రామ్ వెర్షన్ 12.9.0 లేదా ఆ తర్వాతి వెర్షన్‌లలో అన్ని సపోర్ట్ చేసే ప్లాట్‌ఫామ్‌లకు దశలవారీగా విడుదల అవుతున్నాయి. ఇందులో రిచ్ టెక్స్ట్ ఎడిటర్ ప్రస్తుతం టెలిగ్రామ్ ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా, మిగతా ఫీచర్లు క్రమంగా అందరు వినియోగదారులకు లభిస్తున్నాయి.
తాజావార్తలు
- ●Indian Seafarers | పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. భారతీయ నావికుల భద్రతకు కేంద్రం కీలక నిర్ణయం
- ●CCI | సీసీఐని పునఃప్రారంభించండి.. కేంద్ర మంత్రిని కోరనున్న బీఆర్ఎస్
- ●Bonalu 2026 | తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా ఆషాఢ బోనాలు.. రేపే తొలిబోనం
- ●CM Revanth Reddy | నైపుణ్యమే.. మీ భవిష్యత్తుకు మార్గం : సీఎం రేవంత్ రెడ్డి
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న తీవ్ర అస్థిరత.. పెట్టుబడిదారులకు అలర్ట్..
- ●Mudragada Padmanabham | అధికార లాంఛనాలతో ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు

Indian Seafarers | పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. భారతీయ నావికుల భద్రతకు కేంద్రం కీలక నిర్ణయం

CCI | సీసీఐని పునఃప్రారంభించండి.. కేంద్ర మంత్రిని కోరనున్న బీఆర్ఎస్

Bonalu 2026 | తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా ఆషాఢ బోనాలు.. రేపే తొలిబోనం

CM Revanth Reddy | నైపుణ్యమే.. మీ భవిష్యత్తుకు మార్గం : సీఎం రేవంత్ రెడ్డి






