Telegram | పైరసీ కంటెంట్.. టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు
Telegram | టెలిగ్రామ్ (Telegram)కు కేంద్రం నోటీసులు జారీ చేసింది. తమ ప్లాట్‌ఫారమ్‌లో పైరేటెడ్ సినిమాలు, ఓటీటీ (OTT) కంటెంట్ విపరీతంగా సర్క్యులేట్ అవుతుండటంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
Telegram | ప్రముఖ మెసేజింగ్ యాప్ 'టెలిగ్రామ్' (Telegram) ద్వారా పెద్ద ఎత్తున పైరేటెడ్ సినిమాలు, ఓటీటీ (OTT) కంటెంట్ ఎక్కువగా షేర్ అవుతుండటంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు మెసేజింగ్ యాప్‌కు నోటీసులు జారీ చేసింది.
కాపీరైట్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఛానళ్లు, కంటెంట్‌లపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (Ministry of Information and Broadcasting) టెలిగ్రామ్‌ను ఆదేశించింది. అంతేకాదు, దీనిపై తీసుకున్న చర్యల నివేదిక ‘యాక్షన్ టేకెన్ రిపోర్ట్' (Action Taken Report)ను 15 రోజుల్లోగా సమర్పించాలని టెలిగ్రామ్‌ను ఆదేశించింది.
ఆన్‌లైన్ పైరసీ బారి నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీ, బ్రాడ్‌కాస్టర్లు, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, నిర్మాతలు, పంపిణీదారుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాపీరైట్ అనేది క్రిమినల్ నేరం కిందకు వస్తుందని ఈ సందర్భంగా నొక్కి చెప్పింది. వీలైనంత త్వరగా పైరసీ కంటెంట్‌ను తొలగించాలని టెలిగ్రామ్‌ను ఆదేశించింది. పైరసీ కంటెంట్ కొనసాగినా, నిబంధనలను పాటించకపోయినా, అసంపూర్ణమైన సమాధానం ఇచ్చినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించింది.
తాజావార్తలు
- ●Amazon Prime Day 2026 | అమెజాన్ ప్రైమ్ డేలో భారీ ఆఫర్లు.. ఏసీలు, ఫ్యాన్లపై 65 శాతం వరకు డిస్కౌంట్..
- ●Lee Tarlamis nd Sridhar babu | తెలంగాణతో కలిసి పని చేయడం మాకిష్టమే
- ●Devi Prasad | అప్పుల ఊబిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.. జీతాలు ఇవ్వరా..? : దేవీ ప్రసాద్
- ●Samantha | హోస్ట్‌గా సమంత కొత్త అవతారం - తమిళంలో సెలిబ్రిటీ టాక్ షో
- ●Mahesh Kumar Goud | రాముడికి బీజేపీ పార్టీలో సభ్యత్వం ఉందా?
- ●Woman Parade | భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం.. అర్ధనగ్నంగా వివాహిత ఊరేగింపు

Amazon Prime Day 2026 | అమెజాన్ ప్రైమ్ డేలో భారీ ఆఫర్లు.. ఏసీలు, ఫ్యాన్లపై 65 శాతం వరకు డిస్కౌంట్..

Lee Tarlamis nd Sridhar babu | తెలంగాణతో కలిసి పని చేయడం మాకిష్టమే

Devi Prasad | అప్పుల ఊబిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.. జీతాలు ఇవ్వరా..? : దేవీ ప్రసాద్

Samantha | హోస్ట్‌గా సమంత కొత్త అవతారం - తమిళంలో సెలిబ్రిటీ టాక్ షో






