Obscene Content | టీచర్లు, విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు అసభ్యంగా మార్ఫింగ్.. కాలేజీ స్టూడెంట్ అరెస్ట్
Obscene Content | సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ సహచరులు, విద్యాబుద్ధులు నేర్పించే అధ్యాపకురాళ్ల ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ (Morphing) చేసి అశ్లీల చిత్రాలుగా (Obscene Content) మారుస్తున్న ఓ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు.
Obscene Content | త్రినేత్ర.న్యూస్: సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ సహచరులు, విద్యాబుద్ధులు నేర్పించే అధ్యాపకురాళ్ల ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ (Morphing) చేసి అశ్లీల చిత్రాలుగా (Obscene Content) మారుస్తున్న ఓ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కేరళలోని కొచ్చిలో జరిగింది.
శ్రీహరి అనే విద్యార్థి త్రిక్కాకరలోని భరతమాత కాలేజీలో బీబీఏ (BBA) లాజిస్టిక్స్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఓ విద్యార్థి సంఘం సోషల్ మీడియా ఇన్‌చార్జ్ అయిన అతడు.. 2025 నుంచి కాలేజీ విద్యార్థినులు, అధ్యాపకురాళ్ల ఫొటోలు, వీడియోలు సేకరిస్తున్నాడు. వాటిని ఏఐ ఉపయోగించి (AI) అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తున్నాడు. వాటిని సోషల్ మీడియా వేధికలైన టెలిగ్రామ్ (Telegram), ఇన్‌స్టాగ్రామ్‌లలో (Instagram) సర్క్యులేట్ చేస్తున్నాడు. విషయం కాలేజీ యాజమాన్యం దృష్టికి రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. చిత్రాలను సర్క్యులేట్ చేయడానికి ఉపయోగించినట్లు భావిస్తున్న మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
దానిని పరిశీలించగా విద్యార్థులు, ఉపాధ్యాయులకు సంబంధించిన పలు మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు లభ్యమయ్యాయి. ఈనేపథ్యంలో తమ ఫోటోలు, వీడియోలు ఏవైనా దుర్వినియోగం అయ్యాయా అని పరిశీలించేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆ మొబైల్ ఫోన్‌ను తనిఖీ చేసేందుకు అధికారులు అనుమతించారు.
విద్యార్థులు, ఉపాధ్యాయుల ఫోటోలు, వీడియోలను అప్‌లోడ్ చేసి, వాటిని అసభ్యకరమైన కంటెంట్‌గా మార్చే ఒక టెలిగ్రామ్ గ్రూప్‌లో శ్రీహరి సభ్యుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ గ్రూప్‌లో చాలా మంది సభ్యులు ఉన్నారని, వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలను అందించినందుకు శ్రీహరికి డబ్బులు అందాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగా అతని బ్యాంక్ లావాదేవీలను పరిశీలిస్తున్నారు. కాగా, శ్రీహరిని కాలేజీ నుంచి బహిష్కరించినట్లు (Dismissed) యాజమాన్యం పేర్కొంది.
సంబంధిత వార్తలు

Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త అప్డేట్.. ఇక ప్రొఫైల్స్‌కు మరింత స్పష్టంగా లేబుల్స్..
సెప్టెంబర్ 2, 2026

Theenmar Mallanna | జెన్-Z చేతుల్లోనే తెలంగాణ భవిష్యత్తు.. విద్యకే మా తొలి ప్రాధాన్యం
సెప్టెంబర్ 1, 2026

NEET PG | నీట్ పీజీ పరీక్ష.. మద్యం తాగి వచ్చిన విద్యార్థి.. అనుమతించని సిబ్బంది
ఆగస్టు 30, 2026
తాజావార్తలు
- ●Jio PC | పాత కంప్యూటర్‌కు కొత్త ఊపిరి.. జియో నుంచి సరికొత్త క్లౌడ్ పీసీ..
- ●Harsha Kumar | పథకం ప్రకారం సీనియర్లను పార్టీ నుంచి బయటకు పంపిస్తున్నారు: కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్
- ●Nepal Floods | నేపాల్ వరదల్లో అద్భుతం.. 9 రోజుల తర్వాత జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు కార్మికులు
- ●Gold And Silver Prices Today | ఇన్వెస్టర్లకు అలర్ట్.. బులియన్ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు..
- ●Volkswagen | వోక్స్‌వ్యాగన్‌లో భారీ ఉద్యోగ కోతలు.. 2030 నాటికి లక్ష ఉద్యోగాలు కట్..
- ●IndiGo plane hits pole | ల్యాండింగ్ వేళ పోల్‌ను ఢీ కొట్టిన విమానం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఘటన

Jio PC | పాత కంప్యూటర్‌కు కొత్త ఊపిరి.. జియో నుంచి సరికొత్త క్లౌడ్ పీసీ..

Harsha Kumar | పథకం ప్రకారం సీనియర్లను పార్టీ నుంచి బయటకు పంపిస్తున్నారు: కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్

Nepal Floods | నేపాల్ వరదల్లో అద్భుతం.. 9 రోజుల తర్వాత జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు కార్మికులు

Gold And Silver Prices Today | ఇన్వెస్టర్లకు అలర్ట్.. బులియన్ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు..



