త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telegram App | స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో అప్ డేట్ అయిన టెలిగ్రామ్ యాప్‌.. ఏఐ స‌దుపాయం కూడా..!

Telegram App | ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ త‌న ప్లాట్‌ఫామ్‌లో ప‌లు కొత్త ఫీచ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు యాప్‌కు చెందిన అప్‌డేటెడ్ వెర్ష‌న్‌ను ప్ర‌స్తుతం అందుబాటులో ఉంచింది. ఇందులో ఏఐ ఆధారిత టెక్ట్స్ ఎడిట‌ర్‌, పోల్ ఫీచ‌ర్ల‌కు మ‌రిన్ని హంగులు, లైవ్‌, మోష‌న్ ఫొటోల‌కు స‌పోర్ట్‌, బాట్ మేనేజ్‌మెంట్ టూల్స్‌, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌పై డాక్యుమెంట్ స్కాన‌ర్ వంటి అనేక ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

S

Technology | Published On Apr 4, 2026, 1.51 pm IST

Telegram App | స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో అప్ డేట్ అయిన టెలిగ్రామ్ యాప్‌.. ఏఐ స‌దుపాయం కూడా..!
Advertisement

Telegram App | ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ త‌న ప్లాట్‌ఫామ్‌లో ప‌లు కొత్త ఫీచ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు యాప్‌కు చెందిన అప్‌డేటెడ్ వెర్ష‌న్‌ను ప్ర‌స్తుతం అందుబాటులో ఉంచింది. ఇందులో ఏఐ ఆధారిత టెక్ట్స్ ఎడిట‌ర్‌, పోల్ ఫీచ‌ర్ల‌కు మ‌రిన్ని హంగులు, లైవ్‌, మోష‌న్ ఫొటోల‌కు స‌పోర్ట్‌, బాట్ మేనేజ్‌మెంట్ టూల్స్‌, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌పై డాక్యుమెంట్ స్కాన‌ర్ వంటి అనేక ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. టెలిగ్రామ్ యాప్ లో అందుబాటులో ఉన్న ఈ కొత్త ఫీచ‌ర్ల‌ను యూజ‌ర్లు పొందాలంటే యాప్‌ను లేటెస్ట్ వెర్ష‌న్‌కు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఇక కొత్త అప్‌డేట్‌లో యాప్‌లోని మెసేజ్ బార్‌లోనే బిల్టిన్ ఏఐ ఎడిట‌ర్‌ను ఇచ్చారు. యూజ‌ర్లు టైప్ చేస్తూనే త‌మ మెసేజ్‌ల‌ను మ‌రింత మెరుగు ప‌రుచుకోవ‌డానికి ఇది స‌హాయం చేస్తుంది. ఈ ఏఐ ఎడిట‌ర్ స‌హాయంతో మెసేజ్‌ల‌లో ఉండే గ్రామ‌ర్ మిస్టేక్స్‌ను స‌రిదిద్ద‌వ‌చ్చు. టెక్ట్స్‌ను వివిధ స్టైల్స్‌లో తిరిగి రాయ‌వ‌చ్చు. మెసేజ్‌ల‌ను ఇత‌ర భాష‌ల్లోకి అనువదించ‌వ‌చ్చు.

ఇన్‌బిల్ట్ ఏఐ ఎడిట‌ర్‌..

టెలిగ్రామ్ యాప్ అప్‌డేటెడ్ వెర్ష‌న్‌లో ఏఐ ఎడిట‌ర్‌లో ఫార్మ‌ల్‌, షార్ట్‌, ట్రైబ‌ల్‌, కార్ప్‌, జెన్‌, బిబ్లిక‌ల్‌, వైకింగ్ వంటి స్టైల్స్‌లో టెక్ట్స్‌ను రాయ‌వ‌చ్చు. అలాగే అనువాద స‌మ‌యంలోనూ ఎంపిక చేసిన స్టైల్‌ను ఉప‌యోగించ‌వ‌చ్చు. ఈ ఫీచ‌ర్‌ను టెలిగ్రామ్ ఓపెన్ సోర్స్ ఏఐ మోడ‌ల్స్ ఆధారంగా అందిస్తోంది. అయితే ఈ ఫీచ‌ర్ లో టెలిగ్రామ్ కొకూన్ నెట్‌వ‌ర్క్ ను ఉప‌యోగిస్తోంది . ఇందులో యూజ‌ర్ డేటాకు యాక్సెస్ లేకుండా అత్యంత గోప్యంగా ప్రాసెస్ నిర్వ‌హిస్తారు. ఏఐ ఎడిట‌ర్ ఫీచ‌ర్‌ను ఉయోగించాలంటే ఏదైనా మెసేజ్‌ను టైప్ చేసిన అనంత‌రం ఏఐ ఐకాన్ సెండ్ బ‌ట‌న్ పైభాగంలో క‌నిపిస్తుంది. దాంతో ఆయా ఫీచ‌ర్ల‌ను వాడుకోవ‌చ్చు.

పోల్స్ ఫీచ‌ర్‌కు మ‌రిన్ని హంగులు..

కొత్త వెర్ష‌న్‌లో పోల్స్ ఫీచ‌ర్‌ను మ‌రిన్ని హంగుల‌తో తీర్చిదిద్దారు. గ్రూప్స్‌, చాన‌ల్స్‌లో పోల్స్ క్రియేట్ చేయ‌డం, నిర్వ‌హించ‌డం ఇక‌పై మ‌రింత సుల‌భ‌త‌రం అవుతుంది. పోల్స్ ప్ర‌శ్న‌లు లేదా స‌మాధానాల‌కు మీడియా లేదా లొకేష‌న్‌ను జ‌త చేయ‌వ‌చ్చు. అద‌న‌పు స‌మాచారం కోసం వివ‌ర‌ణ‌ల‌ను చేర్చ‌వ‌చ్చు. పోల్స్‌లో పాల్గొనేవారికి కొత్త స‌మాధానాల‌ను సూచించే అవ‌కాశం ఇవ్వ‌వ‌చ్చు. ప్ర‌తి ఆప్ష‌న్‌కు ఓటు వేసిన వారి వివ‌రాలు చూడ‌వ‌చ్చు. రీవోటింగ్‌ను నిలిపివేసి ఫ‌లితాల‌ను ఫిక్స్ చేయ‌వ‌చ్చు. ప్ర‌తి యూజ‌ర్‌కు స‌మాధానాల క్ర‌మాన్ని మార్చ‌వ‌చ్చు. పోల్స్‌కు టైమ్ లిమిట్ సెట్ చేయ‌వ‌చ్చు. పోల్స్ ముగిసే వరకు ఫలితాలను దాచవచ్చు. ఓటు వేయకుండా ఫలితాలను చూడవచ్చు (క్రియేటర్లకు). ఇప్పుడు పోల్స్ సెట్టింగ్స్‌లో మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్న క్విజ్ ఫార్మాట్‌లను కూడా సపోర్ట్ చేసే విధంగా ఫీచ‌ర్ ఇచ్చారు. అలాగే విజిబుల్ రెస్పాన్స్‌లతో పోల్స్‌లో ఎవరు ఓటు వేసినా క్రియేటర్లకు నోటిఫికేషన్లు వస్తాయి. గ్రూప్, ఛాన‌ల్ ప్రొఫైల్‌లలో ప్రత్యేక ట్యాబ్ ద్వారా ప్రస్తుత, గత పోల్స్‌ను సులభంగా చూడవచ్చు.

మోష‌న్ ఫొటోల‌కు స‌పోర్ట్‌..

టెలిగ్రామ్ ఐఓఎస్ కొత్త వెర్ష‌న్‌లో లైవ్ ఫోటోలు, ఆండ్రాయిడ్ మోషన్ ఫోటోలకు స‌పోర్ట్ ఇచ్చారు. దీంతో యూజర్లు అన్ని టెలిగ్రామ్ యాప్‌లలో ప్లే అయ్యే యానిమేటెడ్ చిత్రాలను పంపవచ్చు. యూజర్లు మూడు ప్లేబ్యాక్ స్టైల్‌లను ఎంపిక చేసుకోవచ్చు. లైవ్ అనే స్టైల్ ద్వారా ఓపెన్ చేసినప్పుడు ఒక్కసారి మాత్రమే ప్లే అవుతుంది. లూప్ అనే స్టైల్‌తో నిరంతరం ప్లే అవుతుంది. బౌన్స్ స్టైల్ ద్వారా ముందుకు వెనుకకు పునరావృతంగా ప్లే అవుతుంది. ఇక టెలిగ్రామ్ తన బాట్ ఏపీఐకి కూడా అనేక అప్ డేట్స్‌ను ఇచ్చింది. ఇప్పుడు యూజర్లు సులభంగా బాట్స్‌ను క్రియేట్ చేయ‌వ‌చ్చు, నిర్వహించవచ్చు. తక్కువ సెటప్‌తో బాట్స్‌ను క్రియేట్ చేయ‌వ‌చ్చు. బాట్స్ ద్వారా ఇతర బాట్స్‌ను కూడా క్రియేట్ చేసి నిర్వహించవచ్చు. ఈ అప్‌డేట్ వల్ల కోడింగ్ ప‌రిజ్ఞానం లేకుండానే బాట్ డెవలప్‌మెంట్, వినియోగం సాధ్యమవుతుంది.

బిల్ట్ ఇన్ డాక్యుమెంట్ స్కాన‌ర్‌..

ఇక టెలిగ్రామ్ యాప్ ఐఓఎస్ అప్‌డేటెడ్ వెర్ష‌న్‌లో డాక్యుమెంట్ స్కానర్ ను ఇచ్చారు. బిల్ట్-ఇన్ డాక్యుమెంట్ స్కానర్ ద్వారా యూజర్లు యాప్‌లోనే డాక్యుమెంట్లను స్కాన్ చేసి ప్రాసెస్ చేయవచ్చు. కెమెరాతో డాక్యుమెంట్లను స్కాన్ చేయవచ్చు. అనేక పేజీలను ఒకే ఫైల్‌గా కలపవచ్చు. ఆటోమేటిక్ బ్యాక్‌గ్రౌండ్ తొలగింపు, క్రాపింగ్ చేసుకోవ‌చ్చు. పీడీఎఫ్ గా ఫైల్‌ను ఎక్స్‌పోర్ట్ చేయవచ్చు. రోటేట్, ఫిల్టర్, బోర్డర్ ఎడిటింగ్ వంటి మాన్యువల్ మార్పులు చేయవచ్చు. ఇక టెలిగ్రామ్ ప్ర‌స్తుతం థర్డ్ పార్టీ యాప్‌లను ఉపయోగించే ప్రొఫైల్‌లపై హెచ్చరిక చూపిస్తుంది. అలాంటి ఖాతాలకు పంపే మెసేజ్‌లు అధికారిక టెలిగ్రామ్ యాప్‌లతో పోలిస్తే తక్కువ భద్రత కలిగి ఉంటాయ‌ని ఆ హెచ్చ‌రిక సూచిస్తుంది.

కొత్త‌గా వ‌చ్చిన ఫీచ‌ర్ల‌ను టెలిగ్రామ్‌లో పొందాలంటే యూజ‌ర్లు త‌మ యాప్‌ను నూత‌న వెర్ష‌న్‌కు అప్‌డేట్ చేయాలి. టెలిగ్రామ్ వెర్ష‌న్ 12.6.0 లేదా అంత‌క‌న్నా పైన వెర్ష‌న్‌లో ఈ ఫీచర్ల‌ను ఇచ్చారు. ఇక టెలిగ్రామ్ యాప్‌ను ఆండ్రాయిడ్ యూజ‌ర్లు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా, ఐఫోన్ యూజ‌ర్లు యాపిల్ యాప్ స్టోర్ ద్వారా అప్ డేట్ చేసుకోవ‌చ్చు.

Advertisement
Advertisement