త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telegram App | టెలిగ్రామ్ యాప్‌కు భారీ అప్‌డేట్‌.. ప‌వర్‌ఫుల్ ఏఐ ఫీచ‌ర్లు..

Telegram App | టెలిగ్రామ్ తన ప్లాట్‌ఫామ్‌లో భారీ ఏఐ అప్‌డేట్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఈ కొత్త అప్‌డేట్‌లో గెస్ట్ బాట్స్‌, బాట్-టు-బాట్ క‌మ్యూనికేష‌న్‌, ఏఐ ఆధారిత ఆటోమేషన్ ఫీచర్లు, స్ట్రీమింగ్ బాట్ రెస్పాన్స్‌లు, కొత్త చాట్ కంట్రోల్స్ వంటి అనేక ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయని సంస్థ‌ వెల్లడించింది. టెలిగ్రామ్‌ను కేవలం మెసేజింగ్ యాప్‌గా కాకుండా పూర్తి స్థాయి ఏఐ, ఆటోమేషన్ ఎకోసిస్టమ్‌గా మార్చే దిశగా ఈ అప్‌డేట్‌ను తీసుకొచ్చినట్లు తెలియ‌జేసింది.

S

Technology | Published On May 9, 2026, 5.15 pm IST

Telegram App | టెలిగ్రామ్ యాప్‌కు భారీ అప్‌డేట్‌.. ప‌వర్‌ఫుల్ ఏఐ ఫీచ‌ర్లు..
Advertisement

Telegram App | టెలిగ్రామ్ తన ప్లాట్‌ఫామ్‌లో భారీ ఏఐ అప్‌డేట్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఈ కొత్త అప్‌డేట్‌లో గెస్ట్ బాట్స్‌, బాట్-టు-బాట్ క‌మ్యూనికేష‌న్‌, ఏఐ ఆధారిత ఆటోమేషన్ ఫీచర్లు, స్ట్రీమింగ్ బాట్ రెస్పాన్స్‌లు, కొత్త చాట్ కంట్రోల్స్ వంటి అనేక ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయని సంస్థ‌ వెల్లడించింది. టెలిగ్రామ్‌ను కేవలం మెసేజింగ్ యాప్‌గా కాకుండా పూర్తి స్థాయి ఏఐ, ఆటోమేషన్ ఎకోసిస్టమ్‌గా మార్చే దిశగా ఈ అప్‌డేట్‌ను తీసుకొచ్చినట్లు తెలియ‌జేసింది. ఈ అప్‌డేట్‌లో ప్రధాన ఆకర్షణగా గెస్ట్ బాట్స్ అనే ఫీచర్ నిలిచింది. ఇప్పటి వరకు బాట్‌ను ఉపయోగించాలంటే గ్రూప్ లేదా చాట్‌లో సభ్యుడిగా జాయిన్ అవ్వాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు యూజర్లు ఏదైనా బాట్‌ను కేవలం @username ద్వారా ట్యాగ్ చేస్తే సరిపోతుంది. ఆ బాట్ నేరుగా అదే చాట్‌లో స్పందిస్తుంది. ప్రత్యేకంగా బాట్‌ను యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు.

బాట్స్ ఒక‌దానితో ఒక‌టి క‌మ్యూనికేట్‌..

టెలిగ్రామ్ తెలిపిన ప్రకారం ఈ గెస్ట్ బాట్స్ యూజర్ ట్యాగ్ చేసిన మెసేజ్‌ను మాత్రమే ప్రాసెస్ చేస్తాయి. పూర్తి చాట్ హిస్టరీ, సభ్యుల జాబితా లేదా ఇతర మెసేజ్‌లకు యాక్సెస్ ఉండదని టెలిగ్రామ్‌ స్పష్టం చేసింది. ప్రైవసీ పరిరక్షణ దృష్ట్యా ఈ పరిమితులను అమలు చేసినట్లు తెలిపింది. ఈ బాట్స్ ద్వారా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, టెక్స్ట్ లేదా ఇమేజ్ జనరేషన్, ఫ్యాక్ట్ చెకింగ్ వంటి పనులు చేయవచ్చని పేర్కొంది. మరో కీలక ఫీచర్ బాట్‌-టు-బాట్ క‌మ్యూనికేష‌న్ కాగా, ఇప్పటి వరకు బాట్స్ కేవలం మనుషులతో మాత్రమే కమ్యూనికేట్ చేయగలిగేవి. ఇప్పుడు బాట్స్ ఒకదానితో మరొకటి నేరుగా కమ్యూనికేట్ చేసుకునే అవకాశం కల్పించారు. దీనివల్ల పూర్తి ఆటోమేటెడ్ వర్క్‌ఫ్లోలు రూపొందించవచ్చని టెలిగ్రామ్ తెలిపింది. ఉదాహరణకు ఒక బాట్ పని పూర్తి చేసి మరో బాట్‌కు డేటా పంపించడం, టాస్క్‌లను డెలిగేట్ చేయడం, ఏఐ ఏజెంట్ల మధ్య సమన్వయం వంటి పనులు సాధ్యమవుతాయని వివరించింది.

రియ‌ల్‌టైమ్‌లో స‌మాధానం..

టెలిగ్రామ్ విడుదల చేసిన అధికారిక వివరాల ప్రకారం ఈ ఫీచర్ వల్ల ఆటోనమస్ ఏఐ ఏజెంట్స్ నిర్మాణానికి మార్గం సుగమమవుతుందని పేర్కొంది. అయితే ఇలాంటి బాట్స్ మధ్య నిరంతర లూప్స్ ఏర్పడే ప్రమాదం కూడా ఉండటంతో డెవలపర్లు రేట్ లిమిట్స్, ఫిల్టరింగ్ వంటి సేఫ్టీ సిస్టమ్‌లు అమలు చేయాలని హెచ్చరించింది. కొత్త అప్‌డేట్‌లో స్ట్రీమింగ్ టెక్ట్స్ రెస్పాన్సెస్ అనే ఫీచర్‌ను కూడా తీసుకొచ్చారు. సాధారణంగా బాట్ పూర్తి సమాధానం సిద్ధమైన తర్వాత మాత్రమే రిప్లై పంపుతుంది. కానీ ఇప్పుడు సమాధానం రూపొందుతున్న కొద్దీ రియల్‌టైమ్‌లో టెక్స్ట్ కనిపిస్తుంది. ఇది చాట్ జీపీటీ తరహా అనుభవాన్ని అందిస్తుందని పేర్కొంది. ఇంకా చాట్ ఆటోమేష‌న్ ఇన్ ప్రొఫైల్స్ అనే ఫీచర్ ద్వారా యూజర్లు తమ ప్రొఫైల్‌ను బాట్‌కు కనెక్ట్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ బాట్ యూజర్ తరఫున మెసేజ్‌లకు స్పందిస్తుంది. ఏ చాట్స్‌లో స్పందించాలి, ఏ చాట్స్‌ను మినహాయించాలి వంటి నియంత్రణలు యూజర్‌కే ఉంటాయని తెలిపింది. ఉదాహరణకు కొత్త చాట్స్‌కే ఆటోమేటిక్ సమాధానాలు ఇవ్వడం లేదా కాంటాక్ట్స్ చాట్స్‌ను పూర్తిగా మినహాయించడం వంటి ఆప్ష‌న్లు అందుబాటులో ఉన్నాయి.

ఏఐ-ఫ‌స్ట్ క‌మ్యూనికేష‌న్ ప్లాట్‌ఫామ్‌గా..

ఈ అప్‌డేట్‌తో పాటు టెలిగ్రామ్ 100 మిలియన్లకు పైగా ఎమోజీలు, స్టికర్లలో సెర్చ్ సదుపాయాన్ని కూడా మెరుగుపరిచింది. 36 భాషల్లో సెర్చ్ చేయగలిగే విధంగా వ్యవస్థను విస్తరించినట్లు తెలిపింది. అదనంగా పోల్స్‌లో ఓటింగ్ పరిమితులు, దేశాల వారీగా ఓటింగ్ నియంత్రణలు, టైమ్ ఆధారిత పోల్ స్టాటిస్టిక్స్, సైలెంట్ షెడ్యూల్డ్ మెసేజెస్, గ్రూప్ రియాక్షన్ కంట్రోల్స్ వంటి ఫీచర్లు కూడా వచ్చాయి. టెక్ విశ్లేషకులు తెలిపిన‌ ప్రకారం టెలిగ్రామ్ ఈ అప్‌డేట్‌తో వాట్సాప్, డిస్కార్డ్, స్లాక్ వంటి ప్లాట్‌ఫామ్‌లకు భిన్నంగా ఏఐ-ఫస్ట్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్ గా మారే ప్రయత్నం చేస్తోంద‌ని చెబుతున్నారు. ముఖ్యంగా డెవలపర్లు, ఏఐ స్టార్టప్‌లు, ఆటోమేషన్ వర్క్‌ఫ్లోలను నిర్మించే సంస్థలకు ఈ ఫీచర్లు మరింత ఉపయోగపడే అవకాశముందని భావిస్తున్నారు.

Advertisement
Advertisement