TECNO Spark 50s 5G | టెక్నో స్పార్క్ 50ఎస్ 5జి వచ్చేసింది.. నెట్వర్క్ లేకున్నా కమ్యూనికేషన్..
TECNO Spark 50s 5G | భారత్‌లో టెక్నో స్పార్క్ 50ఎస్ 5జి స్మార్ట్‌ఫోన్‌ను టెక్నో అధికారికంగా విడుదల చేసింది. విడిభాగాలు, మెమరీ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రూ.20 వేల లోపు స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. రోజువారీ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో మెరుగైన నెట్వర్క్ కనెక్టివిటీ, మన్నికైన నిర్మాణం, ఎక్కువసేపు పనిచేసే బ్యాటరీపై కంపెనీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.
Technology | Published On Oct 16, 2026, 4.03 pm IST
TECNO Spark 50s 5G | భారత్‌లో టెక్నో స్పార్క్ 50ఎస్ 5జి స్మార్ట్‌ఫోన్‌ను టెక్నో అధికారికంగా విడుదల చేసింది. విడిభాగాలు, మెమరీ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రూ.20 వేల లోపు స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. రోజువారీ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో మెరుగైన నెట్వర్క్ కనెక్టివిటీ, మన్నికైన నిర్మాణం, ఎక్కువసేపు పనిచేసే బ్యాటరీపై కంపెనీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. తక్కువ సిగ్నల్ అందే ప్రాంతాల్లోనూ స్థిరమైన కనెక్టివిటీని అందించడం టెక్నో స్పార్క్ 50ఎస్ 5జి ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ఇందుకోసం ఇందులో 4*4 ఎంఐఎంఓ యాంటెన్నా సాంకేతికతను అందించారు. దీనివల్ల డౌన్లోడ్ వేగం 82 శాతం వరకు పెరుగుతుందని కంపెనీ పేర్కొంది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో యూపీఐ లావాదేవీల వేగాన్ని పెంచేందుకు యూపీఎస్ 3.0 సాంకేతికతను కూడా అందించింది. కంపెనీ పరీక్షల ప్రకారం, బేస్మెంట్లు, రవాణా కేంద్రాలు, రద్దీగా ఉండే వాణిజ్య ప్రాంతాల్లో యూపీఐ లావాదేవీలు రెండు రెట్లు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది.
నెట్వర్క్ లేకున్నా కమ్యూనికేషన్..
మొబైల్ నెట్వర్క్ పూర్తిగా అందుబాటులో లేని పరిస్థితుల్లోనూ కమ్యూనికేషన్ కొనసాగించేందుకు ఇందులో ప్రత్యేకంగా ఫ్రీలింక్ ఫీచర్‌ను అందించారు. ఎలాంటి అడ్డంకులు లేని ప్రాంతాల్లో, ఒకదానికొకటి నేరుగా సిగ్నల్ అందే పరిస్థితుల్లో ఈ ఫీచర్ ద్వారా 1.5 కిలోమీటర్ల దూరం వరకు వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. టెక్స్ట్ సందేశాలు పంపుకోవడంతోపాటు చిత్రాలను కూడా షేర్ చేసుకోవచ్చు. ఇందుకు సెల్యులార్ నెట్వర్క్ లేదా వై-ఫైఫై అవసరం లేదు. గోదాములు, వ్యవసాయ క్షేత్రాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే వారికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది.
టెక్నో స్పార్క్ 50ఎస్ 5జి స్మార్ట్‌ఫోన్ బర్గండీ రెడ్, బ్రీజ్ బ్లూ రంగుల్లో లభిస్తోంది. రోజువారీ వినియోగంలో ఫోన్‌కు ఎదురయ్యే దెబ్బలు, దుమ్ము, నీటి చినుకుల నుంచి రక్షణ కల్పించేందుకు ఐపీ64 ప్రొ రేటింగ్‌తో రూపొందించారు. అలాగే, ఎంఐఎల్-ఎస్టీడీ-810హెచ్ మిలిటరీ గ్రేడ్ మన్నిక ప్రమాణాలకు అనుగుణంగా ఈ ఫోన్‌ను తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది. సాధారణంగా ఎదురయ్యే కిందపడడం, కంపనాలు, కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా దీన్ని రూపొందించారు. ముందు భాగంలో 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్ప్లేను అందించారు. దీనివల్ల స్క్రీన్‌పై స్క్రోలింగ్, వీడియోల వీక్షణ మరింత సాఫీగా ఉండనున్నాయి.
భారీ బ్యాటరీ..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6,500 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీని అందించారు. దీనికి 45 వాట్ల వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. ఇందులో ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్ సదుపాయం ఉంది. సాధారణ మొబైల్ కాల్స్‌తోపాటు వాట్సాప్ కాల్స్, కాన్ఫరెన్స్ కాల్స్ సమయంలోనూ చుట్టుపక్కల శబ్దాలను తగ్గించి, వాయిస్ స్పష్టతను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది. గూగుల్ జెమిని ఏఐ అసిస్టెంట్‌ను కూడా ఇందులో పొందుపరిచారు. దీని ద్వారా రాతపూర్వక కంటెంట్ తయారు చేసుకోవడం, పనులను క్రమబద్ధీకరించడం, సాధారణ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం వంటి పనులు చేయవచ్చు. అలాగే, సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ ద్వారా స్క్రీన్‌పై కనిపించే వస్తువులు, టెక్స్ట్ లేదా చిత్రాలను ఎంపిక చేసుకుని, యాప్ మార్చాల్సిన అవసరం లేకుండానే వెంటనే శోధించవచ్చు.
ధర వివరాలు..
ఈ ఫోన్లో 6.78 ఇంచుల హెచ్డీ ప్లస్ డిస్ప్లేను అందించారు. 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 560 నిట్స్ గరిష్ఠ బ్రైట్ నెస్ ఉన్నాయి. 6 నానోమీటర్ తయారీ ప్రక్రియపై రూపొందించిన ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. 6 జీబీ, 8 జీబీ ర్యామ్ ఆప్షన్లు ఉన్నాయి. స్టోరేజ్ 128 జీబీగా ఉంది. మైక్రోఎస్డీ కార్డు ద్వారా మెమరీని 2 టీబీ వరకు విస్తరించుకోవచ్చు. నానో సిమ్ కార్డుల కోసం రెండు సిమ్ స్లాట్లు, మైక్రోఎస్డీ కార్డు కోసం ప్రత్యేక సదుపాయం ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైఓఎస్ 16తో ఈ ఫోన్ పనిచేస్తుంది. వెనుకవైపు 50 మెగాపిక్సల్ కెమెరా, ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరాను అందించారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. 3.5 ఎంఎం ఆడియో జాక్‌ను కూడా అందించారు. 5జి ఎస్ఏ, ఎన్ఎస్ఏ నెట్‌వర్క్‌లకు మద్దతు ఉంది. డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్ సి కనెక్టివిటీ సదుపాయాలు ఉన్నాయి.
టెక్నో స్పార్క్ 50ఎస్ 5జి 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.19,999గా నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అక్టోబర్ 20 నుంచి దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలోనే విక్రయించనున్నారు. ఆన్లైన్ విక్రయాల గురించి కంపెనీ ప్రస్తావించలేదు.
సంబంధిత వార్తలు

TECNO Spark Go 3 Pro | చవక ధరకే టెక్నో కొత్త స్మార్ట్ ఫోన్.. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో..
ఆగస్టు 31, 2026

TECNO POP X 5G | భారీ బ్యాటరీ, డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో వచ్చిన టెక్నో కొత్త స్మార్ట్ ఫోన్.. తక్కువ ధరకే లాంచ్..
ఏప్రిల్ 20, 2026

TECNO POVA Curve 2 5G | 8000mAh భారీ బ్యాటరీతో వచ్చిన టెక్నో కొత్త ఫోన్.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
ఫిబ్రవరి 13, 2026
తాజావార్తలు
- ●Ind Vs WI | ఐదో టీ20లోకి భువనేశ్వర్ కుమార్.. అర్ష్‌దీప్‌కు గాయం!
- ●Faria Abdullah | పక్కా పల్లెటూరి అమ్మాయిగా ఫరియా అబ్దుల్లా - హిట్టు కోసం రూటు మార్చిన హైదరాబాదీ బ్యూటీ
- ●Air India | సౌదీ అరేబియాకు విమానాల రద్దు.. అక్టోబర్ 20 వరకు ఎయిర్ ఇండియా సేవలు నిలిపివేత
- ●Abhijeet Dipke | ఢిల్లీని ప్రభుత్వం వార్ జోన్ గా ప్రకటించినందువల్లే బిజినెస్ లాస్..! నిరసనలు కారణం కాదు : అభిజీత్ దిప్కే
- ●Navaratri Brahmotsavam | భక్తులను కటాక్షించిన శ్రీకృష్ణుడు.. మోహినీ అవతారంలో మలయప్పస్వామి..
- ●Malkajgiri Police | దసరాకు ఊరెళ్తున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Ind Vs WI | ఐదో టీ20లోకి భువనేశ్వర్ కుమార్.. అర్ష్‌దీప్‌కు గాయం!

Faria Abdullah | పక్కా పల్లెటూరి అమ్మాయిగా ఫరియా అబ్దుల్లా - హిట్టు కోసం రూటు మార్చిన హైదరాబాదీ బ్యూటీ

Air India | సౌదీ అరేబియాకు విమానాల రద్దు.. అక్టోబర్ 20 వరకు ఎయిర్ ఇండియా సేవలు నిలిపివేత

Abhijeet Dipke | ఢిల్లీని ప్రభుత్వం వార్ జోన్ గా ప్రకటించినందువల్లే బిజినెస్ లాస్..! నిరసనలు కారణం కాదు : అభిజీత్ దిప్కే



