TECNO Spark Go 3 Pro | చవక ధరకే టెక్నో కొత్త స్మార్ట్ ఫోన్.. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో..
TECNO Spark Go 3 Pro | మొబైల్స్ తయారీ సంస్థ టెక్నో భారత మార్కెట్లో స్పార్క్ గో 3 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఐపీ69 రేటింగ్‌ను అందించిన ప్రత్యేక ఫోన్‌గా కంపెనీ దీనిని లాంచ్ చేసింది. అధిక పీడనంతో వచ్చే నీటి జెట్‌లు, దుమ్ము ప్రవేశం, అనుకోకుండా కిందపడటం వంటి పరిస్థితులను తట్టుకునేలా ఈ ఫోన్‌ను రూపొందించినట్లు టెక్నో వెల్లడించింది.
Technology | Published On Aug 31, 2026, 10.51 am IST
TECNO Spark Go 3 Pro | మొబైల్స్ తయారీ సంస్థ టెక్నో భారత మార్కెట్లో స్పార్క్ గో 3 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఐపీ69 రేటింగ్‌ను అందించిన ప్రత్యేక ఫోన్‌గా కంపెనీ దీనిని లాంచ్ చేసింది. అధిక పీడనంతో వచ్చే నీటి జెట్‌లు, దుమ్ము ప్రవేశం, అనుకోకుండా కిందపడటం వంటి పరిస్థితులను తట్టుకునేలా ఈ ఫోన్‌ను రూపొందించినట్లు టెక్నో వెల్లడించింది. రోజువారీగా కఠినమైన భౌతిక పరిస్థితుల్లో పనిచేసే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని స్పార్క్ గో 3 ప్రొను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ముఖ్యంగా అవుట్‌డోర్ డెలివరీ ఉద్యోగులు, వ్యవసాయ రంగంలో పనిచేసేవారు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రయాణించే వారికి ఉపయోగపడేలా దీని మన్నికపై దృష్టి సారించింది. టెక్నో ప్రస్తుతం నిర్వహిస్తున్న దేశ జైసా దమ్‌దార్ ప్రచారానికి అనుగుణంగా ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేను అందించారు. దీని వల్ల స్క్రీన్‌పై నావిగేషన్, కంటెంట్ వీక్షణ సమయంలో మరింత స్మూత్ అనుభూతి లభిస్తుంది. ఫోన్‌లో 5,200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, రోజువారీ వినియోగంలో ఎక్కువ గంటల పాటు పనిచేసేలా దీనిని రూపొందించారు. 15 వాట్ల ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. కాల్ సమయంలో చుట్టుపక్కల శబ్దాలను తగ్గించేందుకు ఏఐ వాయిస్‌ప్రింట్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీని అందించారు. దీంతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా కాల్స్‌లో స్పష్టమైన వాయిస్ వినిపించేలా సహాయపడుతుంది. అలాగే అనుకూలమైన ఎలక్ట్రానిక్ పరికరాలను నియంత్రించేందుకు ఇన్‌ఫ్రారెడ్ బ్లాస్టర్‌ను కూడా ఫోన్‌లో అందించారు. డ్యుయల్ స్పీకర్లతోపాటు డీటీఎస్ సపోర్ట్ కూడా ఉంది.
ధర ఎంతంటే..
భారత మార్కెట్లో టెక్నో స్పార్క్ గో 3 ప్రొ రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.15,999గా ఉంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.16,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను సెప్టెంబర్ 4 నుంచి ఆఫ్‌లైన్ రిటైల్ భాగస్వామి స్టోర్లతో పాటు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలోనూ కొనుగోలు చేయవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఇది అందుబాటులో ఉంటుంది.
సంబంధిత వార్తలు

TECNO Spark 50s 5G | టెక్నో స్పార్క్ 50ఎస్ 5జి వచ్చేసింది.. నెట్వర్క్ లేకున్నా కమ్యూనికేషన్..
అక్టోబర్ 16, 2026

TECNO CAMON 50 Ultra 5G | భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నికతో వచ్చిన టెక్నో కొత్త ఫోన్.. ఫీచర్లు అదిరాయి..
జులై 17, 2026

TECNO POVA 8 5G | టెక్నో పోవా 8 5జీ వచ్చేసింది.. భారీ బ్యాటరీ, ఆకట్టుకుంటున్న ఏఐ ఫీచర్లు..
జూన్ 11, 2026
తాజావార్తలు
- ●Lulu Mall | లూలూ మాల్.. కిట్ క్యాట్ చాక్లెట్లో పురుగులు ప్రత్యక్షం..!
- ●Bathukamma | 17న బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డ్స్ ప్రదానం
- ●NDA | ఎన్డీఏతో డీఎంకే దోస్తీ?
- ●FSSAI | నూనె ప్రకటనలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కొరడా.. బిగ్‌బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్‌కు నోటీసులు!
- ●Railway | రాళ్లు రువ్వడం, దొంగతనాలకు చెక్.. రైల్వే ట్రాక్‌లపై నిఘా..!
- ●CM Revanth Reddy | నిమ్జ్‌లో హ్యుందాయ్ ఆర్ అండ్ డీ కేంద్రం

Lulu Mall | లూలూ మాల్.. కిట్ క్యాట్ చాక్లెట్లో పురుగులు ప్రత్యక్షం..!

Bathukamma | 17న బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డ్స్ ప్రదానం

NDA | ఎన్డీఏతో డీఎంకే దోస్తీ?

FSSAI | నూనె ప్రకటనలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కొరడా.. బిగ్‌బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్‌కు నోటీసులు!



