త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Faria Abdullah | ప‌క్కా ప‌ల్లెటూరి అమ్మాయిగా ఫ‌రియా అబ్దుల్లా – హిట్టు కోసం రూటు మార్చిన హైద‌రాబాదీ బ్యూటీ

తెలుగులో మంచి స‌క్సెస్ కోసం ఎదురుచూస్తున్న జాతిర‌త్నాలు బ్యూటీ ఫ‌రియా అబ్దుల్లా త‌న రూటు మార్చింది. భ‌గ‌వంతుడు సినిమాలో ప‌ల్లెటూరి అమ్మాయిగా డీ గ్లామ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది. తిరువీర్ హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీ షూటింగ్ పూర్త‌య్యింది. త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

N

Entertainment | Published On Oct 16, 2026, 4.02 pm IST

Faria Abdullah | ప‌క్కా ప‌ల్లెటూరి అమ్మాయిగా ఫ‌రియా అబ్దుల్లా – హిట్టు కోసం రూటు మార్చిన హైద‌రాబాదీ బ్యూటీ
Advertisement

Faria Abdullah | హిట్టు కోసం జాతిర‌త్నాలు బ్యూటీ ఫ‌రియా అబ్దుల్లా త‌న రూటు మార్చింది. కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ ప‌ల్లెటూరి అమ్మాయిగా ఊర మాస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్త‌య్యింది. తిరువీర్ హీరోగా తెలుగులో భ‌గ‌వంతుడు పేరుతో పీరియాడిక‌ల్ పొలిటిక‌ల్ యాక్ష‌న్ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ సినిమాతో జీజీ విహారి డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు.

ఊర మాస్ రోల్‌...

ఇందులో తిరువీర్‌కు స‌ర‌స‌న ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్‌గా క‌నిపించ‌బోతుంది. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెలుగులో రాబోతున్న ఫస్ట్ మూవీ ఇది. ఇప్ప‌టివ‌ర‌కు తెలుగులో చేసిన అన్ని సినిమాల్లో మోడ్ర‌న్ అమ్మాయిగా క‌నిపించిన ఈ హైద‌రాబాదీ బ్యూటీ భ‌గ‌వంతుడు సినిమాలో ప‌క్కా ప‌ల్లెటూరి అమ్మాయిగా ఊర‌మాస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది. కంప్లీట్ డీ గ్లామ‌ర్ లుక్‌తో ఆమె క్యారెక్ట‌ర్ ఛాలెంజింగ్‌గా సాగుతోంద‌ని మేక‌ర్స్ చెబుతోన్నారు.

ఆత్మ గౌర‌వం వ‌ర్సెస్ ఆధిప‌త్యం...

ఆత్మ‌గౌర‌వానికి, ఆధిప‌త్య‌ధోర‌ణికి మ‌ధ్య జ‌రిగిన యుద్ధంలో ఓ యువ‌జంట‌కు ఎలాంటి అడ్డంకులు, అవ‌రోధాలు ఎదుర‌య్యాయ‌నే కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు విహారి ఈ సినిమాను తెర‌కెక్కిస్తోన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. త్వ‌ర‌లో రిలీజ్ డేట్‌ను రివీల్ చేయ‌బోతున్నారు.
భ‌గ‌వంతుడు మూవీలో క‌న్న‌డ న‌టుడు రిషి విల‌న్‌గా న‌టిస్తోండ‌గా... ర‌వీంద్ర విజ‌య్‌, విన‌య్ వ‌ర్మ‌, కాల‌కేయ ప్ర‌భాక‌ర్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. కేపీ సంగీతం అందిస్తున్నారు.

నాలుగో సినిమా...

తెలుగులో ఈ ఏడాది ఫ‌రియా అబ్దుల్లా న‌టిస్తోన్న నాలుగో మూవీ ఇది. త‌మిళ మూవీ సిగ్మాతో పాటు గాయ‌ప‌డ్డ సింహం సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది. రిలీజ్‌కు ముందు ఈ రెండు సినిమాల‌పై మంచి బ‌జ్ నెల‌కొన్న‌ ఫ‌రియాకు హిట్టును మాత్రం తెచ్చిపెట్ట‌లేక‌పోయాయి. భ‌గ‌వంతుడు సినిమాతో కొత్త‌ ప్ర‌యోగం చేయ‌బోతున్న ఫ‌రియాకు హిట్టు ద‌క్కుతుందా? లేదా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

 

Advertisement
Advertisement