TECNO POVA Curve 2 5G | 8000mAh భారీ బ్యాటరీతో వచ్చిన టెక్నో కొత్త ఫోన్.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
TECNO POVA Curve 2 5G | టెక్నో కంపెనీ తన నూతన స్మార్ట్ ఫోన్ పోవా కర్వ్ 2 5జి (POVA Curve 2 5G)ని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. కర్వ్ సిరీస్‌లో టెక్నో కంపెనీ రిలీజ్ చేసిన లేటెస్ట్ ఫోన్ ఇదే కాగా ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్ లో 6.78 ఇంచు అమోలెడ్ డిస్‌ప్లే ఉంది.
Technology | Published On Feb 13, 2026, 1.36 pm IST
TECNO POVA Curve 2 5G | టెక్నో కంపెనీ తన నూతన స్మార్ట్ ఫోన్ పోవా కర్వ్ 2 5జి (POVA Curve 2 5G)ని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. కర్వ్ సిరీస్‌లో టెక్నో కంపెనీ రిలీజ్ చేసిన లేటెస్ట్ ఫోన్ ఇదే కాగా ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్ లో 6.78 ఇంచు అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. దీనికి 1.5కె రిజల్యూషన్‌ను, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. కనుక డిస్‌ప్లే అద్భుతమైన క్వాలిటీని కలిగి ఉంటుంది. నాణ్యమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్ ను ఏర్పాటు చేశారు. 8జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. ర్యామ్‌ను అదనంగా మరో 8జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకునే వీలు కల్పించారు. కనుక ఫోన్ ల్యాగ్ లేకుండా వేగంగా పనిచేస్తుంది.
మెరుగైన మొబైల్ సిగ్నల్, వైఫై కెనెక్టివిటీ..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో జి1 సిగ్నల్ ఎన్‌హాన్స్‌మెంట్ చిప్‌ను అమర్చారు. దీని ద్వారా 33 నుంచి 100 శాతం వరకు మెరుగైన మొబైల్ సిగ్నల్ అందుతుందని కంపెనీ పేర్కొంది. అలాగే ఎస్ఈ1 వై-ఫై ఎన్‌హాన్స్‌మెంట్ చిప్ ద్వారా 60 శాతం వరకు బలమైన వై-ఫై కనెక్టివిటీ లభిస్తుందని వెల్లడించింది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైఓఎస్ 16 ను ఇందులో అందిస్తున్నారు. భారత వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఎల్లా ఏఐ 2.0ను ఇందులో అందిస్తున్నారు. దీని సహాయంతో యూజర్లు హిందీ, బెంగాళీ, తమిళం, గుజరాతీ, మరాఠీ భాషలలోనూ ఏఐ సేవలను ఉపయోగించుకోవచ్చు.
భారీ బ్యాటరీ..
ఈ ఫోన్‌లో ఏఐ నాయిస్ రిడక్షన్ అనే ప్రత్యేక సదుపాయాన్ని అందిస్తున్నారు. దీని వల్ల సాధారణ కాల్స్‌తోపాటు వాట్సాప్, జూమ్ వంటి కాల్స్‌ను కూడా ఎలాంటి శబ్దం లేకుండా స్పష్టంగా వినిపించేలా మాట్లాడుకోవచ్చు. ఈ ఫీచర్ కలిగిన ఈ సెజ్మెంట్‌కు చెందిన ఫోన్లలో పోవా కర్వ్ 2 5జి తొలి ఫోన్ అని కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ ను స్టార్‌షిప్ ఇన్‌స్పైర్డ్ డిజైన్ తో రూపొందించారు. సంప్రదాయ కెమెరా బంప్‌లకు బదులుగా త్రిభుజాకార అసిమెట్రికల్ కెమెరా మాడ్యూల్‌ను అందించారు. దీనివల్ల ఫోన్‌కు ఫ్యూచరిస్టిక్ లుక్ వచ్చిందని కంపెనీ తెలిపింది. ఎస్‌జీఎస్ 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌తో పాటు ఐపీ64 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ ను ఈ ఫోన్‌కు అందిస్తున్నారు. ఇందులో 8,000mAh భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని అమర్చారు. అయినప్పటికీ ఫోన్ కేవలం 195 గ్రాముల బరువును మాత్రమే కలిగి ఉండడం విశేషం. ఇక దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు.

డాల్బీ అట్మోస్ కూడా..
ఈ ఫోన్‌ను 8జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడు మరో 2 మెగాపిక్సల్ మాక్రో సెన్సార్‌ను ఇచ్చారు. ముందు వైపు 13 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ సెన్సార్‌లను ఇచ్చారు. డాల్బీ అట్మోస్ ఫీచర్ ఉన్నందున ఆడియో క్వాలిటీగా ఉంటుంది. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్ సి వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
ధర వివరాలు..
టెక్నో పోవా కర్వ్ 2 5జి ఫోన్‌ను మిస్టిక్ పర్పుల్, స్టార్మ్ టైటానియం, మెల్టింగ్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 8GB + 128GB మోడల్ ధర రూ. 27,999 ఉండగా, 8GB + 256GB వేరియంట్ ధరను రూ. 29,999గా నిర్ణయించారు. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు దేశవ్యాప్తంగా ప్రముఖ రిటైల్ స్టోర్లలో ఫిబ్రవరి 20 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ప్రీ-బుకింగ్స్ ఫిబ్రవరి 13 నుంచి ఇప్పటికే ప్రారంభించారు. ఈ ఫోన్‌పై పలు లాంచింగ్ ఆఫర్లను సైతం అందిస్తున్నారు. అన్ని బ్యాంకులకు చెందిన కార్డులతో ఈ ఫోన్‌పై రూ.1500 ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అలాగే 3 లేదా 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని పొందవచ్చు. దీనిపై రూ.3వేల వరకు క్యాష్ బ్యాక్‌ను ఇస్తున్నారు. దీని వల్ల ఫోన్ ధర మరింత తగ్గుతుంది.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Surface Pro for Business | నూతన తరం సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అద్భుతమైన ఫీచర్లు..
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



