TECNO CAMON 50 Ultra 5G | భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నికతో వచ్చిన టెక్నో కొత్త ఫోన్.. ఫీచర్లు అదిరాయి..
TECNO CAMON 50 Ultra 5G | మొబైల్స్ తయారీ సంస్థ టెక్నో మొబైల్ తన నూతన స్మార్ట్ ఫోన్ కామన్ 50 అల్ట్రా 5జిని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. కామన్ 50 సిరీస్‌లో అత్యంత ప్రీమియం మోడల్‌గా వచ్చిన ఈ ఫోన్ మొబైల్ ఫోటోగ్రఫీ, బలమైన డిజైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లపై ప్రత్యేక దృష్టి సారించింది.
Technology | Published On Jul 17, 2026, 3.44 pm IST
TECNO CAMON 50 Ultra 5G | మొబైల్స్ తయారీ సంస్థ టెక్నో మొబైల్ తన నూతన స్మార్ట్ ఫోన్ కామన్ 50 అల్ట్రా 5జిని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. కామన్ 50 సిరీస్‌లో అత్యంత ప్రీమియం మోడల్‌గా వచ్చిన ఈ ఫోన్ మొబైల్ ఫోటోగ్రఫీ, బలమైన డిజైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లపై ప్రత్యేక దృష్టి సారించింది. అధిక రిజల్యూషన్ కెమెరాలు, శక్తివంతమైన ప్రాసెసర్, మిలిటరీ గ్రేడ్ బిల్డ్ క్వాలిటీతో ఈ ఫోన్‌ను కంపెనీ తీసుకొచ్చింది. ఫోటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సెన్సార్ ను ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో ఇచ్చారు. అలాగే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌ను అందిస్తే, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా విస్తృత దృశ్యాలను చిత్రీకరించేందుకు ఉపయోగపడుతుంది.
పవర్‌ఫుల్ కెమెరాలు, భారీ బ్యాటరీ..
కెమెరా అనుభవాన్ని మరింత మెరుగుపరచేందుకు ఏఐ 100ఎక్స్ సూపర్ జూమ్, సూపర్ జూమ్ ఫ్లాష్‌స్నాప్, లైవ్ ఫోటో, అలాగే అండర్‌వాటర్ ఫోటోగ్రఫీ మోడ్ వంటి ఫీచర్లను కూడా అందించారు. ఈ ఫోన్‌లో 6.78 ఇంచుల 1.5కె అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఇది 144హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది. గరిష్టంగా 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను అందిస్తుంది. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ కూడా ఉంది. దీర్ఘకాలం ఫోన్ ఉపయోగించినప్పుడు కళ్లపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రోఎక్స్‌డీఆర్ ఐ కేర్ టెక్నాలజీని కూడా పొందుపరిచారు. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఆక్టాకోర్ ప్రాసెసర్ ను ఉపయోగించారు. ఇది గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు మంచి పనితీరును అందిస్తుంది. ఇందులో 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైఓఎస్ 16 పై పనిచేస్తుంది. సెల్ఫీల కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ముందు, వెనుక కెమెరాలతో 4కె 30ఎఫ్‌పీఎస్ వీడియో రికార్డింగ్ కు మద్దతు ఉంది. 6500 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఇందులో అందించారు. దీనికి 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే రోజంతా ఉపయోగించుకునేలా బ్యాటరీ సామర్థ్యాన్ని రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది.
వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, డాల్బీ అట్మోస్..
దీనిని సిల్క్-ఫ్లో డిజైన్ తో కంపెనీ రూపొందించింది. అందమైన లుక్‌తోపాటు బలమైన నిర్మాణాన్ని కూడా కలిపి ఉంటుంది. ఈ ఫోన్‌కు ఐపీ68, ఐపీ69, ఐపీ69కె డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్లు ఉన్నాయి. అలాగే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ కూడా లభించింది. దీంతో పడిపోయినా, దుమ్ము, నీరు, సాధారణ షాక్‌లను తట్టుకునే సామర్థ్యం ఉందని కంపెనీ చెబుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లలో అప్‌గ్రేడ్ చేసిన ఎల్లా స్మార్ట్ అసిస్టెంట్, ఏఐ ఇమేజ్ టు వీడియో జనరేటర్, 3డి ఫోటోస్పేస్, ఏఐ లైట్‌మాస్టర్ 2.0 వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఆడియో కోసం స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్, హై-రెస్ ఆడియో, డ్యూయల్ మైక్రోఫోన్లు అందించారు. అలాగే ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐఆర్ సెన్సార్, ఎన్‌ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.4, డ్యూయల్ 5జి, డ్యూయల్ 4జి వోల్టీ, వై-ఫై ఏసీ, యూఎస్‌బీ టైప్-సి వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ సైప్రస్ గ్రీన్, మిస్టీ పర్పుల్, నెబ్యులా టైటానియం రంగుల్లో అందుబాటులోకి వచ్చింది.
ధర వివరాలు..
టెక్నో కామన్ 50 అల్ట్రా 5జి ఫోన్ ధరను రూ.39,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ ను జూలై 21 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ ఇండియా సైట్‌లో విక్రయించనున్నారు. లాంచ్ ఆఫర్ కింద జూలై 21, 22 తేదీల్లో కొనుగోలు చేసే వారికి రూ.3వేల కూపన్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది.
తాజావార్తలు
- ●MLA Rakesh Reddy | విద్యార్థినులారా.. నేన్ చెప్తున్నా.. షోరూమ్‌ల నుంచి స్కూటీలు ఎత్తుకెళ్లండి
- ●Sun Holidays | సూర్యుడికి 9 రోజులు సెలవులు.. ఎప్పుడో తెలుసా..?
- ●Mouni Roy | మొన్ననే విడాకులు - అప్పుడే కొత్త ప్రియుడితో షికార్లు - హాట్ బ్యూటీ మౌనీరాయ్‌ని ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు
- ●US Tariffs | భారత్‌పై 100 శాతం టారిఫ్‌లు.. మద్దతు తెలిపిన యూఎస్ సెనేటర్లు
- ●Samvidhan Bachao | విద్యా వ్యవస్థలో అవకతవకలు.. జులై 20న 12 గంటల శాంతియుత నిరాహార దీక్ష చేపట్టండి
- ●MLA Sudheer Reddy | జూన్ 30న అప్లికేషన్ పెట్టినం.. జూలై 18 వస్తున్నా పర్మిషన్ ఇవ్వలే

MLA Rakesh Reddy | విద్యార్థినులారా.. నేన్ చెప్తున్నా.. షోరూమ్‌ల నుంచి స్కూటీలు ఎత్తుకెళ్లండి

Sun Holidays | సూర్యుడికి 9 రోజులు సెలవులు.. ఎప్పుడో తెలుసా..?

Mouni Roy | మొన్ననే విడాకులు - అప్పుడే కొత్త ప్రియుడితో షికార్లు - హాట్ బ్యూటీ మౌనీరాయ్‌ని ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు

US Tariffs | భారత్‌పై 100 శాతం టారిఫ్‌లు.. మద్దతు తెలిపిన యూఎస్ సెనేటర్లు





