త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

JBL | విద్యార్థిని చెవిలో పేలిన ఇయ‌ర్ బ‌డ్స్‌.. స్పందించిన జేబీఎల్ కంపెనీ..

JBL | కేబుల్స్ లేకుండా వైర్ లెస్ విధానంలో క‌నెక్టివిటీని అందిస్తుండ‌డంతో ప్ర‌స్తుతం ఇయ‌ర్ బడ్స్ వాడ‌కం పెరిగింది. ఒక‌ప్పుడు ఉన్న ఇయ‌ర్ ఫోన్స్ స్థానంలో ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వినియోగ‌దారులు ఇయ‌ర్ బ‌డ్స్‌ను ఉప‌యోగిస్తున్నారు. వీటిని ధ‌రించ‌డం సుల‌భం కావ‌డ‌మే కాకుండా ఆధునిక టెక్నాల‌జీతో రూపొందిస్తున్నందున ఆడియో క్వాలిటీ కూడా ఉంటోంది.

S

National | Published On Apr 12, 2026, 4.09 pm IST

JBL | విద్యార్థిని చెవిలో పేలిన ఇయ‌ర్ బ‌డ్స్‌.. స్పందించిన జేబీఎల్ కంపెనీ..
Advertisement

JBL | కేబుల్స్ లేకుండా వైర్ లెస్ విధానంలో క‌నెక్టివిటీని అందిస్తుండ‌డంతో ప్ర‌స్తుతం ఇయ‌ర్ బడ్స్ వాడ‌కం పెరిగింది. ఒక‌ప్పుడు ఉన్న ఇయ‌ర్ ఫోన్స్ స్థానంలో ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వినియోగ‌దారులు ఇయ‌ర్ బ‌డ్స్‌ను ఉప‌యోగిస్తున్నారు. వీటిని ధ‌రించ‌డం సుల‌భం కావ‌డ‌మే కాకుండా ఆధునిక టెక్నాల‌జీతో రూపొందిస్తున్నందున ఆడియో క్వాలిటీ కూడా ఉంటోంది. అలాగే త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తున్నాయి. అయితే ఈ డివైస్‌ల భ‌ద్ర‌త‌పై ప్ర‌స్తుతం సందేహాలు నెల‌కొన్నాయి. రాజ‌స్థాన్‌లో ఓ విద్యార్థిని చెవిలో ఇయ‌ర్ బ‌డ్స్ పేలాయి. ఆమెకు స్వ‌ల్ప గాయాలే అయిన‌ప్ప‌టికీ ఈ ఘ‌ట‌న‌తో మారోమారు ఎల‌క్ట్రానిక్ ప‌రిరాల సేఫ్టీపై అంద‌రిలోనూ అనుమానాలు ఏర్ప‌డుతున్నాయి.

విద్యార్థిని చెవిలో గాయం..

రాజస్థాన్‌కు చెందిన ఓ విద్యార్థిని త‌న సోద‌రి త‌న‌కు బ‌హుమ‌తిగా ఇచ్చిన జేబీఎల్ (JBL) అనే ఆడియో ఉత్ప‌త్తుల తయారీ సంస్థ‌కు చెందిన ట్యూన్ బీమ్ 2 అనే ఇయ‌ర్ బ‌డ్స్‌ను నెల రోజుల నుంచి ఉప‌యోగిస్తున్న‌ట్లు త‌న ఎక్స్ ఖాతాలో తెలిపింది. అయితే ఇటీవ‌ల ఆమె ఆ ఇయ‌ర్ బ‌డ్స్‌ను ధ‌రించి సాధార‌ణ స్థాయి వాల్యూమ్‌తో కేవ‌లం 15 నిమిషాల పాటు సంగీతం విన్నాన‌ని, ఆ స‌మ‌యంలో కుడి చెవిలో ఉన్న ఇయ‌ర్ బ‌డ్ ఒక్క‌సారిగా ప‌నిచేయ‌డం ఆగి డ్రిల్లింగ్ మెషిన్ లాంటి సౌండ్ వ‌చ్చింద‌ని, త‌రువాత వెంట‌నే అది పేలిపోయింద‌ని, దీంతో త‌న చెవికి గాయ‌మ‌వ్వ‌గా ఈఎన్‌టీ నిపుణుడిని సంప్ర‌దించిన‌ట్లు తెలిపింది. వైద్యుడు ఆమెను ప‌రీక్షించి చెవి డ్ర‌మ్ (టింపానిక్ మెంబ్రేన్)లో వాపు ఏర్ప‌డింద‌ని చెప్పాడ‌ని వివ‌రించింది. కాగా ఈ ఘ‌ట‌న‌కు చెందిన ఫొటోల‌తోపాటు వైద్యుడి ప్రిస్క్రిప్షన్‌ను కూడా ఆమె షేర్ చేసింది. దీంతో ఆమె పోస్టు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

https://twitter.com/Capybara2233_/status/2041982180356976774

స్పందించిన జేబీఎల్‌..

ఈ సంఘ‌ట‌న‌పై జేబీఎల్ సంస్థ స్పందించింది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేసినందుకు ఆ విద్యార్థినికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నామ‌ని పేర్కొంది. ఆమె పోస్టుల‌ను ప‌రిశీలించామ‌ని, విష‌యాన్ని తమ భార‌తీయ ప్ర‌తినిధుల‌కు చేర‌వేశామ‌ని, వారు ఆ విద్యార్థినితో నేరుగా సంప్ర‌దింపులు జ‌రుపుతార‌ని సంస్థ తెలియ‌జేసింది. కాగా ఈ ఘ‌ట‌న‌పై సామాజిక మాధ్య‌మాల్లో నెటిజన్లు స్పందించారు. ఆమెను వినియోగ‌దారుల ఫోరంలో కేసు వేయాల‌ని కొంద‌రు సూచించ‌గా, ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల‌ను వాడే స‌మ‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కొంద‌రు చెప్పారు. అలాగే ఇలాంటి డివైస్‌ల త‌యారీలో సంస్థ‌ల‌కు కేంద్రం క‌చ్చిత‌మైన మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించేలా ఆదేశాలు జారీ చేయాల‌ని, వినియోగ‌దారుల సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌ను రూపొందించాల‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డ్డారు.

Advertisement
Advertisement