Tata Play Smart | ఇక సెట్‌టాప్ బాక్స్ అవసరం లేదు.. రూ.199కే 500కు పైగా టీవీ ఛానల్స్..
Tata Play Smart | టాటా ప్లే వినియోగదారుల కోసం సరికొత్త స్ట్రీమింగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. టాటా ప్లే స్మార్ట్ పేరుతో ఈ యాప్‌ను ప్రారంభించింది. దీని ద్వారా సెట్‌టాప్ బాక్స్, డిష్ యాంటెన్నా, వైర్లు లేకుండానే స్మార్ట్ టీవీల్లో 500కు పైగా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు.. నేరుగా టీవీలోనే ఛానళ్లను చూసే అవకాశం కల్పిస్తోంది.
Technology | Published On Oct 15, 2026, 3.49 pm IST
Tata Play Smart | టాటా ప్లే వినియోగదారుల కోసం సరికొత్త స్ట్రీమింగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. టాటా ప్లే స్మార్ట్ పేరుతో ఈ యాప్‌ను ప్రారంభించింది. దీని ద్వారా సెట్‌టాప్ బాక్స్, డిష్ యాంటెన్నా, వైర్లు లేకుండానే స్మార్ట్ టీవీల్లో 500కు పైగా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు.. నేరుగా టీవీలోనే ఛానళ్లను చూసే అవకాశం కల్పిస్తోంది. ఈ యాప్ ప్రారంభ ప్రచార కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు తండ్రి, కుమార్తె అనే రెండు పాత్రల్లో కనిపించారు. ఈ ప్రచార కార్యక్రమానికి ఓగిల్వీ సంస్థ రూపకల్పన చేసి అమలు చేయగా, అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు.
ఇంటర్నెట్ ఉంటే చాలు..
టాటా ప్లే స్మార్ట్ యాప్‌ను వినియోగదారులు తమ స్మార్ట్ టీవీలోని యాప్ స్టోర్ నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే డీటీహెచ్ సేవలను ఉపయోగిస్తున్నా, కేబుల్ కనెక్షన్ ఉన్నా, లేదా ఎలాంటి చెల్లింపు టీవీ సేవలు లేకపోయినా ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇంటి బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌తోపాటు అనుకూలమైన ఇతర ఇంటర్నెట్ కనెక్షన్ల ద్వారా కూడా లైవ్ టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. స్మార్ట్ టీవీల్లో ఈ యాప్‌ను ఉపయోగించేందుకు వీలుగా ఛానల్ నంబర్లు, కార్యక్రమాల గైడ్, టీవీ రిమోట్‌తో సులభంగా పనిచేసే నియంత్రణలను అందించారు. కొన్ని ఛానళ్లు, కార్యక్రమాలకు సంబంధించి ప్రసారం పూర్తయిన తర్వాత కూడా వాటిని చూసే అవకాశం ఉంటుంది. అయితే ఈ సదుపాయం సంబంధిత ప్రసారకర్త, కార్యక్రమాన్ని బట్టి మారుతుంది.
ఫోన్లలోనూ వాడుకోవచ్చు..
టాటా ప్లే స్మార్ట్‌లో ప్రస్తుతం నెలకు రూ.199 ధరతో ఒక గృహ వినియోగ ప్లాన్‌ను అందిస్తున్నారు. వినియోగదారులు తమకు నచ్చిన భాషల్లో కంటెంట్‌ను వీక్షించేందుకు భాషలను ఎంచుకోవచ్చు. ఈ యాప్ శాంసంగ్, ఆండ్రాయిడ్ టీవీ, విడా, గూగుల్ టీవీ, ఫైర్ టీవీ ప్లాట్‌ఫామ్‌లపై అందుబాటులో ఉంది. అలాగే ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లలోనూ ఉపయోగించుకోవచ్చు. అనుకూలమైన పరికరాల్లో ఇంటర్నెట్ సహాయంతో టీవీ కార్యక్రమాలను వీక్షించవచ్చు. యాప్ వివరాలు, ప్లాన్ల కోసం టాటా ప్లే స్మార్ట్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
టాటా ప్లే స్మార్ట్ ప్రారంభం సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హరిత్ నాగ్‌పాల్ మాట్లాడుతూ.. స్మార్ట్ టీవీలు, హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సేవల కారణంగా కంటెంట్‌ను యాక్సెస్ చేసే విధానం మారినప్పటికీ, పెద్ద తెరపై క్రీడలు, వార్తలు, రోజువారీ ధారావాహికలను ప్రత్యక్షంగా వీక్షించాలనే వినియోగదారుల ప్రాథమిక అవసరం మాత్రం మారలేదని పేర్కొన్నారు. డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) సేవలు విస్తృత ప్రజానీకానికి చేరువవుతున్నాయని, అదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్షన్లు కలిగిన ఇళ్లలో వినోదం, సమాచార అవసరాలను తీర్చేందుకు టాటా ప్లే స్మార్ట్ను రూపొందించినట్లు తెలిపారు.
సంబంధిత వార్తలు

Sai Pallavi | రామాయణ రిలీజ్ ముంగిట తెలుగు టాక్ షోకు గెస్ట్‌గా సాయిపల్లవి – జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 ప్రారంభం
అక్టోబర్ 13, 2026

TFCC | తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాజుకున్న వివాదం.. సెప్టెంబర్ నుంచి సినిమాల రిలీజ్ బంద్..!
ఆగస్టు 22, 2026

Trisha | ఓటీటీలో త్రిష మూవీ ట్రెండింగ్ – నేషనల్ వైడ్‌గా నంబర్ వన్
జూన్ 14, 2026
తాజావార్తలు
- ●Anupama Parameswaran | పెళ్లికి ముందే బిడ్డను కనాలనుంది - అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్
- ●Ponnam Prabhakar | చేనేత ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలి
- ●Dasoju Sravan Kumar | కేటీఆర్ బొచ్చుపై రాజకీయం చేస్తే కరెంట్ రాదు
- ●Abhijeet Dipke CJP | జ్ఞానేష్ కుమార్ కోసం సొంత దేశ ప్రజలపైనే యుద్ధం చేస్తున్నారు
- ●ICICI Lombard | ఐసీఐసీఐ లాంబార్డ్ షేర్హోల్డర్లకు గుడ్‌న్యూస్.. ఒక్కో షేరుపై రూ.7 డివిడెండ్..
- ●Rashmika Mandanna | రష్మిక మందన్న మంచి మనసు - నాలుగు వందల కుటుంబాలకు సాయం - విజయ్ ప్రశంసలు

Anupama Parameswaran | పెళ్లికి ముందే బిడ్డను కనాలనుంది - అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్

Ponnam Prabhakar | చేనేత ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలి

Dasoju Sravan Kumar | కేటీఆర్ బొచ్చుపై రాజకీయం చేస్తే కరెంట్ రాదు

Abhijeet Dipke CJP | జ్ఞానేష్ కుమార్ కోసం సొంత దేశ ప్రజలపైనే యుద్ధం చేస్తున్నారు



