Sai Pallavi | రామాయణ రిలీజ్ ముంగిట తెలుగు టాక్ షోకు గెస్ట్‌గా సాయిపల్లవి – జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 ప్రారంభం
టాలీవుడ్ సీనియర్ హీరో జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షో సెకండ్ సీజన్ ప్రారంభం కాబోతుంది. అక్టోబర్ 16 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్‌కు సాయిపల్లవి గెస్ట్‌గా రాబోతుంది. రామాయణ రిలీజ్ ముంగిట సాయిపల్లవి ఈ షోలోకు హాజరుకావడం అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
Entertainment | Published On Oct 13, 2026, 5.35 pm IST
Sai Pallavi |జీ తెలుగు పాపులర్ సెలబ్రిటీ టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి’ సెకండ్ సీజన్ ప్రారంభం కానుంది. ఈ రెండో సీజన్‌లో ఫస్ట్ ఎపిసోడ్‌కు నాచురల్ బ్యూటీ సాయి పల్లవి గెస్ట్ గా హాజరుకానుంది. సహజమైన నటనతో, ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో దక్షిణాదితో పాటు బాలీవుడ్ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న సాయి పల్లవి.. ఈ షో గ్రాండ్ లాంఛ్ ఎపిసోడ్‌లో సందడి చేయనున్నారు.
అక్కినేని నాగార్జున, శ్రీలీల...
ప్రముఖ నటుడు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షో తారల వ్యక్తిగత జీవితాల్లోని ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తొలి సీజన్‌లో అక్కినేని నాగార్జున, శ్రీలీల వంటి ప్రముఖులు అతిథులుగా ఈ షోలో సందడి చేశారు. హోస్ట్ జగపతిబాబు, సెలబ్రిటీల మధ్య జరిగే సహజమైన సంభాషణలే ఈ షోకు హైలైట్‌గా నిలిచాయి. తమ జీవితాలను మలుపు తిప్పిన అనుభవాలు, ఇప్పటివరకు పెద్దగా బయటకు రాని జ్ఞాపకాలు, తమ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు, మరచిపోలేని సంఘటనల గురించి సెలబ్రిటీలు మనసు విప్పి మాట్లాడే అవకాశాన్ని ఈ షో కల్పిస్తోంది. అదే పంథాలో సెకండ్ సీజన్ కూడా సాగబోతుంది.
రామాయణ రిలీజ్ ...
రామాయణ రిలీజ్‌కు ముందు ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షో షోకు సాయిపల్లవి గెస్ట్‌గా హాజరుకానుండటం ఆసక్తికరంగా మారింది. ఈ మైథాలజీ మూవీలో సీత పాత్రలో కనిపించబోతుంది. ఈ షోలో రామాయణ మూవీ గురించి సాయిపల్లవి ఏం చెబుతుందన్నది అభిమానుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.తన సినీ ప్రయాణం, తన సినీ జీవితం, వ్యక్తిగత జీవితం గురించి ఇప్పటివరకు ప్రేక్షకులకు పెద్దగా తెలియని పలు ఆసక్తికరమైన విషయాలను ఈ షోలో వెల్లడించినట్లు సమాచారం.
ప్రోమో ...
ఫస్ట్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. "మనం ఫస్ట్ టైమ్ కలుస్తున్నాం కదా"..అని జగపతిబాబు అడగ్గా.."ఇంతకుముందు మనం కాల్‌లో మాట్లాడాం "అని సాయిపల్లవి బదులిచ్చింది. అమ్మ నమస్కారం ఆ మెమోరీ వద్దు అని జగపతిబాబు సరదాగా చెప్పారు. జగపతిబాబు చూపించిన ఓ ఫొటో చూసి ఓ మై గాడ్ అంటూ సాయిపల్లవి షాకయ్యింది. అది ఏమిటన్నది చూపించలేదు.
‘జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి’ రెండో సీజన్ అక్టోబర్ 16 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. సాయిపల్లవి ఎపిసోడ్ అక్టోబర్ 18న ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు జీ తెలుగు టీవీలో ప్రసారం కాబోతుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●NMMS | నవంబర్ 1న ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ పరీక్ష
- ●India Inflation | ద్రవ్యోల్బణం 23 నెలల గరిష్ఠానికి.. భారీగా పెరగనున్న వడ్డీ రేట్లు..?
- ●Aishwarya | నడుచుకుంటూ హాస్పిటల్‌కు వెళ్లిన అమ్మాయి.. చనిపోయింది
- ●Navaratri Brahmotsavam | చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా శ్రీవారు.. తిరుమలలో బ్రహ్మోత్సవ వైభవం!
- ●Malayalam OTT | ఓటీటీలోకి మణిరత్నం హీరోయిన్ మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ -బట్టర్ఫ్లై ఎఫెక్ట్ తో
- ●HP Festive Offers | ల్యాప్‌టాప్‌లపై హెచ్‌పీ ఫెస్టివ్ ఆఫర్లు.. రూ.20వేల వరకు డిస్కౌంట్..

NMMS | నవంబర్ 1న ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ పరీక్ష

India Inflation | ద్రవ్యోల్బణం 23 నెలల గరిష్ఠానికి.. భారీగా పెరగనున్న వడ్డీ రేట్లు..?

Aishwarya | నడుచుకుంటూ హాస్పిటల్‌కు వెళ్లిన అమ్మాయి.. చనిపోయింది

Navaratri Brahmotsavam | చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా శ్రీవారు.. తిరుమలలో బ్రహ్మోత్సవ వైభవం!






