త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | చేనేత ఉత్పత్తుల‌కు విస్తృత మార్కెటింగ్ అవ‌కాశాలు క‌ల్పించాలి

Ponnam Prabhakar | రాష్ట్రవ్యాప్తంగా చేనేత ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

S

Flash news | Published On Oct 15, 2026, 3.48 pm IST

Ponnam Prabhakar | చేనేత ఉత్పత్తుల‌కు విస్తృత మార్కెటింగ్ అవ‌కాశాలు క‌ల్పించాలి
Advertisement
  • తెలంగాణ చేనే అభివృద్ధి కార్పొరేష‌న్ నూత‌న కార్యాల‌య ప్రారంభోత్స‌వంలో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

Ponnam Prabhakar | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రవ్యాప్తంగా చేనేత ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చేనేత కార్మికులకు మెరుగైన ఉపాధి, ఆర్థిక ప్రయోజనాలు కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. తెలంగాణ చేనేత వస్త్రాలకు రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలని అభిప్రాయ‌ప‌డ్డారు. నాంపల్లిలోని చేనేత భవన్ లో తెలంగాణ చేనేత అభివృద్ధి కార్పొరేషన్ నూతన కార్యాలయాన్ని మంత్రి పొన్నం గురువారం ప్రారంభించారు. కార్పొరేష‌న్ చైర్మెన్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన దూడం వెంక‌ట‌ర‌మ‌ణ‌ను అభినందించారు.

అనంత‌రం పొన్నం మాట్లాడుతూ దేవాలయాల్లో, అధికారిక కార్యక్రమాల్లో, ఉపాధ్యాయులు, ప్రముఖుల సన్మానాల్లో సాధారణ సిల్క్ శాలువాలకు బదులుగా చేనేత శాలువాలను వినియోగించాలని పిలుపునిచ్చారు. రాజకీయ నాయకులు పరస్పరం గౌరవించుకునే కార్యక్రమాల్లోనూ చేనేత శాలువాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. చేనేత వస్త్రాల వినియోగాన్ని ప్రోత్సహించేలా అన్ని ప్రభుత్వ శాఖలకు తగిన సూచనలు, మార్గదర్శకాలు జారీ చేయాలని అన్నారు. ముడిసరుకు నుంచి వస్త్రాల తయారీ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వరకు చేనేత రంగంలోని ప్రతి వర్గానికీ ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

చేనేత కార్మికుల ఉత్పత్తులకు సరైన మార్కెట్ కల్పించి, వారి కష్టానికి తగిన ప్రతిఫలం అందేలా చూడాలని అభిప్రాయ‌ప‌డ్డారు. చేనేత రంగ అభివృద్ధి ద్వారా కార్మికులకు ఆర్థిక భద్రతతో పాటు సామాజికంగా గౌరవప్రదమైన జీవనం కల్పిస్తున్నామ‌ని వివ‌రించారు. విద్యార్థి దశ నుంచి రాజకీయ జీవితంలో కష్టపడి పనిచేసిన స్ఫూర్తితో, కార్పొరేష‌న్ నూతన చైర్మన్ చేనేత రంగ అభివృద్ధికి మరింత అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

Advertisement
Advertisement