త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rashmika Mandanna | ర‌ష్మిక మంద‌న్న మంచి మ‌న‌సు – నాలుగు వంద‌ల కుటుంబాల‌కు సాయం – విజ‌య్ ప్ర‌శంస‌లు

ర‌ణ‌బాలి రిలీజ్ ముంగిట నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న త‌న మంచి మ‌న‌సును చాటుకుంది. ర‌ణ‌బాలిలోని జ‌య‌మ్మ పాత్ర స్ఫూర్తితో నాలుగు వంద‌ల కుటుంబాల‌కు సాయం చేసింది. ర‌ష్మిక సేవా కార్య‌క్ర‌మంపై విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌శంస‌లు కురిపించారు.

N

Entertainment | Published On Oct 15, 2026, 3.13 pm IST

Rashmika Mandanna | ర‌ష్మిక మంద‌న్న మంచి మ‌న‌సు – నాలుగు వంద‌ల కుటుంబాల‌కు సాయం – విజ‌య్ ప్ర‌శంస‌లు
Advertisement

Rashmika Mandanna | నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న త‌న మంచి మ‌న‌సుపై టాలీవుడ్ ప్ర‌ముఖుల‌తో పాటు నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ర‌ణ‌బాలిలోని జ‌య‌మ్మ పాత్ర స్ఫూర్తితో నాలుగు వంద‌ల కుటుంబాల‌కు సాయం చేసింది. పెళ్లి త‌ర్వాత భ‌ర్త విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తోన్న ర‌ణ‌బాలి అక్టోబ‌ర్ 16న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. హిస్టారిక‌ల్ యాక్ష‌న్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.
ర‌ణ‌బాలి రిలీజ్‌ సంద‌ర్భంగా ర‌ష్మిక మంద‌న్న త‌న‌లోని సేవా గుణాన్ని చాటుకుంది. . ఈ హిస్టారిక‌ల్ మూవీలో జ‌య‌మ్మ అనే పాత్ర‌లో ర‌ష్మిక న‌టించింది. ఈ పాత్ర స్ఫూర్తితోనే అన్న‌పూర్ణ పేరుతో సేవా కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. నాలుగు వంద‌ల కుటుంబాల‌కు మూడు నెల‌ల‌కు స‌రిప‌డా నిత్యావ‌స‌ర వ‌స్తువులు అంద‌జేసింది. ఏడాది పాటు ఈ సేవా కార్య‌క్ర‌మాన్ని కొన‌సాగిస్తాన‌ని వెల్ల‌డించింది.

నాలుగు వంద‌ల కుటుంబాల‌కు సాయం...

హీరోయిన్ రశ్మిక స్పందిస్తూ - "జయమ్మ పాత్రతో నా రియ‌ల్ చాలా ద‌గ్గ‌రి పోలిక‌లు ఉన్నాయి. ద‌ర్శ‌కుడు క‌థ చెప్పిన‌ప్పుడే ఈ పాత్ర‌కు చాలా క‌నెక్ట్ అయిపోయా. జ‌య‌మ్మ స్ఫూర్తితోనే సేవా కార్య‌క్ర‌మాన్ని మొద‌లుపెట్టాను. అభిమానులు నాపై చూపించే ప్రేమకు కృతజ్ఞతగా ఇలాంటి మంచి ప‌నులు చేయాల‌ని అనిపించింది. ఎవరికీ చెప్పకూడ‌ద‌ని అనుకున్నా. నాకు, నా టీమ్ కు తెలిస్తే చాలు అనిపించింది. .నేను చేస్తోన్న ఈ చిన్న సేవా కార్యక్రమం చాలా మందిలో స్ఫూర్తి నింపుతుంద‌నే కారణంతో ఇప్పుడు అంద‌రికి చెబుతున్నాను. రాష్ట్రంలోని ఎనిమిది ప్రాంతాల‌కు చెందిన 400 కుటుంబాలను దత్తత తీసుకున్నాను. వారికి ప్రతి 3 నెలల చొప్పున సహాయం చేస్తూ, ఏడాది పొడవునా దీనిని కొనసాగించాలనుకుంటున్నాను" అని చెప్పింది.

గ‌ర్వ‌ప‌డుతున్నా...

ర‌ష్మిక సేవా గుణంపై భ‌ర్త విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌శంస‌లు కురిపించారు. ఇలాంటి మంచి ప‌నులు ర‌ష్మిక ఎప్పటి నుంచో చేస్తోంద‌ని, కానీ ఎవరికీ తెలియనివ్వలేద‌ని అన్నారు. "అన్నపూర్ణ ప్రాజెక్ట్ ఏడాది పాటు 400 కుటుంబాలకు అండగా నిలబడుతుంది. నీ మంచి మనసుకు గర్వపడుతున్నా. మనం ఎదగడమే కాదు మన వాళ్ల కోసం నిలబడదాం" అంటూ విజ‌య్ దేవ‌ర‌కొండ పేర్కొన్నారు.

ర‌ణ‌బాలి కంటే ముందు గీత‌గోవిందం, డియ‌ర్ కామ్రేడ్ సినిమాల్లో జంట‌గా న‌టించారు విజ‌య్‌, ర‌ష్మిక‌. దాదాపు 120 కోట్ల బ‌డ్జెట్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమానునిర్మించింది.

 

Advertisement
Advertisement