Trisha | ఓటీటీలో త్రిష మూవీ ట్రెండింగ్ – నేషనల్ వైడ్‌గా నంబర్ వన్
త్రిష కరుప్పు మూవీ ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైన ఈ మూవీ నేషనల్ వైడ్‌గా టాప్ ట్రెండింగ్ మూవీస్ లిస్ట్‌లో నంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది. కరుప్పు మూవీలో సూర్య హీరోగా నటించగా...ఆర్‌జే బాలాజీ దర్శకత్వం వహించాడు.
Entertainment | Published On Jun 14, 2026, 4.37 pm IST
Trisha | సూర్య, త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన కరుప్పు మూవీ థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఫాంటసీ యాక్షన్‌గా రూపొందిన ఈ మూవీ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ప్రస్తుతం ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో నేషనల్ వైడ్ టాప్ ట్రెండింగ్ మూవీస్ లిస్ట్‌లో నంబర్ వన్ ప్లేస్‌లో కరుప్పు నిలిచింది. ఈ వీక్ అమెజాన్ ప్రైమ్‌లో హయ్యెస్ట్ వ్యూస్ వచ్చిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఓటీటీలోనూ కరుప్పు సూపర్‌హిట్‌గా నిలవడంతో మేకర్స్ ఫుల్ ఖుషీ అవుతోన్నారు.
350 కోట్ల కలెక్షన్స్...
కరుప్పు మూవీకి ఆర్‌జే బాలాజీ దర్శకత్వం వహిస్తూనే ఈ సినిమాలో విలన్‌గా నటించాడు. ఇంద్రాన్స్, నట్టీ సుబ్రమణియన్, శిశ్విత కీలక పాత్రల్లో కనిపించారు. 140 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేటర్లలో 350 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాది హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన తమిళ సినిమాగా కరుప్పు నిలిచింది.
నెగెటివ్ కామెంట్స్...
కరుప్పుతో దాదాపు పదేళ్ల తర్వాత బిగ్గెస్ట్ సక్సెస్‌ను అందుకున్నారు సూర్య. ఈ సినిమాలో సూర్య, త్రిష యాక్టింగ్, మాస్ ఎలిమెంట్స్ తో పాటు సాయి అభ్యంకర్ మ్యూజిక్ అభిమానులను ఆకట్టుకున్నాయి. స్టోరీ మాత్రం రొటీన్ అంటూ నెగెటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి.
తెలుగులోకి డబ్...
కరుప్పు మూవీ వీరభద్రుడు పేరుతో తెలుగులోకి డబ్ అయ్యింది.ఈ డబ్బింగ్ వెర్షన్ కూడా నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. కరుప్పు మూవీకి సీక్వెల్ రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వీరభద్రుడి న్యాయం...
మీను (శిశ్విత) అరుదైన వ్యాధితో బాధపడుతుంది. తన దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మి కూతురి ప్రాణాలు కాపాడుకోవాలని మీను తండ్రి అనుకుంటాడు. కానీ ఆ బంగారాన్ని మీను దగ్గర నుంచి దొంగలు ఎత్తుకెళతారు. పోలీసులు ఆ దొంగలను పట్టుకుంటారు. కోర్టులో ఉన్న బంగారం మీనుతో పాటు ఆమె తండ్రికి దక్కకుండా చేయాలని లాయర్ బేబీ కృష్ణ (ఆర్‌జే బాలాజీ) కుట్రలు పన్నుతాడు. వారికి వీరభద్ర స్వామి (సూర్య) ఎలా సాయం చేశాడు? ఈ పోరాటంలో అతడికి అండగా నిలిచిన లాయర్ ప్రీతి (త్రిష) ఎవరు అన్నదే ఈ మూవీ కథ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Tata Play Smart | ఇక సెట్‌టాప్ బాక్స్ అవసరం లేదు.. రూ.199కే 500కు పైగా టీవీ ఛానల్స్..
అక్టోబర్ 15, 2026

Sai Pallavi | రామాయణ రిలీజ్ ముంగిట తెలుగు టాక్ షోకు గెస్ట్‌గా సాయిపల్లవి – జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 ప్రారంభం
అక్టోబర్ 13, 2026

OTT Releases | ఈ వారం ఓటీటీలో చూడాల్సిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే – ఈ మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీ స్పెషల్
అక్టోబర్ 9, 2026
తాజావార్తలు
- ●Auraiya UP Viral Engagement Video | 75 ఏళ్ల వరుడు, 30 ఏళ్ల వధువు.. కూతురి ఫ్రెండ్‌తోనే పెళ్లి : వీడియో వైరల్
- ●KTR Letter to Revanth Reddy | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపండి.. రేవంత్‌రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ
- ●TTD January 2027 Quota Release Dates | తిరుమల భక్తులకు అలర్ట్: 2027 జనవరి నెల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల షెడ్యూల్ విడుదల
- ●Sreeleela | శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ మూవీకి తొలగిన అడ్డంకులు - రిలీజ్ మరింత ఆలస్యం
- ●Harish Rao | రేవంత్! నీ వల్ల 3 వేల రైతు కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి ఉంది
- ●Telangana El Nino All Party Meeting | తెలంగాణపై 'ఎల్ నినో' ప్రభావం: రేపు డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం

Auraiya UP Viral Engagement Video | 75 ఏళ్ల వరుడు, 30 ఏళ్ల వధువు.. కూతురి ఫ్రెండ్‌తోనే పెళ్లి : వీడియో వైరల్

KTR Letter to Revanth Reddy | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపండి.. రేవంత్‌రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ

TTD January 2027 Quota Release Dates | తిరుమల భక్తులకు అలర్ట్: 2027 జనవరి నెల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల షెడ్యూల్ విడుదల

Sreeleela | శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ మూవీకి తొలగిన అడ్డంకులు - రిలీజ్ మరింత ఆలస్యం



