TFCC | తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాజుకున్న వివాదం.. సెప్టెంబర్ నుంచి సినిమాల రిలీజ్ బంద్..!
TFCC | తమిళ చిత్ర పరిశ్రమలో మరోసారి విభేదాలు రాజుకున్నాయి. థియేటర్లలో విడుదలైన సినిమాలను ఓటీటీ వేదికలపై ఎప్పుడు స్ట్రీమింగ్ చేయాలన్న అంశం నిర్మాతలు, థియేటర్ యాజమాన్యాల మధ్య వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ ఒకటి నుంచి కొత్త చిత్రాల విడుదలను నిలిపివేయాలని తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్‌పీసీ) నిర్ణయించింది.
Entertainment | Published On Aug 22, 2026, 6.52 pm IST
TFCC | తమిళ చిత్ర పరిశ్రమలో మరోసారి విభేదాలు రాజుకున్నాయి. థియేటర్లలో విడుదలైన సినిమాలను ఓటీటీ వేదికలపై ఎప్పుడు స్ట్రీమింగ్ చేయాలన్న అంశం నిర్మాతలు, థియేటర్ యాజమాన్యాల మధ్య వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ ఒకటి నుంచి కొత్త చిత్రాల విడుదలను నిలిపివేయాలని తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్‌పీసీ) నిర్ణయించింది. థియేటర్లలో సినిమా విడుదలైన తర్వాత కనీసం ఎనిమిది వారాలు పూర్తయిన తరువాతే ఓటీటీలో స్ట్రీమింగ్‌కు అనుమతించాలని థియేటర్ యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. సినిమాలు థియేటర్లలోకి వచ్చిన కొద్ది వారాలకే ఓటీటీలో అందుబాటులోకి వస్తుండటంతో ప్రేక్షకుల రాక తగ్గుతోందని థియేటర్ నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో తమ ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు నిర్మాతలు మాత్రం ఓటీటీ ఒప్పందాలు, చిత్రాల మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా విడుదల తేదీలను నిర్ణయించుకునే విషయంలో స్వేచ్ఛ ఉండాలని భావిస్తున్నారు. థియేటర్ విడుదల, ఓటీటీ స్ట్రీమింగ్ మధ్య తప్పనిసరి విరామాన్ని ఎక్కువ కాలానికి పెంచడం తమ వాణిజ్య ప్రయోజనాలపై ప్రభావం చూపుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, తమిళనాడు థియేటర్ యజమానుల సంఘం ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. అయితే, ఓటీటీ స్ట్రీమింగ్ కాలపరిమితిపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యకు పరిష్కారం లభించే వరకు కొత్త చిత్రాలను థియేటర్లలో విడుదల చేయకూడదని స్పష్టం చేసింది.
అయితే, ఈ నిర్ణయం పూర్తిస్థాయి సినిమా బంద్ కాదని టీఎఫ్‌పీసీ తెలిపింది. షూటింగ్‌లు, నిర్మాణ పనులు, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించింది. కేవలం కొత్త చిత్రాల థియేటర్ విడుదలలపైనే నిర్ణయం ప్రభావం చూపనుంది. సెప్టెంబర్ ఒకటి నుంచి విడుదలలు నిలిచిపోతే ఆ నెలలో థియేటర్లకు రావాల్సిన పలు చిత్రాల షెడ్యూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. సమస్య త్వరగా పరిష్కారం కాకపోతే ఆ తర్వాతి నెలల్లో విడుదలకు సిద్ధమవుతున్న సినిమాలపైనా దీని ప్రభావం పడొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాల మధ్య తదుపరి చర్చలు కీలకంగా మారాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Tata Play Smart | ఇక సెట్‌టాప్ బాక్స్ అవసరం లేదు.. రూ.199కే 500కు పైగా టీవీ ఛానల్స్..
అక్టోబర్ 15, 2026

Diwali Bonus | రైల్వే ఉద్యోగులకు కేంద్రం దీపావళి కానుక.. 11.40 లక్షల మందికి ప్రయోజనం..!
అక్టోబర్ 14, 2026

Indian Embassy Advisory | రియాద్‌కు విమాన సర్వీసులు బంద్.. భారతీయులకు ఎంబసీ అడ్వైజరీ
అక్టోబర్ 14, 2026
తాజావార్తలు
- ●Auraiya UP Viral Engagement Video | 75 ఏళ్ల వరుడు, 30 ఏళ్ల వధువు.. కూతురి ఫ్రెండ్‌తోనే పెళ్లి : వీడియో వైరల్
- ●KTR Letter to Revanth Reddy | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపండి.. రేవంత్‌రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ
- ●TTD January 2027 Quota Release Dates | తిరుమల భక్తులకు అలర్ట్: 2027 జనవరి నెల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల షెడ్యూల్ విడుదల
- ●Sreeleela | శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ మూవీకి తొలగిన అడ్డంకులు - రిలీజ్ మరింత ఆలస్యం
- ●Harish Rao | రేవంత్! నీ వల్ల 3 వేల రైతు కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి ఉంది
- ●Telangana El Nino All Party Meeting | తెలంగాణపై 'ఎల్ నినో' ప్రభావం: రేపు డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం

Auraiya UP Viral Engagement Video | 75 ఏళ్ల వరుడు, 30 ఏళ్ల వధువు.. కూతురి ఫ్రెండ్‌తోనే పెళ్లి : వీడియో వైరల్

KTR Letter to Revanth Reddy | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపండి.. రేవంత్‌రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ

TTD January 2027 Quota Release Dates | తిరుమల భక్తులకు అలర్ట్: 2027 జనవరి నెల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల షెడ్యూల్ విడుదల

Sreeleela | శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ మూవీకి తొలగిన అడ్డంకులు - రిలీజ్ మరింత ఆలస్యం



