త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anupama Parameswaran | పెళ్లికి ముందే బిడ్డ‌ను క‌నాల‌నుంది – అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కామెంట్స్

తెలంగాణ నేప‌థ్యంలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టించిన క్రేజీ క‌ళ్యాణం మూవీ అక్టోబ‌ర్ రిలీజ్ కాబోతుంది. భ‌ద్ర‌ప్ప గాజుల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో త‌రుణ్ భాస్క‌ర్‌, అఖిల్ కీల‌క పాత్ర‌లు పోషించారు. క్రేజీ క‌ళ్యాణం రిలీజ్ సంద‌ర్భంగా ఈ సినిమాతో పాటు త‌న కెరీర్‌, వ్య‌క్తిగ‌త జీవితం గురించి అనుప‌మ చెప్పిన ముచ్చ‌ట్లివి...

N

Entertainment | Published On Oct 15, 2026, 3.52 pm IST

Anupama Parameswaran | పెళ్లికి ముందే బిడ్డ‌ను క‌నాల‌నుంది – అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కామెంట్స్
Advertisement

Anupama Parameswaran | రెమ్యూన‌రేష‌న్ కోసం ఆలోచించి సినిమాలు చేయ‌న‌ని అన్న‌ది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. క‌థ‌, పాత్ర‌ల ప‌రంగా ప్ర‌యోగాలు చేయ‌డ‌మే త‌న‌కు ఇష్ట‌మ‌ని తెలిపింది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టించి క్రేజీ క‌ళ్యాణం మూవీ అక్టోబ‌ర్ 16న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. భ‌ద్ర‌ప్ప గాజుల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో సీనియ‌ర్ న‌రేష్, త‌రుణ్ భాస్క‌ర్‌, అఖిల్ రాజ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా గురించి అనుప‌మ చెప్పిన సంగ‌తులివి...

ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో హ్యాపీగా ఉన్నా...

క్రేజీ కల్యాణం సినిమాకు ముందు వేరే వర్కింగ్ టైటిల్ అనుకున్నాం. ఈ సినిమా చేస్తున్న క్ర‌మంలో ప్రతీది క్రేజీగా అనిపించాయి. దాంతో మా డైరెక్టర్ క్రేజీ కల్యాణం అని టైటిల్ బాగుంటుంద‌ని ఫిక్స్ అయ్యారు. వినోదంతో పాటు భావోద్వేగాల క‌ల‌బోత‌గా ఈ సినిమా ఉంటుంది. నాతో పాటు సీనియ‌ర్ న‌రేష్‌, అఖిల్, తరుణ్ భాస్కర్ ప్ర‌తి పాత్ర‌కు ప్రాధాన్య‌ముంటుంది. ప్ర‌స్తుతం వ్య‌క్తిగ‌త జీవితంలో నేను చాలా సంతోషంగా ఉన్నా. అందుకే ప్ర‌మోష‌న్స్‌ను ఎంజాయ్ చేస్తున్నా.

పెళ్లికి ముందే బిడ్డ‌ను క‌నాల‌ని ఉంది...

ఇందులో కీర్తి అనే పాత్ర పోషించా. క్రేజీ క‌ళ్యాణం మూవీ క‌థ నా పెళ్లిచూట్టునే తిరుగుతుంది. చివ‌ర‌కు కీర్తి పెళ్లి జ‌రుగుతుందా? లేదా? అన్న‌ది స్క్రీన్‌పై చూడాల్సిందే. సినిమాలో మాదిరిగా మా ఇంట్లో నా పెళ్లి గురించి ఏమాత్రం ఒత్తిడి లేదు. నీకు ఇష్టమైనప్పుడు పెళ్లి చేసుకోమనే మా అమ్మ‌నాన్న‌లు చెప్పారు. ఆ విష‌యంలో నాకు పూర్తి స్వేచ్ఛ‌నిచ్చారు. నాకైతే పెళ్లికి ముందే ఓ బిడ్డ‌కు త‌ల్లి కావాల‌ని ఉంది. పెళ్లి అనేది ఇద్దరు కలిసి సంతోషంగా జీవించడానికి చేసుకునేది కానీ అమ్మాయిని ఇంట్లో పని మనిషిని చేసేందుకు కాదు అనేది నా క్యారెక్టర్ ఉద్దేశం. వ్యక్తిగతంగా నా అభిప్రాయం కూడా అదే. అందుకే కీర్తి పాత్ర‌తో ఎక్కువ‌గా క‌నెక్ట్ అయిపోయా.

పూర్తిగా వెజ్ క‌ల్చ‌ర్‌...

క్రేజీ క‌ళ్యాణం సినిమాతో తెలంగాణ పెళ్లి వేడుక‌ల సంప్ర‌దాయం గురించి తెలిసింది.కేరళ తో పోలిస్తే చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంది. మా ద‌గ్గ‌ర వివాహా వేడుకల్లో పూర్తిగా శాకాహారమే వడ్డిస్తారు. కేరళలో ఇప్పుడు పెళ్లి వేడుకల్లో హల్దీ, మెహందీ అని కొత్త కొత్త కల్చర్స్ వస్తున్నాయి గానీ గతంలో ఎంగేజ్ మెంట్ , పెళ్లి ఈ రెండే వేడుకలు జరిపేవారు.

ఆర్గానిక్ కామెడీ...

క్రేజీ కల్యాణం సినిమాలో పాత్ర‌ల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ నుంచి డైరెక్ట‌ర్ చ‌క్క‌టి వినోదాన్ని రాబ‌ట్టుకున్నారు. కామెడీ చాలా ఆర్గానిక్‌గా ఉంటుంది. డైరెక్ట‌ర్ కథ చెబుతుంటే కొన్ని సార్లు నవ్వొచ్చింది, కొన్ని సీన్స్ కు ఎమోషనల్ అయ్యాను. బాలరాజు పాత్రతో సహా ఆయన కంప్లీట్ స్క్రిప్ట్ చెప్పారు. స్క్రిప్ట్ తో పాటు దర్శకుడిగా భ‌ద్ర‌ప్ప‌లోని నిజాయితీ న‌చ్చి అప్రోచ్ నచ్చి ఈ సినిమా ఒప్పుకున్నాను.

తెలంగాణ యాస‌...

కొన్ని సినిమాల్లో చెప్పేందుకు ఏమీ ఉండదు. ద‌ర్శ‌కులు క్రియేట్ చేసిన‌ క్యారెక్టర్ చేసుకుని వెళ్లిపోతాం. కానీ క్రేజీ కల్యాణం లాంటి సినిమాలకు నా అభిప్రాయాలు చెప్పి, మాట్లాడుకుని స్వేచ్ఛ దొరికింది. సీనియ‌ర్ న‌రేష్‌ అఖిల్, తరుణ్..ఇలా మేమంతా కలిసి డిస్కస్ చేసుకుని నటించాం. సీన్స్ మరింత బెటర్ గా వచ్చేందుకే చాలా క‌ష్ట‌ప‌డ్డాం. క్రేజీ క‌ళ్యాణం కోసం తెలంగాణ యాసలో మాట్లాడాను. యాస కోసం ప్రత్యేకంగా వర్క్ షాప్స్ చేయలేదుగానీ డైరెక్టర్ చెప్పిన మాట‌ల‌ను బాగా ప‌రిశీలిస్తూ డైలాగ్స్ చెప్పాను.

అమ్మ‌నాన్న‌ల‌కు  న‌చ్చింది...

మా అమ్మ‌నాన్న‌ల‌కు క్రేజీ కల్యాణం బాగా న‌చ్చింది. సినిమా చూసిప్రశంసించారు. తెలుగు భాష రాకున్నా వాళ్లకు సినిమాలోని ఎమోషన్ కనెక్ట్ అయ్యింది. ప్రేక్షకులకు ఈ సినిమా వాళ్ల ఇంటి కథలా అనిపిస్తుంది. క‌థానాయిక‌గా క‌థ‌లు, పాత్ర‌ల ప‌రంగా వైవిధ్య‌త కోస‌మే ప్ర‌య‌త్నిస్తుంటా. నా సినిమాలన్నీ ఒకేలా ఉన్నాయని ప్రేక్షకులు అనుకోకూడదు. డబ్బుల కోసం నటించ‌ను. కొత్తగా ప్రయత్నించాలనే ప్యాషన్ నన్ను నడిపించాలి. ప్రస్తుతం తమిళంలో, మలయాళంలో కొన్ని సినిమాలు అంగీక‌రించా .

 

Advertisement
Advertisement