త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ICICI Lombard | ఐసీఐసీఐ లాంబార్డ్ షేర్‌హోల్డర్లకు గుడ్‌న్యూస్.. ఒక్కో షేరుపై రూ.7 డివిడెండ్..

ICICI Lombard | ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ తమ వాటాదారులకు శుభవార్త అందించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.7 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది.

S

Business | Published On Oct 15, 2026, 3.28 pm IST

ICICI Lombard | ఐసీఐసీఐ లాంబార్డ్ షేర్‌హోల్డర్లకు గుడ్‌న్యూస్.. ఒక్కో షేరుపై రూ.7 డివిడెండ్..
Advertisement

ICICI Lombard | ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ తమ వాటాదారులకు శుభవార్త అందించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.7 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది. కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం.. ఒక్కో ఈక్విటీ షేరు ముఖ విలువ రూ.10లో 70 శాతానికి సమానంగా, అంటే రూ.7 మధ్యంతర డివిడెండ్ చెల్లించేందుకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఈ డివిడెండ్‌కు అర్హులైన వాటాదారులను నిర్ణయించేందుకు అక్టోబర్ 23ను రికార్డ్ తేదీగా ఖరారు చేసింది. వర్తించే నిబంధనల ప్రకారం మూలం వద్ద పన్ను మినహాయించిన అనంతరం, అర్హులైన ఈక్విటీ వాటాదారులకు నవంబర్ 12 నాటికి లేదా అంతకంటే ముందుగా మధ్యంతర డివిడెండ్ చెల్లించనున్నట్లు కంపెనీ తెలిపింది.

పెరిగిన ఆదాయం..

2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ మెరుగైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.820 కోట్ల నికర లాభంతో పోలిస్తే, ఈసారి నికర లాభం 15.4 శాతం పెరిగి రూ.946 కోట్లకు చేరింది. కంపెనీ నికర ఆర్జిత ప్రీమియం కూడా గణనీయంగా పెరిగింది. గతేడాది ఇదే కాలంలో రూ.5,652 కోట్లుగా ఉన్న నికర ఆర్జిత ప్రీమియం, ఈ ఏడాది 17.7 శాతం వృద్ధితో రూ.6,652 కోట్లకు చేరినట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు సమర్పించిన వివరాలు వెల్లడించాయి. కాగా గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ షేరు ధర రూ.1694 వద్ద ముగిసింది. అంతకుముందు రూ.1,725 వద్ద ముగిసిన ఈ షేరు, బుధవారం రూ.1,779 వద్ద ప్రారంభమైంది. అయితే గురువారం సెష‌న్‌లో షేర్ ధ‌ర త‌గ్గిన‌ప్ప‌టికీ మొత్తంగా చూస్తే ఈ షేర్ గ‌త రెండు నెలలుగా రూ.300 మేర పెరిగింది. అయితే ఏడాది ప్రాతిపదికన చూస్తే 7.65 శాతం తగ్గుదల నమోదైంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.92,610.01 కోట్లుగా ఉండగా, ప్రైస్ టు ఎర్నింగ్స్ నిష్పత్తి 68.30గా ఉంది.

Advertisement
Advertisement